Monday, August 29, 2022

యాబదియారక్షరాల సాహిత్యపు పుాదోట.

29/08/2022.
గో.ర.సం వారి గిడుగు జయంతి మరియూ తెలుగు భాషా దినోత్సవం కవితల కొరకు*

   అంశం :తెలుగు భాషా దినోత్సవం .
శీర్షిక  : యాబదియారక్షరాల సాహిత్యపు పుాదోట.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి :
కల్యాణ్ మహారాష్ట్ర .
8097622021.

ఆగష్టు " 29 "ని గిడుగు వారి జయంతోత్సవం
“తెలుగు భాషా దినోత్సవముగ" చరిత కెక్కిన ఘనం
తెలుగు గ్రాంధీక భాష వాడుక భాషైన సారం.
భాషోద్యమ కారుడైన గిడుగు చేసిన ఉద్యమ ఫలం॥

"దేశ భాషలందు లెస్స"గ చరిత కెక్కిన భాష
నాలుగు వేదాల సార , నవరతనాల ముాట .
సరళమైన  పదజాలపు సాహిత్యపు పుాదోట.
దేశ కీర్తి వెలుగు పలుకు  తీపి నిండు వెన్న పుాస ॥

  కావ్య ,కవనాల బాట వెలుగొందిన ఘన చరిత .
  పద్య, గద్య, పురాణేతిహాస శీల సుజాత .
  అష్ట దిగ్గజాల నోట  యతి ప్రాసల ఘన కోట
రాజ రాజేంద్రు డిలను మెచ్చిన నెచ్చెలి భాష ॥

అక్షరాల నినాదాల ,అదిరించిన శత్రు భయ
ఉద్యమాల బాట మాట అస్త్రమైన నిర్భయ.
మవ్వన్నెల పతాకాన ముజ్జగాల నేలు శుభద.
శాంతి సత్యహింసలనెడు సందేశపు ధర్మ కోట ॥

యాబది ఆరక్షరాల కీర్తి నేలిన భాష.
అచ్చు హల్లు పొల్లులు గల అక్షరాల విరి పుాత
వ్యాకరణము ఛందస్సుల వేడ్క వెలుగు జిలుగు తోట
వేయి మాట లేల నాదు మాతృభాష  జేల శీల ॥

*************************************

No comments:

Post a Comment