Tuesday, November 8, 2022

అంశం : స్కౌట్స్ అండ్ గైడ్స్.

అంశం : స్కౌట్స్ అండ్ గైడ్స్.
శీర్షిక : ఆపద్బాంధవులు .

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది 
భారతదేశ జాతీయ స్కౌటింగ్ ,
మరియు గైడింగ్ అసోసియేషన్..॥

బాల బాలికలలో దేశభక్తి, క్రమశిక్షణను 
పెంపొందించి వారిని సమాజ సేవకులుగా 
తీర్చిదిద్దడానికి ప్రారంభించిన ఉద్యమం .॥

బాలుర బృందాలను "స్కౌట్స్", 
బాలికల బృందాలను "గైడ్స్" అని అంటారు॥

1986 లో  ఐక్యరాజ్యసమితి  
 అంతర్జాతీయ శాంతి సంవత్సరానికి 
 భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్‌ను 
  గౌరవ "శాంతి సందేశకులు"గా ఎంపిక చేసింది॥

స్కౌటింగ్ యొక్క లక్ష్యం, 
స్కౌట్ వాగ్దానం మరియు చట్టంపై 
ఆధారపడిన విలువ వ్యవస్థ ద్వారా ...
యువకుల విద్యకు తోడ్పడడం, ॥

వ్యక్తులు వ్యక్తులుగా స్వీయ-సంతృప్తులై 
 సమాజంలో నిర్మాణాత్మక పాత్రను
 పోషించే మెరుగైన ప్రపంచాన్ని 
నిర్మించడంలో సహాయపడటం. ॥

సేవా పద్ధతులను అనుసరించి శిక్షణలో 
వీరికి ఈతకొట్టడం, వంతెనలు, రోడ్ల నిర్మాణం, 
ప్రథమ చికిత్స పద్ధతులను నేర్పుతారు.॥

 ఒక నాయకుడి ఆధీనంలో పనిచేసే వీరు
సైనికుల వలె ప్రత్యేక దుస్తులలో ఉండి ,
కేవలం ఒక కర్రను మాత్రమే ధరించీ
మెడలో ఒక స్కార్ఫ్ తోఈ ఉద్యమంలో 
 చేరి దళాలుగా ఏర్పడతారు. ॥
    
 "సదా సమాజసేవలో ఉంటాం" అనే నినాదం
 నిండిన  పతాకం తో స్వచ్ఛందంగా
  ఈ ఉద్యమంలో చేరిన బాల భటులంతా
 సత్యం పలకడం, కష్టాలలో ఉన్నవారిని 
 ఆదుకోవడం, రోగగ్రస్తులకు సేవచేయడం,
  పోలీసు వ్యవస్థకు అత్యవసర సమయాల్లో సాయపడటం ద్వారా సమాజసేవ చేస్తారు.

No comments:

Post a Comment