3/08/2022.
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం: మనసు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
ప్రక్రియ : ఆట వెలది.
మంచి చెడుల తీరు మనదు మేలును కోరు
మనసు తెలుపు మాటె మంచి బాట
మనసు చెప్పు మాట మనసార వినుమయ్య
మనసు మిత్రు డిలను మరువ కయ్య ॥
మనిషి లోన మనసు మర్మ మెరుగ దయ్య
నీకు మేలు జేయ నిలుచు నెపుడు
బుద్ధి బురద చేర సుద్ధి మాటలు జెప్పు
సుఖపు బాట జుాపు సులభ గతిని ॥
మనిషి హృదయ మందు మాన్య దేవత లుండు
దేహ మీదు కొలువు దేవ తలకు
గుడులు గోపు రాలు గుణము నేర్పవు నీకు.
మనసె పాఠ శాల మరువ బోకు !
No comments:
Post a Comment