20/09/2022
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : రుబాయిలు.
శీర్షిక : కరుణించు క్రిష్ణయ్యా..🙏
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
నువువేణువు నుాదినంత వివసులమై నిలచితిమే
నీ రుాపము చుాడనంత ఆర్తులమై పిలచితిమే
నీకోసమె మాబ్రతుకని నీవెరుగవ శ్రీకృష్ణా !
నీపాదము మొాపినంత దాసులమై కొలచితిమే ॥
వెన్న దింగిలించినా వెక్కిరించలేదయా
రేపల్లె జనులంతా ధిక్కరించలేదయా
నీ బాల లీలలకై నిలచి వేచినారుగా
కారణజన్ముడవీవు కరుణించ రావయా ॥
నీ వేణు గానముల నాదమై పాడనా
నీ కాలి అందియల మువ్వనై ఆడనా
నీరాక కోసమై స్వైరిణై వేచితిని
నీకరుణామృతముల బంధమై వేడనా ॥
********************************
No comments:
Post a Comment