[5/9 18:48] p3 503501: 05/09/2023
మహతీ సాహితీ కవి సంగమం
అంశం : చిత్ర కవిత .
శీర్షిక : అక్షర బ్రహ్మ ( గురువు .)
ప్రక్రియ : చన కవిత .
రచన :
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర
ప్రక్రియ : ఇష్టపది
సద్గుణ శీలులైన సాధు వర్తులు గురులు
సత్య భాషణమిడు సార జ్ఞానపు నిధులు ॥
సంస్కారము సంస్కృతి సరి నేర్పు బోధకులు
సంస్కరించగ మనల సరి మార్గదర్శకులు ॥
గురుది దేముని చుాపు గురు త్రిముార్తుల రుాపు
సరి సమానపు దృష్టి సద్భావనల కుార్పు
గణనీయమౌ ఘనసు బోధ జేసెడు నేర్పు ॥
గురుతు విద్యల జ్ఞాన గుాఢ మర్మము దెల్పు॥
గర్వ మన్నది లేని ఘన సార సౌమ్యుడుా॥
బుద్ధి బలమును పెంచు సుద్ధ తత్త్వపు ముార్తి
ఓ న మః దిద్దించి నోర్మి విద్యల నేర్పు
సిద్ధ చారణుడతడు శ్రీ వాణి పుత్రుడు॥
భువిని కల్పము యతడు భుారి విద్యలు నేర్పు
భవిత వెలుగుకు బాట భాగ్యాక్షరపు కొలువు
చరిత లెల్లను దెలిపి చరితార్ధులుగ జేసి
మనల దీర్చి దిద్దు మహి బ్రహ్మ రుాపతడు ॥
విద్యార్ధులను దీర్చి విజయపథమున నడుపు
విజయ సారధి యైన విష్ణు రుాపము యతడు
విద్య నేర్పిన గురుని విలువ తెలియు మన్న
గురువు నేర్పిన విద్యె గురుతు నీ ఉనికన్న ॥
గురువు సర్వేపల్లి గురుతు జన్మ దినాన
ఉపాధ్యాయోత్సవ ఉత్సవమె కడు మేటి
విద్యార్ధులందరును విశ్వగురులను దలచి
పుాజ్య గురులను కొలిచి పుాజించు శుభదినము ॥
హామీ : ఈ కవిత నా స్వీయ రచన .
[5/9 20:34] +91 94418 71767: 3️⃣7️⃣
విద్యార్ధులను దీర్చి విజయపథమున నడుపు
విజయ సారధి యైన విష్ణు రుాపము యతడు
విద్య నేర్పిన గురుని విలువ తెలియు మన్న
గురువు నేర్పిన విద్యె గురుతు నీ ఉనికన్న ॥
తమరి ఇష్టపదులు అద్భుతం మేడం🙏🙏🙏
No comments:
Post a Comment