Monday, August 29, 2022

నా దేశం ,నా తెలుగుకు నమస్సులు.

మహతీ సాహితీ కవి సంగమంలో 
అంశం :  నా దేశం ,నా తెలుగుకు నమస్సులు.
ప్రక్రియ : ఇష్టపది .
రుపకర్త : శ్రీ అడిగొప్పుల సదయ్యగారు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి : 
కల్యాణ్ మహారాష్ట్ర .


యాబది యారక్షర యాస ఉన్నది తెలుగు
భక్తి, విభక్తులతో  భవిత వెలుగిడు తెలుగు.
అమ్మ పాడే పాట నలరారినది తెలుగు
పసి పాప నవ్వులో పంచు మధురిమ తెలుగు ॥

అక్షరపు కుార్పులో అందమున్నది తెలుగు
పద్య, గద్య, రచనల పంచదారల జిలుగు
కవన పుా దోటలో కావ్య భాషల వెలుగు
అందమైన భాషిది అమ్మ సాటీ తెలుగు ॥

జానపద తోటలో  జామపండీ తెలుగు
త్యాగయ్య పాటలో  రాగ భక్తికి వెలుగు
అన్నమయ్య నోటను అలరిన పాట తెలుగు
 వేద నాద ఘొాషల వెలుగు వెన్నెల తెలుగు ॥

మువ్వ గోప పదముల ముద్దులొలికిన తెలుగు
క్రిష్ణ దేవరాయల కీర్తి మకుటము తెలుగు
అష్ట దిగ్గజాలకు అలరు వన్నెల జిలుగు
అదె భాను తేజమై అవని వెలిగిన తెలుగు ॥

 కంద ఛంద అందపు కవుల కలమీ తెలుగు
 తేట గీతుల వేట తేనె పలుకీ తెలుగు 
  పద్య సీసము లోన  పలు గణముల పలుకుా
  ఆటవెలదుల గుాడి ఆడి పాడిన తెలుగు ॥

గోరేటి వెంకన్న గోడు గోసల వెలుగు ॥
చందమామ పాటల విందు లాలీ తెలుగు .
యొాగి వేమన నోట  యొప్పు నీతుల పలుకు
 పాడి పంటల సిరుల పల్లె పాటల పలుగు ॥

ఉద్యమాల బాటను ఊపు నిచ్చిన తెలుగు
నిత్య శాంతిని కోరి నినదించేనీ తెలుగు.
గిడుగు వారి బాటలో గొడుగు సరళపు తెలుగు
మన సంస్కృతి మాటకు మంచి బాటది తెలుగు ॥

పచ్చదనపు వనమున పసిడి మామిడి పుాత
పారు నదుల నీటిని పంచు జీవన దాత
ఆ సేతు హిమాచల ఆరక్షణపు కోట.
అవని నిండు ప్రకృతిని అభివర్ణించే పాట ॥

సంస్కృతి  సాంప్రదాయ సమ్మేళనము తెలుగు
కట్టు బొట్టు తీరుకు కళ నిండిన వెలుగు
వేల జేల వెలుగుకు వేదికైనది తెలుగు
భక్తి నిండు కొలువుల భావ గీతము తెలుగు ॥

పురాణేతి హాసపు పుట్టినిల్లిదీశ్వరి 
సర్వ మంగళములకు సాక్షిభుాతమీశ్వరి 
భుా మాత భారతికి భుాషణ మిది ఈశ్వరి
వేల జేల నమములు వెలుగు తెలుగుకీశ్వరి ॥

హామీ: 
పై ఇష్టపదులు నా స్వీయ రచనలు.



 









No comments:

Post a Comment