Tuesday, November 8, 2022

మనిషి-మానవత్వము

శ్రీశ్రీ కళావేదికలో
అంశం : మనిషి- మానవత్వం .
శీర్షిక : మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .

మనిషి జన్మ మెత్తు  మదిని మర్మము లేక
కల్మషమ్ము లిడని కాంతి మనసు
పెరిగి నపుడు బుద్ధి పెడదోవ నదెబట్టు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

చదువు లెన్ని యున్న  చరియించు నీతీరు
నీదు బాట నెంచు  నీడ వలెను
వ్యసన పరుల తోడ వ్యవహరించుట చేటు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

మానవత్వ మదియె మనిషి భుాషణ మౌను.
పరుల బాధ నెరిగి పలుకు మెపుడు
 నీవు జేయు కర్మ నీవెంటె వచ్చురా 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

తల్లిదండ్రు లిలను  తలచు వేల్పులు నమ్ము
తీర్చు ఋణము నీవు  తీరు గాను
 జగతి నీదు భవిత   జన్మదా తల భిక్ష 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

ఆతివ అబల యనెడు ఆలోచనసలొద్దు 
అబల కాదు యామె  ఆది శక్తి
అడుగు లోన యడుగు ఆమెతో డుగనేయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

మహిని  పొందు ఘనత మందిలో నొకడిగ
సభ్య తెరిగి మసలు  సజ్జనునిగ
మంచి పేరు పొందు మనిషివిలువె మెండు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
-----

భగణం UII


07/11/2022.

శ్రీశ్రీ కళావేదికలో
అంశం : మనిషి- మానవత్వం .
శీర్షిక : మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

ప్రక్రియ : శీస పద్యము.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

మానవత్వము లేని మనిషి జన్మమదేల 
మాయ మర్మములున్న  మాయ కపటి 
ముార్ఖత్వ మదెనిండి ముార్ఖుడై చరియించు
మహిబుద్ధి హీనుడౌ మనుజు  డతడు ॥

సాటివారికెపుడు సాయమ్ము జేయడు
స్వార్ధ బుద్ధదె నిండు  వ్యర్ధ జీవి.
సర్వావగుణముల సరినేర్చు రసికుండు
నమ్మకెపుడు వాడె  నర పిశాచి ॥

మానవ త్వముగల్గి  మమతనిం డెడుమాట
మహిని మనెడు నడతె  మనిషి కీర్తి.
పరుల కష్టము దీర్చ పలుచింత నలుజేయు
సజ్జనుండె భువిని సాధు వర్తి ॥

మనదైన సంస్కృతి  మన సాంప్రదాయాలు
గౌరవించెడు వాడె ఘనుడు ఇలను 
స్త్రీల సమ్మానించు శీల సద్గుణుడేగ
మహిని ఉన్నతుండు మనిషి వాడు .॥

ప్రక్రియ : ఆటవెలది.

చదువు లెన్ని యున్న  చరియించు నీతీరు
నీదు బాట నెంచు  నీడ వలెను
వ్యసనపరుల తోడ వ్యవహరించుట చేటు
మనుజ తెలుసుకొనుము మంచి మాట.॥

మహిని  పొందు ఘనత మందిలో నొకడిగ
సభ్యతెరిగి మసలు  సజ్జనునిగ
మంచి పేరు పొందు మనిషి విలువె మెండు
మనుజ తెలుసుకొనుము మంచి మాట.॥

హామీ : ఈ పద్యములు ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచనలు.

No comments:

Post a Comment