30/04/2023.
జయ శంకర సారస్వత సమితి కవితా పోటీల కొరకు,
శీర్షిక : ప్రకృతితో పయనం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
చల్లనిగాలి వీచే వేళలో పయనించే
మల్లెపూల మత్తు పరిమళం మురిపిస్తోంది.
కోయిలమ్మ పాడే పాటలో నిండైన రవం ,
హాయినిండు నిత్య వసంతమై మరపిస్తొింది॥
పరుగులు తీసే మనసు విహంగం
ఆ పరుగుతో పయనించే వయసు యానమై
ఇంద్రధనుసు ప్రభల, పరుగుల స్వప్నమయ్యింది.. ॥
కన్నె మనసు కవితైెతే ,ఆ కవితలింద్రధనుసైతే , అవి
ఆకాసమంతా నిండిన చిలిపి కలల మిణుకు తారలే కదా! ..
ఆ తారలన్నీ మెరిసే చిరు వెన్నెలలై కురిస్తే
ఆ చందమామ కళలలో దాగిన అందాలు,
వలపురేపు కధలే .కదా!॥
మబ్బుచాటున దాగిన మేఘం, చినుకై కురిస్తే
నా మనసు వేచియున్న ఒక చకోరమై నిలుస్తే..
తొలి చినుకు తడికి పడే ఆరాటం, ఓ ప్రేమే కదా !॥
ఇలలోని అందమంతా నే పాడే పాటకు పల్లవైతే
జలజలల సాగే రాగ ఝరుల సందడి సడి
నా మదిలో రేగిన కలకలాలు, అలల సడులే కదా !॥
...
చిన్ని చిన్ని చిలుక జంటలు ,
పచ్చనైన చేల పంటల్లో చేసే కువ -కువల
కిల- కిలారవాలు, నా మధుర గీతిలొ నిండు
లయలకు పదములే కదా... ॥
చిరుగాలి వెంట నా పయనం ,
కెరటాల నడుమ నా గమనం , నాలో
భావాలే అలలై తేలుతుా , చేరుకున్న తీరం ,
నే కోరుకున్న మధురమైన గమ్యమే కదా ॥
మనసంత మధుర భావం నిండియుంటే,
మదినిండా రసపు పానం కదులుతుా ఉంటే,
అది పండు వెన్నెలంత హాయైనదే కదా ! ...
పుాచే పూల సౌరభం, మలయారుత వలయ మైతే
చిరు చినుకు తడులు నిండిన మట్టి సోరభం -
మొలకెత్తే చిన్నారి విత్తుకు, నిలిపే ప్రాణమే కదా !॥
తలపించు వేయి వినోదాల హాయి తలపుల్లో ....
చేసే సంగీత- సాహిత్య -స్వర ,విహారానికి
స-రి-గ-మ సఖుల సాయమే శృతి లయలైతే ,
సరదాలు చిందు, రాగ మధువుల మకరందలో
మునిగే జీవితం ,ఆనంద మధు పరాగమేకదా. ॥
హామీ :
పై కవిత నా స్వీయ రచన.
____________________________________________
No comments:
Post a Comment