Friday, September 23, 2022

అంశం : దైవం.పొర్ల వేన గోపాలరావు. Good.

*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *22-09-2022-గురువారం*
అంశము: *దైవం*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *సహస్ర శీర్షం దేవం...*
ప్రక్రియ: *ఇష్టపది*
*********************
*(1)*
*ఆది మధ్యాంతముల*
*నసలె యెఱుఁగని వాడు!*
*అఖిలలోకంబులకు*
*నాధార భూతుండు!*
*సృష్టి,స్థితి,లయలందు*
*దృష్టి నిలిపినవాడు*
*చతుర్దశ భువనముల*
*చలనకారకుడతడు!*
*అన్ని శక్తుల మించు*
*నాది మౌలిక శక్తి!*
*భూ,నభోంతరాళపు*
*పురుడుబోసినవాడు!*
*చతురంగ బలుడతడు*
*చదరంగమున రేడు!*
*ఇదియె దైవపు హేల!*
*ఇల వేణుగోపాల!!*

*(2)*
*మట్టిబొమ్మలజేసి*
*మాయలో ముంచునట!*
*మరల మహిమలు జూపి*
*పరలోకమిచ్చునట!*
*నవరంధ్రముల తిత్తి*
*నవరసంబుల నింపి*
*నటనాలయంబులో*
*నాటకము నడిపించు!*
*దుష్టులను పరిమార్చు*
*శిష్టులను రక్షించు!*
*వేవేల నామాలు!*
*వేవేల రూపాలు!*
*వేదవేదాంగాలు*
*వేలుపన్నది యతడె!*
*ఇదియె దైవపు లీల!*
*యిల వేణుగోపాల!!*
*********************
హామీపత్రము.. *స్వీయరచన*

No comments:

Post a Comment