https://thapasvimanoharam.com/mathru-dinothsava-e-sankalanam/
*14-05-2023 మాతృ దినోత్సవం సందర్భంగా తపస్వి మనోహరం రచయితలు మరియు రచయిత్రులు వ్రాసిన కవితా సంకలనం వెబ్సైట్ లింక్..✍️*
***********::::::*************
*అమ్మను చంపుకుతిన్నాను...*
అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను పుట్టేటప్పుడే పురిటినొప్పులతో అమ్మను చంపుకుతిన్నాను...
అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను పాలు తాగేతప్పుడే రొమ్ము కొరుకుతూ అమ్మను చంపుకుతిన్నాను...
అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను పాకేతప్పుడే ముఖం మీద తంతూ అమ్మను చంపుకుతిన్నాను...
అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను చదువుకునేటప్పుడే పస్తులు ఉంచి అమ్మను చంపుకుతిన్నాను...
అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను ఎదిగిన కొద్ది నిన్ను ఎగతాళి చేస్తూ అమ్మను చంపుకుతిన్నాను...
అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను భార్యచాటున సరసమై నీ ప్రేమను విరసం చేసి
నస బొమ్మగా అమ్మను చంపుకుతిన్నాను
అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను ఎన్నోసార్లు నాన్నకు నీకు తగువెట్టి తగుదునమ్మాని తప్పుకుతిరిగి అమ్మను చంపుకుతిన్నాను...
అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను మంచానపడిన నిన్ను చూసి, పాడెపై పడక, పడితింటుందని లోలోపల అనుకుంటూ బ్రతికున్న అమ్మను చంపుకుతింటూనే ఉన్నాను....
అమ్మ నేను నిన్ను చంపుకుతిననిది ఎప్పుడు...
నువ్వు నన్ను క్షమించనిదిని ఎప్పుడు...
అమ్మా నేనే కాదు...
ప్రతీ కొడుకు కూతురు
దేనికో ఆశపడుతూ...
దేనికో ఆరాటపడుతూ...
బ్రతికున్న అమ్మకు ఎప్పుడో దినం పెట్టేశారు...
ప్రత్యేకంగా దినోత్సవం ఏమిటి అమ్మ...
అమ్మ నేను ఇంకా స్వార్థపరుడినే
కాటికి కాళ్ళు చాసినా కూడా నిన్ను ఏదో రకంగా పీక్కుతింటున్నా రాక్షసుడిని...
అమ్మా...నీయంత సహనం,ఓపిక,ప్రేమ,మమత
నాకు ఇవ్వవా అమ్మ...
కాదు కాదు అమ్మ అడగడం కూడా రాదు నాకు
నీ అమ్మతనం నాకు ఇవ్వరాదా అమ్మ...
అమ్మా... నీ కౌగిలిలో తలపెట్టి పడుకోవడం
నీ కాళ్ళకు చేతులతో ముద్దాడడం
నాకున్నా గొప్ప ఆస్తులు అమ్మ...
అమ్మ ఎందుకో తెలియదు
నిన్ను తలుచుకుని కళ్ళ చెంపలకు స్నానం చేస్తున్నాయి...
మనసు వూరికే ఊగిపోతున్నది
మౌనంగా నీ ముందు నిలబడిపోతాను అమ్మ
నన్ను ఏమైనా చేయ్ నీ ఇష్టం...
*అభిరామ్ 9704153642*
No comments:
Post a Comment