Tuesday, October 11, 2022

అమ్మొారి బోనాలు.

శీర్షిక : అమ్మొారి బోనాలు. 
ప్రక్రియ : ఇష్టపది .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .



అమ్మలగన్నమ్మలు ఆది పరాశక్తులు
ఆట పాటకు మురియు అందరి కొలువమ్మలు ॥
గ్రామాలను గాచే గ్రామ దెేవతలుగా
 ఊరి పొలిమేరలో ఉండేటి దేవతలు  ॥
 
 తర తరాల పుాజలు తల్లికిడు బోనాలు
 ఊరంత పరవళ్ళు ఉత్సవపు సందళ్ళు ॥
 అష్టోత్తర పుాజలు అమ్మకిడు హారతులు
 నీరజా నేత్రికీ నిత్యకల్యాణాలు .॥

వేప కొమ్మల నీడ  వెలసింది  దుర్గమ్మ 
వేల పేరులతోటి  వేంచేసె దుర్గమ్మ.॥
పేరు పేరున భయము పెకిలించు మాయమ్మ 
మహిమలున్నది తల్లి మా యింటి వేల్పమ్మ ॥

పసుపు ముద్దగ తల్లి పంచె మంగళములను
కరుణ నిండిన కనుల గాచేను పల్లెలను
వత్సరముకొకసారి వచ్చేటి మాయమ్మ
వందనము లిడి కొలువ వచ్చేము మేమమ్మ ॥

మా కష్ట నష్టాల  మము గాచినావమ్మ
మాపిల్ల పాపలకు మంచి చేయగ కొమ్మ
బోనాల నెత్తేము భోగ భాగ్యాలమ్మ 
ఆరగించవెతల్లి  అమ్మ మాంకాళమ్మ ॥

అందాల తల్లికీ  ఆట పాటలతోడ 
ఆనంద పరచంగ ఆజ్ఞ కోరితిమమ్మ
రంగు రంగుల పుాల రాసి రాట్నాలమ్మ
వేడ్క  విందులు గొనుమ వేగ వల్లుారమ్మ

పసుపు కుంకుమలద్ది  పారాణి నదె దిద్ది
పచ్చ చీరను జుట్టి  పులకరించితిమమ్మ
 మా పాపముల గావు మా మజ్జి గౌరమ్మ
 మంగళమ్ములనిడవె  మాత మహలక్ష్మమ్మ  ॥

సుార్య చంద్రుని కళల సుక్క ఇరుకళలమ్మ
మావుారి దేవతగ మసలు మావుళ్ళమ్మ
తలచు కోర్కెల దీర్చు తల్లీ తలుపులమ్మ 
పసుపు గౌరిగ మమ్ము  పాలించరావమ్మ ॥

అర్ధనారీశ్వరీ అమ్మ అంకాళమ్మా
మా సీమ గాచేవు  మంచిగ శీతలమ్మ
సమ్మక్క సారక్క శక్తి  నాంచారమ్మ 
పాడి పంటలు గాచు  బంగారు బతుకమ్మ॥

 ఎల్లమ్మ పోలమ్మ  ఏలు నుాకాలమ్మ
మంచి ముత్యాలమ్మ మాతల్లి మరిడమ్మ
మాత అంకాళమ్మ మా పైడి తల్లమ్మ
మాత ఈశ్వరి కరుణ మా పైన చుాపమ్మ ॥


**************************************
హామీ : 
పై ఇష్టపదులు నా స్వీయ రచనలు.
*****************************

No comments:

Post a Comment