[7/9 18:33] p3 503501: 07/09/2022.
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : పల్లె.
శీర్షిక : పాడి పంటకు కొలువు పల్లెటుార్లు.
పద్య ప్రక్రియ : ఆటవెలది.
రచన :
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర
పచ్చనైన చేల పలకరింపుల తోడ
పుాలజల్లు కురియు పుడమి నీడ
నిండు చెరువు నీట నిత్య తామరలున్న
పరవసించు ప్రకృతి పల్లె మాది. ॥
సుప్రభాతము లిడు సుకపికా రవములుా
రంగు పుాల వనపు రాసి తరులు
సమత మమతల నిడు సమదృష్టి గలవారు
పంచు నిండు ప్రేమ పల్లె టుార్లు ॥
పలకరింపుల కడు పలుప్రేమ బంధాలు
కలసి జేయు పనుల కళలు మెండు
సభ్యతెరిగినట్టి సంస్కారములు నిండు.
దాన గుణములున్న దాతలుండు ॥
రచ్చబండ తీర్పు రక్షించు న్యాయాలు
రాజు-పేద యనెడు రణము లేదు.
మేలు పండగలకు మెప్పించు భాగ్యాలు.
వరుస మాన్య ధనపు వసుధ మాది ॥
పాడి పంటలుగల పసిడి బంగరు భుామి.
గ్రామ దేవత మము గాచు సుమ్మి.
భోగ భాగ్యములిడు బోనాల భోగాల
సందడించు పల్లె సఖ్యముగను ॥
వెన్న మీగడలతొ వెరసి వంటలు వేలు
పలుకు తేనె లొలుకు పల్లె లందు ॥
స్వాగతమ్ము మీకు స్వాదు విందులకండి
పల్లె రుచుల తీరు పలుక రండి ॥
***************************** ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*
*నేటి ఉత్తమ పద్య కవులు:(07-09-2022)*
శ్రీ/శ్రీమతి
1.డా.వేదాల గాయత్రీదేవి
2.గుడిపూడి రాధికారాణి
3.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
4.డా.బల్లూరి ఉమాదేవి
5.పోగుల భాగ్యలక్ష్మి
6.ఎలగందుల లింబాద్రి
7.ఎం వి ఉమాదేవి
*నిర్వాహక/సమీక్షక బృందము*
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
No comments:
Post a Comment