మగువ మహారాణి సమూహ *అడ్మిన్ విభాగం వారు* .
శ్రావణ శుక్రవారం విశిష్టత సంకలనం కొరకు
20 వాక్యాలలోపు ముందు మాటలు రాసి నా నంబర్ కు పంపండి.
రేపు ఉదయం 10 లోపు పంపండి.
మీ ఫోటో కూడా పెట్టండి.
మరిచిపోవద్దు😊
https://chat.whatsapp.com/GiGqqNbgdmTGZwuHjKzisW
మగువ మహారాణి ఛానల్ లో శ్రావణ మాస విశిష్టత ...
కొరకు ముందుమాట...
అంశం : శ్రావణ మాస విశిష్టత ...
శీర్షిక : నమ్మినవారికి నమ్మిన దైవం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి :
కల్యాణ్ మహారాష్ట్ర .
మన భారత దేశం సద్ధర్మ సాంప్రదాయాలకు భక్తి శ్రద్ధలకు పెట్టింది పేరు .సంవత్సర కాలమంతా ఏదో ఒక పుాజ, ఉత్సవం, నోములు, వ్రతాల, పేరుతో
జాతి ,మత బేధాలు లేని ఆప్యాయాయతానురాగాల
సందళ్ళతో పండగలను జరుపుకోవడం విధి విధాయకమయ్యింది.
ఆయు రారోగ్య ఐశ్వర్యాలకు సర్వ మంగళాలకు శుభ ప్రదమైనది ఈ పండగల విశిష్టత.
ఈ పండగల లో మహిళామణులకు ఉపయొాగపడే
మంగళ్య పరమైన పండగలు అత్యంత భక్తి
పరమైన ఆచార వ్యవహారసలతో కుాడుకొని ఉన్నవి.
వాటిలో శ్రాణ మాస నోముల వ్రత విధానం ఒకటి.
వర్షాకాల అరంభం లో వచ్చే ఈ పండగ లో
ఈ నెలంతా కుాడా భక్తి నిండిన భావుకతో
మహిళ లు ఆనందంగా ఈ పండగలను జరుపుకుంటారు.
శ్రావణ మంగళ వారాలు పెళ్ళి కావలసిన కన్నెలు
అత్యంత ఆశక్తితో మంచి వరుడు కావాలన్న కోరికతో చేస్తే , కొత్తగా పెళ్ళైన స్త్రీ లు తమ మాంగళ్య బలం కోసం ఐదు సంవత్సరాలు ఈ వ్రత నోముని ఆచరిస్తారు.
ఈ నోములో నానపెట్టిన శనగలు , పసుపు, కుంకుమలు, పుాలు, పండ్లు, తాంబుాలం వక్కలు జాకట్టు ,బట్టలు పంచడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
ఇక ఈ నెలలో వచ్చే నాలుగు శ్రావణ శుక్రవారాల లో
శ్రీ వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
శ్రావణ పుార్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు
మహిళ లందరుా బ్రహ్మ ముహుార్త సమయానికే స్నాన పానాదులు ముగించుకొని తమ ఇంటి ముందు రంగు రంగు రంగ వల్లులను తీర్చి దిద్ది , గుమ్మాలకు పసుపు కుంకుమలద్ది పచ్చని మామిడి తోరణాలను కట్టి
అమ్మవారైన శ్రీ వరలక్ష్మీ దేవి మండపాన్ని శోడదశ కళ లతో అలంకరించి , శోడశోపచారాది పుాజలతో లక్ష్మీ దేవిని పుాజించి, తొమ్మిది రకాల పిండివంటలు నైవేద్య మిడి, ముత్తైదులకు దక్షిణ తాంబుాలాది వస్త్ర దానములతో సత్కరించి వారి ఆశీర్వాదాలు గైకొని
బంధు మిత్రపరివారులతో కలసి విందారగిస్తారు.
ఈ వ్రతాన్ని తొలుత చారుమతి అనే స్త్రీ కి స్వయంగా వరలక్ష్మీ దేవియే స్వప్నంలో కనిపుంచి వ్రత విధానమును తెలియ పరచిందని నాటి నుండి నేటి వరకు ఆ చారుమతి కొలిచిన రీతిలోనే మహిళ లందరుా ఆ వరలక్ష్మీ దేవి వ్రతాన్ని ఆచరించి ,
చారుమతి స్వప్న వృత్తాంతమును కధగా చెప్పుకొని
కధాక్షతలను శిరసుపై జల్లుకుంటారు.
ఈ వ్రత మహిమతో ధన ధాన్య కనక వస్తు వాహనాలతోపాటు సర్వ మంగళ సౌభాగ్యాలు కలుగుతాయన్న నమ్మకంతో భక్తి శ్రద్ధలు నిండిన
ఆచారంతో మహిళ లందరుా ఇనాటికీ ఈ వ్రతాన్ని జరుపుకుంటారు . ఈ పండగలు వ్రతాలలో ూన్న విశిష్టతనేగాక మగువలను ప్రోత్సహించేందుకు
"మగువ మహారాణి" అన్న పేరుతో ఒక యుాట్యుాబ్
ఛానల్ ను ఏర్పరచేరు.
మగువ మహారాణి యుాట్యుాబ్ ఛానల్ కేవలం
మగువలకు మాత్రమే ప్రత్యేకంగా నిర్దేశించిన ఛానల్...
శ్రీ దేవవరపు ఈశ్వర్ గారు, వారి గ్రుాప్ అడ్మిన్ లు కలసి .ఈ సముాహాన్ని మహిళలకు మాత్రమే
నిర్దేసించి...వారిలో నున్న సాహిత్యాభిలాషను వెలికితీస్తున్నారు.
అద్భుతమైన అంశాలను ఇస్తుా ,మహిళలు తమ ఇంటినుండే
మొాబైల్ వీడియొాల ద్వారా తాము రాసిన కవితలను చదివి పంపే అవకాశాన్ని కల్పిస్తుా ప్రోత్సహిస్తున్నారు.
మహిళలు వీడియొాలద్వారా పంపిన
కవితలకు బేక్ గ్రౌండ్ కలరింగ్ తో పాటు
మ్యుాజిక్ తో వచ్చే టైటిల్స్ ను జతచేసి
మహిళా కవయిత్రి పంపిన కవితను
వీడియొా ప్రసారణ చేస్తుా యుాట్యుాబ్ ఛానల్ లో అప్లోడ్ చేసి మహిళలకు
స్ఫుార్తి నిస్తున్నారు. అంతేకాదు ప్రసిద్ధి చెందిన ఎన్నో కవితా వేదికల గ్రుాప్ ల అడ్మిన్ల తో
సత్సంబంధాలను కలుపుకొని వారి సహకారంతో ఎందరో మహిళలను ప్రోత్సాహపరుస్తుా..
వారిలోనున్న కళకు ప్రాణం పొిస్తున్నారు.
ఈ సంవత్సరం" శ్రావణ మాస విశిష్టత "అనే అంశం తో
మహిళామణుల కలాలకు పదును పెట్టించి అద్భుత కవనాలను వీడియొాలద్వారా మనకు అందించనున్నారు.
కళామతల్లినే కాక మహిళామణులందరినీ గౌరవిస్తుా వారు చేస్తున్న ఈ సాహిత్య సేవ అభినందనీయం.
సాహిత్యాభిలాషులందరుా వారు చేస్తున్న ఈ సాహిత్య సేవకు తమ వంతు సేవగా ఛానల్ వారిని ప్రోత్సహిస్తుా "మగువ మహారాణి" అనే ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసి కవితలు చదువుతున్న మహిళామణులకు .
తగిన స్ఫుార్తినిస్తారని తలుస్తాను.
ఈ ఛానల్ను విజయవంతంగా ముందుకు నడుపుతున్న దేవ వరపు ఈశ్వర్ గారికి వారికి సహకరిస్తున్న కార్యవర్గ బృందానికి , అడ్మిన్లకు మనఃపుార్వక ధన్యవాదాలు తెలుపుతుా...నమస్కారం ..🙏🙏
*****************:::::::::::
మన భారత దేశం సద్ధర్మ సాంప్రదాయాలకు భక్తి శ్రద్ధలకు పెట్టింది పేరు .సంవత్సర కాలమంతా ఏదో ఒక పుాజ, ఉత్సవం, నోములు, వ్రతాల, పేరుతో
జాతి ,మత బేధాలు లేని ఆప్యాయాయతానురాగాల
సందళ్ళతో పండగలను జరుపుకోవడం విధి విధాయకమయ్యింది.
ఆయు రారోగ్య ఐశ్వర్యాలకు సర్వ మంగళాలకు శుభ ప్రదమైనది ఈ పండగల విశిష్టత.
ఈ పండగల లో మహిళామణులకు ఉపయొాగపడే
మంగళ్య పరమైన పండగలు అత్యంత భక్తి
పరమైన ఆచార వ్యవహారసలతో కుాడుకొని ఉన్నవి.
వాటిలో శ్రాణ మాస నోముల వ్రత విధానం ఒకటి.
వర్షాకాల అరంభం లో వచ్చే ఈ పండగ లో
ఈ నెలంతా కుాడా భక్తి నిండిన భావుకతో
మహిళ లు ఆనందంగా ఈ పండగలను జరుపుకుంటారు.
శ్రావణ మంగళ వారాలు పెళ్ళి కావలసిన కన్నెలు
అత్యంత ఆశక్తితో మంచి వరుడు కావాలన్న కోరికతో చేస్తే , కొత్తగా పెళ్ళైన స్త్రీ లు తమ మాంగళ్య బలం కోసం ఐదు సంవత్సరాలు ఈ వ్రత నోముని ఆచరిస్తారు.
ఈ నోములో నానపెట్టిన శనగలు , పసుపు, కుంకుమలు, పుాలు, పండ్లు, తాంబుాలం వక్కలు జాకట్టు ,బట్టలు పంచడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
ఇక ఈ నెలలో వచ్చే నాలుగు శ్రావణ శుక్రవారాల లో
శ్రీ వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
శ్రావణ పుార్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు
మహిళ లందరుా బ్రహ్మ ముహుార్త సమయానికే స్నాన పానాదులు ముగించుకొని తమ ఇంటి ముందు రంగు రంగు రంగ వల్లులను తీర్చి దిద్ది , గుమ్మాలకు పసుపు కుంకుమలద్ది పచ్చని మామిడి తోరణాలను కట్టి
అమ్మవారైన శ్రీ వరలక్ష్మీ దేవి మండపాన్ని శోడదశ కళ లతో అలంకరించి , శోడశోపచారాది పుాజలతో లక్ష్మీ దేవిని పుాజించి, తొమ్మిది రకాల పిండివంటలు నైవేద్య మిడి, ముత్తైదులకు దక్షిణ తాంబుాలాది వస్త్ర దానములతో సత్కరించి వారి ఆశీర్వాదాలు గైకొని
బంధు మిత్రపరివారులతో కలసి విందారగిస్తారు.
ఈ వ్రతాన్ని తొలుత చారుమతి అనే స్త్రీ కి స్వయంగా వరలక్ష్మీ దేవియే స్వప్నంలో కనిపుంచి వ్రత విధానమును తెలియ పరచిందని నాటి నుండి నేటి వరకు ఆ చారుమతి కొలిచిన రీతిలోనే మహిళ లందరుా ఆ వరలక్ష్మీ దేవి వ్రతాన్ని ఆచరించి ,
చారుమతి స్వప్న వృత్తాంతమును కధగా చెప్పుకొని
కధాక్షతలను శిరసుపై జల్లుకుంటారు.
ఈ వ్రత మహిమతో ధన ధాన్య కనక వస్తు వాహనాలతోపాటు సర్వ మంగళ సౌభాగ్యాలు కలుగుతాయన్న నమ్మకంతో భక్తి శ్రద్ధలు నిండిన
ఆచారంతో మహిళ లందరుా ఈ వ్రతాన్ని జరుపుకుంటారు .
No comments:
Post a Comment