Sunday, September 11, 2022

ఆవు

03/09/2022
మహతీ సాహితీ కవి సంగమం 
అంశం : ఆవు.
శీర్షిక : గోవు మనకు వేల్పండి-
 గోమాతకు మ్రొక్కండి.

రచన :
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర

అందమైన పిల్లలుా అల్లరేల బాలలుా
అమ్మ మాట విన రండి ఆవుపాలు తాగండీ
అమ్మ పాలు తాగినారు అందంగా ఎదిగినారు.
అమ్మ పాల వంటి మేటి గోవు విలువ తెలుసుకోండి ॥

పాల సంద్రమున పుట్టిన పసిడి లక్ష్మి రుాపిదండి
 ముక్కోటి దేవతలకు నెలవైనది గోవుసుండి.
 మీగడంత తోడిడగా వచ్చు పెరుగు చిలకండీ 
ముద్దు కృష్ణ మెచ్చు వెన్నముద్ద లెంతొ రుచి కదండి॥
 
 పాల తోడు పెరుగది చలవచేయు సారమండి.
 పాయసాల రుచులు ఆవు పాలతోనె మెరుగండి .
తీయనైన పాల వేల పాకములిడు దినుసులండి .
 తీపి పాకముల కమ్మని నేతి ఋచులు తినరండి ॥
 
 మేలు పోషకాల ఫలము ఆరోగ్యము నిడు గుణము
ఆవు పేడ ఎరువు ధనము  మేలు వంట కింధనము
తగ్గునుాబకాయము ఎముకలకిడు కడు బలము .
రోగ ముక్తి కౌషధమ్ము  కలిమి పంచు మేటి వరము ॥

ఆవు అమ్మ వంటిది బేధమెంచబోదది .
ఎవరికైన ఆకలన్న గోవుపాలె పెన్నిధి.
పచ్చగడ్డి తినెడు పాడి యావు భువిని వేల్పది 
పంచ గవ్యములిడు మాతకు చేతులెత్తి మ్రొక్కండి ॥

--------------------------------------


హామీ : ఈ కవిత నా స్వీయ రచన.

No comments:

Post a Comment