*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *04-03-2023-శనివారం*
అంశము: *బాలసాహిత్యం(ట వత్తు పదాలు)*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *గుట్టు విప్పి పెట్టు!బుట్టబొమ్మ!*
ప్రక్రియ: *పద్యము*
ఛందస్సు: *ఆటవెలది*
*********************
*(1)*
*పట్టుదట్టిగట్టు! పడగపై తను మెట్టు!*
*నుట్టిలోనచట్టి నొడిసిపట్టు!*
*చెట్టు క్రింద జట్టు! చేతవేణువుబట్టు!*
*గుట్టువిప్పిపెట్టు! బుట్టబొమ్మ!*
*(2)*
*పొట్టలోనయుండ పుట్టెను హరిభక్తి!*
*జట్టుకట్టెనతడు చక్రితోడ!*
*కష్టమొందె పుట్టి దుష్టకశిపుజేత!*
*గుట్టు విప్పి పెట్టు!బుట్ట బొమ్మ!*
*(3)*
*గట్టి పట్టు పట్టు! గట్టుగుట్టలనెక్కు!*
*పుట్టతేనె దొరుక పొట్ట నింపు!*
*పొట్ట త్రాడుగట్టి పోరునందురికింత్రు!*
*గుట్టు విప్పి పెట్టు!బుట్టబొమ్మ!*
*(4)*
*పొట్టలోన వినెను పోరాట సూత్రాలు!*
*పుట్టి పద్మ వ్యూహ గుట్టు పట్టె!*
*చిట్టి బాలుడైన చెట్టంత వీరుడే!*
*గుట్టు విప్పి పెట్టు! బుట్టబొమ్మ!*
*(5)*
*పొట్టివాడయినను గట్టి యగు ప్రధాని!*
*కష్ట సమయమందు గద్దె నెక్కె!*
*మట్టి, మాతృభూమి మహనీయమని జెప్పె!*
*గుట్టు విప్పి పెట్టు!బుట్టబొమ్మ!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*
*జవాబులు*
*1. శ్రీకృష్ణుడు*
*2. ప్రహ్లాదుడు*
*3. ఉడుము*
*4. అభిమన్యుడు*
*5. లాల్ బహదూర్ శాస్త్రి*
*నా పొడుపు పద్యాలను ఆదరించి, అభిమానిస్తున్న ప్రియతమ కవిమిత్రులు అందరికీ హృదయ పూర్వక ధన్యవాదనమస్సులు!*
*మీ*
*జట్టు కిట్టుడు*
*వేణుగోపాలుడు*
🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment