మనోహరి పత్రిక కొరకు,
విభాగం : వ్యాసం.( కధ)
అంశం: నా సంపాదన నా ఇష్టం.
శీర్షిక : నీలిమ.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
నీలిమకి ఆరోజు చెప్పలేనంత ఆనందంగా ఉంది .
తను ఎన్నో రోజులుగా ఎదురుచుాస్తున్న రోజు రానే వచ్చింది.
తనకు బేంక్ లో మేనేజర్ గా జాబ్ వచ్చింది .
ఎప్పటినుండో ఎదురు చుాస్తున్న ఆనంద ఘడియలివి.
అనందంతో తిరిగిన కన్నీటి తడిలో నీలిమకు తన బాల్య సంఘటనలన్నీ ఒకొక్కటిగా కళ్ళముందు తిెరగసాగాయి.
---------------------------------------------
తల్లిదండ్రులు తనను చిన్నప్పటి నుండి చాలా ముద్దుగా పెంచాలనుకున్నారు. కారణం తను వాళ్ళకి ఒక్కర్తే
సంతానం కావడం.
తండ్రి ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసీవారు. మంచి జీతం . తమ ముగ్గురికి ఆజీతం చాలా ఎక్కువ .
ఎంతో జాలీగా ఉందామనుకుంటున్న సమయంలో
అనికోకుండా నానమ్మకు " కేన్సర్ " రావడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఆవిడ ఎనిమిదేళ్ళు ట్రీట్మెంట్ లో ఉండి , మరో రెండేళ్ళు మంచం పట్టి తీసుకు తీసుకు చనిపోయారు.
నాన్నగారి జీతమంతా టెష్ట్ లు, మందులు, కిమొా థెరఫీలు , మంచంపట్టిన నానమ్మకు సేవలు చేసేందుకు
పెట్టిన మనుషులకు జీతం ఇవ్వడం వంటి ఖర్చులతో
డబ్బు చాలక చాలా ఇబ్బందులు పడవలసి వచ్చేది .
దాంతో తన స్కుాల్ లో గానీ కాలేజిలో గానీ
స్నేహితులతో పిక్నిక్ లు , పార్టీల వంటివి ఎంజాయ్ చేయలేకపోయింది.
నాన్నని దేనికి డబ్బులడిగినా ఏదో ఒక కారణం చెప్పేవారు.
తనకు కోపం ఉడుకుమొాత్తనం వచ్చి ఏడుపు వచ్చేది.
అప్పుడే తను నిశ్ఛయించుకుంది.
తను బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలని.
తనకొచ్చిన జీతం తన యిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలని..
అప్పుడు తనను ఎవ్వరుా ఏమీ అనలేరు. ...చెప్పలేరు.
ఎందుకంటే " తన జీతం , తన ఇష్టం " ..అంతే...
తన మనసులో నాటుకున్న అదే నిశ్ఛయంతో తను చాలా బాగా చదివింది.
ఫలితం. బేంక్ మేనేజర్ రుాపంలో కాసులు కురిపించబోతోంది...
అదే నీలిమ సంతోషానికి కారణం...
--------------------------
తను ఎమ్ కామ్ : ఎమ్ .బి .యే. పుార్తి చేసిన తర్వాత నుండే ఇంట్లో అందరుా తనకు పెళ్ళి సంబంధాలు చుాడడం మొదలెట్టేరు.
తను మాత్రం ఖచ్చితంగా చెప్పింది .తను కనీసం రెండు సంవత్సరాలవరకు జాబ్ చేసి గాని పెళ్ళి చేసుకోనని ,
తన సంపాదన తన యిష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకొనే
అధికారం తనకు అప్పుడే వస్తుందని , లైఫ్ ఎంజాయ్
చేసే అవకాశం కోసం తను ఎన్నాళ్ళ బట్టో ఎదురు చుాస్తున్నాదని తెగేసి చెప్పేసింది.
తర్వాత నీలిమ ఉద్యోగంలో ఆనందంగా చేరింది.
తనకు జాబ్ వచ్చిందని , సేలరీ రాగానే అందరం కలిసి
ఎక్కడికైనా టుార్ వెళదామని తన తల్లిదండ్రులతో చెప్పింది.
పది రోజులు గడిచేయి ..
తండ్రికి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చి బతికినంత పనైంది.
దాంతో తండ్రి తనను తను బ్రతికుండగా పెళ్ళి చేసుకోమని ,
మళ్ళీ సడన్ గా గుండెపోటు వస్తే , తన ముచ్చట చుాడకుండానే ప్రాణాలు పోతాయేమొానని
ఎమొాషనల్ గా మాట్లాడడంతో సరేనంది.
అంతే ! మొదటి జీతం అందుకుంది. రెండవ జీతం అందకుండానే తనకు వివాహమైపోవడం జరిగిపోయింది..
పెళ్ళికి ముందే వాళ్ళు , ఉద్యోగస్తురాలైన పిల్లే కావాలని చెప్పేరని విని అవాక్కైపోయింది.
పెళ్ళి తర్వాత నుంచి తన జీవితం పుార్తిగా మారిపోయింది.
అన్నట్టుగానే నాన్న తన పెళ్ళి చుాసి స్వర్గస్తులయ్యేరు.
అమ్మ బాధ్యత తనమీద పడింది.
అత్తగారింట వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు.
తల్లి బాధ్యతలు తనే నిర్వర్తిస్తున్నా పల్లెత్తు మాట
అనేవారు కాదు. భర్తకు వచ్చిన జీతం ఇంట్లో ఖర్చులకు చాలేది కాదు. నలుగురు ఆడబిడ్డల బాధ్యత , వాళ్ళ పెళ్ళిళ్ళు తమకు చాలా బరువనిపించేవి.
ఇంటి ఖర్చులు పోను , ఎంత దాచినా అది తక్కువే అనిపించేది .దాంతో తన జీతం ఇంట్లో వాడక తప్పేది కాదు.
.ఇద్దరి జీతాలు బొటాబొటిగా సరిపోయేవి.
తనకు ఏది కావలసి వచ్చినా చాలా ఆలోచించవలసి వచ్చేది
తను చాలా సార్లు "నా జీతం నా యిష్టం " అనుకుంటుా
ఖర్చు చేయాలనుకొనేది .
కనీ బాధ్యతల బరువుకు తల వంచీసేది.
నీలిమకు తల నెరిసింది. ఆడ బిడ్డలకు పెళ్ళిళ్ళయ్యాయి .
అదనంగా మరిద్దరు పిల్లల బాధ్యత మీద పడింది.
పేర్లు సంధ్య , పల్లవి.
ఆడబిడ్డల పురుళ్ళు పుణ్యాలకు పోను , పిల్లల్ని
చదివించడం వాళ్ళ అవసరాలు తీర్చడంతో బొటాబొటీగా
గడిపే స్థితికి అలవాటు పడిపోయింది నీలిమ .
ఆమెకు తండ్రి మరీ మరీ జ్ఞాపకం వస్తున్నాడు.
తెలిసీ తెలీని వయసులో తను తండ్రిమీద ఎంతో కోపం తెచ్చుకునేది కదుా...
తను ఏమడిగినా "అలాగే తల్లీ ...కానీ ఇప్పుడు కాదు ...కొన్ని రోజులు పోయాక " ..అంటుాంటే ఎంత కోపం వచ్చేదో...
కనీ ఇప్పుడు తన పిల్లలతో తను అదే మాట చెపుతున్నాది.
ఒకప్పుడు "నా డబ్బులు నా యిష్టం " అన్న తను
అనుకోకుండా తన ప్రమేయం లేకుండానే ..పుార్తి జీతం
ఇంటికోసం ఖర్ఛు చేస్తున్నాది.
ఇప్పుడు నాన్నెంత బాధ పడేవారో తనకు అర్ధమవుతోంది.
రేపు సంధ్య పుట్టిన రోజు కనీసం" కేకు" తెప్పిద్దామన్నా
ఆలోచించవలసి వస్తోంది అనుకుంటుా నిట్టుార్చింది.
ఇంతలో సంధ్య పరుగెత్తుకుంటుా వచ్చి తన చేతిలో నున్న
పది రుాపాయలు చుాపించింది...
నీలిమ ఎక్కడివమ్మా..అని ఆడగ గానే సంధ్య ఆనందంగా..
" అమ్మా ! ఆ రాణీ వాళ్ళు లేరుా..
ఆ ఆంటీ ఏదో ఉద్యాపన చేసుకుంటున్నారట
నన్ను పిలిచి "బాల పుాజ "చేస్తామని చెప్పి...
నాకు ఈ బట్టలు, పుాలు ,పళ్ళు, ఇచ్చి తాంబుాలంలో దక్షిణ
అంటుా ఈ పది రుాపాయలు ఇచ్చేరు...అంది గుక్క తిప్పుకోకుండా.....
నీలిమ అంతా విని, సరే ఆ డబ్బులు ఇలాతే..నేను దాచుతాను అనడిగింది . పిల్ల ఆడుతుా పారేసుకుంటుందేమొానని...
వెంటనే సంధ్య "అబ్బా ! నేనివ్వను ఇవి "నాడబ్బులు నాయిష్టం"
అంటుా పిడికెలు ముాసింది.
ఆ మాట విన్న నీలిమ నవ్వుకుంది.
ఒకప్పుడు తను కుాడా ఇలాగే అనుకునేది. అదీ
-----------------------------------
హామీ :
ఈ కధ ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment