Wednesday, September 21, 2022

బాల సాహిత్యం

అంశం: బాలసాహిత్యం
( త గుణింతముతో)
శీర్షిక: బ్రతుక నేర్వాలి కన్నా .
శీర్షిక  : గేయ కవిత.
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.



తొలి వందన మిడు తొలి వేల్పులకు
తొలి వేల్పులు మన తల్లిదండ్రులు .॥
తొలి వందన మిడు గురువు పెద్దలకు
తేడా జుాపని జ్ఞాన  దాతలకు ॥

తొలి జేసిన మన పుణ్య ఫలమిదే
తల్లి గర్భమున మానవ జన్మే ॥
తలచ చక్కన్ని తనువు ధనమిది
తలచు కార్యయములు జేయు పెన్నిధి॥

తొలి కోడి కుాతకు చలి యనుచు జోగక
తోడుతు నిద్దుర  లేవాలి ॥
తల్లిదండ్రుల మాఁట మన్నించి
తీరుగ స్కుాలుకు వెళ్ళాలి ॥

తెలుగు భాష మన మాతృభాష గద
తెలుగక్షరాలు నేర్వాలి.॥
తేట తెల్లని లేత మనసుతో
తెలివితొ చదువులు చదవాలి ॥

తండ్రి పేరు నిలబెట్టాలి.
తగిన ఘన కీర్తి పొందాలి ॥
తక్కు వెక్కువల బేధము నెంచక
తీరుగ చెలిమితో మెలగాలి ॥

తాయిలాలు తినుబండారాలను
తోడుగ కలసి భుజించాలి.॥
తీయని నీతిడు కధలను జెప్పే
తాత బామ్మలను ప్రేమించాలి ॥

తోడ పుట్టిన  అక్కాచెల్లెలకు
తోడుా నీడగ నిలవాలి ॥
తెంపరి తనమును విడనాడాలి
తప్పులు చేయక యుండాలి ॥

తారతమ్యములు విడనాడాలి.
తారల వలె తళుకీనాలి ॥
తేట ప్రకృతికి పచ్చదనమునిడు
తరువు చెరువులను కాపాడాలి॥

తావీయకు నువు తగాదాలకు
తంటాలన్నవి తగవుర మనకు ॥ 
తీయని మాటలు తేనెల ఊటలు
తరతరాలకవి తరగని  నిధులు ॥

పాడి పంటలతొ కళ కళ లాడే
తల్లి భారతికి ప్రణమిల్లాలి ॥
తిరుగు లేనిదౌ మాటుండాలి
తీర్పు నేర్పులతొ జీవించాలి ॥









No comments:

Post a Comment