బాల సాహిత్యంలో ..
అంశం : గాంధీ తాత .
శీర్షిక : గాంధీ తాతాకు వందనము.
ప్రక్రియ : గేయ కవిత.
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
చిట్టి పొట్టి చిన్నారి పిల్లలము
గాంధీ తాతాకు వందనము.॥
స్వ భారత మాతకు బిడ్డలము.
భవిత చరిత నిలబెట్టెదము ॥చిట్టి ॥
అక్టోబరు నెల రెండవ తేదీన..
పోరుబందరులొ పుట్టెేడు .
సీమ చదువుకై వెళ్ళేడు..
బారిష్టరుయై వచ్చేడు॥ చిట్టి ॥
కరంచందు మరి పుత్లీబాయిల
పుణ్య ఫలము మన గాంధిజీ ॥
కస్తుారీబా సహచరిణినిగ...
నలుగురు పిల్లల తండ్రోయి ॥చిట్టి॥
ఆంగ్లేయుల పరిపాలనలో
అవమానితుడై నిలిచేడు
జాతి బేధములు వలదు వలదని
నాయకుడై పోరాడేడు ॥ చిట్టి ॥
అస్పృశ్యత, కులవివక్షతలు మరి
మతవిద్వేషాల మార్పులకుా
సత్య- అహింసా-శాంతి బాటలో-
సత్యాగ్రహములు సలిపాడు ॥చిట్టి ॥
హిందుా , ముస్లిమ్, సిక్కు, ఇసాయిలు
భాయుా భాయని అన్నాడు .
జాతి భేదములు చుాపించొద్దని
సమైక్యతకు విలువిచ్చాడు ॥ చిట్టి ॥
దేశ విభజనను వ్యతిరేకించీ
తీవ్రగతిని పోరాడేడు.
ఆమరణపు దిశ నిరాహారుడై
దీక్షను ప్రారంభించేడు ॥ చిట్టి ॥
కొల్లాయి కట్టుకట్టి
వెదురు కర్ర చేత బట్టి
నుాలు వడకు నట్టి మేటి
"జాతిపిత"యె గాంధీజీ ॥
మొాహన్ దాస్ కరంచంద్ ఘన
స్వాతంత్ర్యముకై పోరిడి
శాంతి బాటలో ఉద్యమించతడు
కీర్తిని ,చరితలో నిలచాడు॥ చిట్టి ॥
స్వాతంత్ర్యము మన కిచ్చాడు
తుాటాలకు బలియయ్యాడు.
"సత్యమేవ జయ జయతే" యనుచుా
తన ప్రాణాలను వదిలాడు.॥ చిట్టి ॥
సత్యశోధనకు అంకితమౌ మన
బాపుాజీకీ జై కొడదాం .
మువ్వన్నెల ఘన పతాక కీర్తిని
ఐక్యమత్యముతొ నిలబెడదాం ॥ చిట్టి ॥
No comments:
Post a Comment