*మనుమసిద్ధి కవనవేదిక పోటీ*
అంశం:తేనెపట్టుతెలుగు
---------------------------------------
*శీర్షిక:వాగామృతం నా తెనుగు*
----------------------------------------
స్వరపేటికలో తంత్రులు
సరిగమలనుచ్ఛరించినపుడు
"వసుచరిత్రంతెత్తునుండి
సంగీతఝరులను
పారించదా మనతెలుగు!
మందార మకరంద పద్య భాండాలను
పోతన మోసి మోసి
రామచంద్రునికభిషేకించిన భాషమనది!
అన్నమయ్యచే సుప్రభాతగీతాలు
పాడించుకొనితడిసిముద్దైన
వేంకటేశ్వరుడు మురిసిమెరిసిపోడా!
"అటజని భూసురుడు
కాంచినదేమిటి?"
తెనుగుపద్యపుసొగసులనే కదా
అల్లసాని హిమగిరులపై కేతనంచేసి నిలిపాడు!
హరవిలాసలాస్యంతో శ్రీనాథకవితావిరి
లో మరందాన్నేత్రాగిన శివయ్య!
కథాఖండశర్కర,కవితా మాధురీ,గేయామృతభాండం నా తెలుగు!
వేయికిరణాలవెలుగు!
----------------------------------------
*కిలపర్తి దాలినాయుడు*
హామీ పత్రం:ఈ కవిత నా స్వంతం.మనపోటీకి వ్రాసినదే!
No comments:
Post a Comment