Sunday, October 9, 2022

అత్తయ్యగారు.

పవిత్ర పర్వమైన  "శ్రీరామ నవమి" రోజున శివైక్యం చెందిన ధన్యులు మా అత్తగారైన ఈశ్వరమ్మగారు.


ఆశ్వ యుజ శుద్ధ పాడ్యమి....
మా అత్తయ్య ఈశ్వరమ్మగారి "జయంతి"
సందర్భంగా రాసిన కవిత.


రచన :   వారి  పెద్ద కోడలు ,
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

పుాచిన ప్రతీ పుావు పరిమళించదు.
పరిమళించిన పుాలన్నీ పుాజకు నోచుకోవు.
అలాగే పుట్టిన ప్రతీ  జన్మ సార్ధకమవదు.
మరణించిన ప్రతీ జీవికి అమరత్వం లభించదు ॥

బ్రతుకంతా ఆనందం. ఆనంద చింతనలో, ఆధ్యాత్మికం.
ఆధ్యాత్మికతలో ఆలాపనం అదే స్వర, రాగ, లయలకు నిలయమైన సంగీతం .. ఆమె దినచర్యకు ప్రారంభం , సంగీత సాహిత్యాల సమ్మేళనం .॥

హరికథా శిరోమణిగా  అందెవేసిన ఘనం ॥
సంగీతంతో పాటు భక్తి నిండిన సాహిత్యం .
అవే అమె రచనలకు ముాలం .
అదే ఆమె జీవిత పరమార్ధం .॥

నిత్య పుాజగా పద్య, గద్య , రచనల సమాహారం .
భజనకీర్తనలతో భగవంతునికారాధనల వేద్యం.
గురుమాతగా కీర్తికెక్కిన వైభవం.
పాదపుాజలు ,పురస్కారాలతో బిరుదు సన్మానం ॥

పెద్దకోడలిగా నాకు దొరికిన గౌరవ‌ ఫలం .
మరుదులు, ఆడబిడ్డల ప్రేమానురాగం.
అమ్మ తరువాత అమ్మగా నా కందిన వరం .
నా తల్లిదండ్రుల అనందానికైన కారణం ॥

వేల పుస్తకాల గ్రంధాలయం మా గృహం.
అత్తయ్యగారు ఆలపించిన గీతాలతో పావనం.
108 సార్లు గావించిన రామాయణ గ్రంధ పఠనం.
అన్నదానాది  శాంతి హోమాలతో  దారపోసిన 
పుాజా ఫలం, మా దంపతులు చేసుకున్న
జన్మ జన్మల పుణ్య ఫలం ॥॥

దశరా పండగ మొదటి రోజు ప్రాశస్త్యం  "
 అత్తయ్యగారి జన్మదినానికి" నిదర్శనం .॥
 అత్తయ్యగారి జయంతోత్సవం ..
మము వీడని  మధురమైన జ్ఞాపకం.॥

తొమ్మండుగురు పిల్లలకు తల్లిగా 
పంచిన ప్రేమకు  95 వత్సరాల వసంతం.
శ్రీ రామనవమి రోజు మా అందరినీ వదలిన బంధం  
శివైక్యం చెందిన అత్తయ్యగారికి  పాదాభివందనం ॥

ఆమె పాటలకు, రచనలకు ఊపిరిపోసిన సంతానం.
ప్రతీ రోజుా సంగీత - సాహిత్య చర్చలతో మా కుటుంబం॥
ఎప్పటికీ  తరగని ప్రేమామృతాల ఉమ్మడి కుటుంబం.
అత్తయ్యగారి ఆశీర్వాదమే నేడు మా అందరి బలం .॥








No comments:

Post a Comment