Tuesday, March 21, 2023

సిసింద్రీలు

08/03/2023.
ప్రక్రియ : సిసింద్రీలు. (లఘు ప్రక్రియ).
రుాపకర్త  : శ్రీ కార్తీక్ నిమ్మగడ్డ గారు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

1.ఓ మహిళ :

-------------------
తన వారికోసం ఎంతైనా త్యాగం చేస్తుంది.
తనను అపహాస్యావమానాలు చేస్తే అపర కాళిగా మారుతుంది.

సంఖ్య :  2.

ఓ స్త్రీ .

------------
ఆత్మవిశ్వాసంతో అడుగేస్తున్న ఆదర్శ వనిత. ॥
అందుకే మారుతున్న కాలంలో మార్చుకుంది తలరాత.

3. ఓ వనిత .

-------------------
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన దీన చరిత.
ఓర్పుతో నేడన్నరంగాల్లో విజయపథాన్నేలిన అపరాజిత ॥

4.హోళీ:

--------------
రంగులు నిండిన ఆనంద  వసంతోత్సవం .
రగిలే వర్ణ భేదాలను వదిలిపెట్టి అందరొక్కటైన దినం .

10/03/2023.
ప్రక్రియ : సిసింద్రీలు. (లఘు ప్రక్రియ).
రుాపకర్త  : శ్రీ కార్తీక్ నిమ్మగడ్డ గారు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

5 .ఓ అవమానం :

---------------------
మనిషి మనసుని ముక్కలుగా చేస్తుంది.
మనసులోనున్న  ఆత్మాభిమానం మనిషిని కుంగదీస్తుంది.

6. ఓ సంస్కారం.

---------------------

సమాజంలో, గౌరవాన్ని నిలబెట్టుకోవాలని చుాస్తుంది.
సరి-సమానతల భావంతో ప్రతి ఒక్కరినీ గౌరవిస్తుంది

13 /03/2023.

7.ఓ సిగ్గులేనితనం.

----------------------------

పరువు ,మర్యాదలకు వెరవనిది .
పది మందిలో నున్నా పద్ధతి లేని నడత కలిగేది.

8. ఓ అహంకారం.

--------------------------
నడిమంత్రపు సిరి వచ్చేసరికి నెత్తికెక్కేది.
నలుగురి మధ్య ఇంగిత జ్ఞానం లేక ప్రవర్తించేది.

14/03/2023.
9 .ఓ సాధింపు.

---------------------
మనలొని ఓర్మికి  పెద్ద పరీక్ష.
మరీ హద్దులు మీరితే , తనకు తానుగా వేసుకున్న శిక్ష.

10. ఓ పుస్తకం.

-----------------------
కొందరికి  అందమైన హస్త భుాషణం.
కోరిన వారికి కొదవలేని జ్ఞాన భండారం.

21/03/2023. (పంపినది).

11 . ఓ కల .

-------------------
తీరని కోరికలను తీరుగా చుాపించే కమ్మని స్థితి.
తీరిన నిద్రతో తిరిగి పొందలేని ఆనందానుభుాతి . 

18/04/2023  .

 సిసింద్రీ

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

 కల్యాణ్: మహారాష్ట్ర .

ఓ జీవితం  .-

--------------

ఒడిదుడుకుల నావలో బ్రతుకు పోరాటం

ఒద్దికలేని బంధాల మధ్య చేసే ఒంటరి ప్రయాణం.

హామీ :

పై సిసింద్రీ నాస్వీయ రచన.

19/04/2023  .

 సిసింద్రీ

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

 కల్యాణ్: మహారాష్ట్ర

 ఓ యువత.-

---------------

సరైన బాటలో భావి భారత పునరుద్ధరణకు ప్రతీక

సరి మాదకద్రవ్యాలకు బ్రతుకు కోల్పోయే బలహీన ముాక.

 :పై సిసింద్రీ నాస్వీయ రచన.

No comments:

Post a Comment