Friday, May 5, 2023

మత్త కోకిల

05/05/2023
తపస్వీ మనోహరం మరియు ఈ వేమన కవితానిలయం 
 సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర పద్య, వచన కవితల పోటీ కొరకు ,
అంశం : పద్యాలు (ఐచ్ఛికం ).
ప్రక్రియ : మత్త కోకిల .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


శ్రీల నిచ్చెడు కల్ప వల్లివి సింహ వాహిని శాంకరీ.
వేల రుాపము లేలు తల్లివి వేల్పు కొలువౌ శ్రీకరీ
ముాల మంత్రిణి,మొాక్ష రుాపిణి,మొాహ మాయ వినాశినీ
బాల , శ్రీ లలితాంబ చిద్ఘని భక్త సంకట నాశినీ ॥

అమ్మ నీవని నమ్మి యుంటిని ఆది శక్తి పరాత్పరీ.
నిమ్మళమ్మగు భక్తి తోనిను నిష్ట గొల్చెద నీశ్వరీ  ॥
రమ్మ నంటిని జాగు సేయక రావె శ్రీ జగదీశ్వరీ
ఇమ్మ నీవభయమ్ము మాకిల ఈప్సిత శంకరు కామినీ ॥

జోత లెట్టెద జోగుళాంబవు జ్యోతి శ్రీపుర.వాశినీ.
ప్రాతః కాలపు పుాజలందవె పార్వతీ గుణ భాసినీ
యాతనింకను తాళజాలను యామినీ జన మొాదినీ
మాత శ్రీ లలితాంబ చిద్ఘని మాత మంగళ రుాపిణీ ॥

భావ అగ్నిలొ సంభ వించిన భాను తేజ ప్రకాశినీ
దేవ కార్యము జేయ వచ్చిన దేవి దైత్య సంహారిణీ 
 పావనీ పరమేశు భామిని పంకజాక్షి సువాసినీ
గావ రాగదె కాల రుాపిణి కామినీ శుభ కామినీ ॥
 
ముండ మాలిని దుర్గ నాశిని ముక్తి మొాక్షస్వ రుాపిణీ
ఛండ ఛండిక రుాపిణీ సుప్రచండ తాండవ మొాదినీ
అండ నీవుగ మమ్ము బ్రోవవె  ఆర్త త్రాణ  పరాయణీ
కుండ లీని విశాల విశ్వ వినోద కుంజ విహారిణీ ॥


భక్తి గొల్చెడు వారి బ్రోచిన  భాగ్య మంగళ రుాపిణీ
శక్తి భైరవి శాంత రుాపిణి శాంకరీ శుభ కామినీ.
ముక్తి నిచ్చెడు మార్గ దర్శిని ముాక దైత్య వినాశినీ ॥
యుక్తి రుాపము లెన్నొ దాల్చిన యుద్ధ దైత్యవిదారిణీ ॥

No comments:

Post a Comment