Saturday, October 8, 2022

పొర్ల వేణుగోపాల్ గారి రచన (బాల సాహిత్యం ).

*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *08-10-2022-శనివారం*
అంశము: *బాలసాహిత్యం(న గుణింతం)*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *నింగికి నిచ్చెన వేస్తాం!*
ప్రక్రియ: *బాలగేయం*
*********************
*నవతరానికి వారసులం!*
*నవోదయానికి భాస్కరులం!*
*నవయువ శక్తిని చూపిస్తాం!*
*నవలోకమునే సృష్టిస్తాం!*

*నాకమునంటే నవ ఋషులం!*
*నాగరికతకే ప్రతినిధులం!*
*నాన్నకు అమ్మకు ముద్దొస్తాం!*
*నాలుగు దిక్కులు చుట్టేస్తాం!*

*నింగికి నిచ్చెన వేసేస్తాం!*
*నిలబడి జగతిని శాసిస్తాం!*
*నిప్పురవ్వలను కురిపిస్తాం!*
*నిగ్రహమెంతో చూపిస్తాం!*

*నీతి, నిజాయితీలను గెలిపిస్తాం!*
*నీటివనరులను రక్షిస్తాం!*
*నీ-నా భేదం తుడిచేస్తాం!*
*నీపై ప్రేమను కురిపిస్తాం!*

*నురగల తరగల కెరటాలం!*
*నున్నని బుగ్గల పసివాళ్ళం!*
*నువ్వు- నేనులను కలిపేస్తాం*
*నుదుటి రాతలను మార్చేస్తాం!*

*నూతన శకమును సృష్టిస్తాం!*
*నూరిన కత్తులు విరిచేస్తాం!*
*నూర్చెడి రైతును రక్షిస్తాం!*
*నూటికి నూరు సాధిస్తాం!*

*నృప పదవులనధిరోహిస్తాం!*
*నృశంసలను పరిహరియిస్తాం!*
*నృత్యగానములు నేరుస్తాం!*
*నెమళ్ళ వలెనే నర్తిస్తాం!*

*నెమ్మదిగా అడుగులు వేస్తాం*
*నెలవంకను భూమికి తెస్తాం!*
*నేర్పిన గురువులనర్చిస్తాం!*
*నెత్తిన పెట్టుకు పూజిస్తాం!*

*నేడీ లోకం మా సొంతం!*
*నేర్చిన జ్ఞానము హిమవంతం!*
*నేర్చుకోవల్సినది అనంతం!*
*నేర్చుట కొఱకే మాపంతం!*

*నైతిక విలువలు మా సొంతం!*
*నేర్చిన విద్యలు ఫలవంతం!*
*నై.. నై.. అంటే బ్రతుకంతం!*
*సై.. సై.. అంటే సుఖవంతం!*

*నొసటి రాతలను నమ్మద్దు!*
*నోటికి చూపర ఓహద్దు!*
*నౌకకు లంగరు కదముద్దు!*
*నవ్వుతూ బ్రతుకును సరిదిద్దు!*

*నందనవనమే జీవితం!*
*నందుని ఇల్లు బృందావనం!*
*నందనందనులమే మనం!*
*నలుగురితో ఉంటే పావనం!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*

No comments:

Post a Comment