Sunday, May 14, 2023

జీవన వేదం (పాట.)

శీర్షిక  :జీవన వేదం.
రచన :శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్:మహారాష్ట్ర .

ప్రక్రియ :  పాట..
---------------------+


పల్లవి:
జన్మించుటెప్పుడో మరణించు టెప్పుడో
తెలియని విధిరాతిదనీ  తెలిసేది ఎన్నడో..
అనుపల్లవి:
ఈ పుడమిలో జన్మ   ప్రేమ నిండు సారమా
సుఖ దుఖః నావలో నడిసంద్ర ప్రయాణమా ॥
1.చరణం.
జీవితం తిరుగాడు వలయం  
నీ.. నా.. కధల రుాపం
మనసే జ్ఞాన దీపం  
నింపావహంకార తిమిరం 
ఒడుదుడుకుల బాటలో సాగించీ గమనం 
ఆశయాలె బాటలో కోల్పోయిన తరుణం 
పోయినదంతా వెనుకకు రాదుా
మిగిలినదాంతో తృప్తిరాదుా ॥
2.చరణం.
ఎంతెత్తు కెదిగినా   నడిచేది నేలపై...
కన్నవారు లేనిదే కానరావు భువిపై
నా అన్నవారుండరు, నీతోడై పాడెపై
నడిమంత్రపు సిరిరాదు,నిను గుాడి చితిపై
చావు పుటకలకు మధ్యన, క్షణమైన జీవితం
తెలుసుకొనీ మసలుకో అదె జీవిత సత్యం ॥
3.చరణం.
స్వార్ధమెంచి  దుారమవకు  అందరికీ మిత్రమా
బ్రతుకు దశల మార్పు తోడు, మనిషికి మనిషేసుమా.
ప్రాణమెగిరిపోయినా  కదలదు నీకాయము
ఓనలుగురి సాయమే   కాటిజేర్చు సాధనము.
ఐదడుగుల మట్టి గొయ్యి నీ జీవిత కాల ధనము
తుదికి మట్టిలోనె  కలియుటే బ్రతుకు రహస్యము ॥
*******************************

No comments:

Post a Comment