Thursday, May 18, 2023

మార్పు

శీర్షిక  : మార్పు సహజమేకదా 

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్: మహారాష్ట్ర.

అర్ధరాత్రి చీకటిలో..
 మబ్బుల వెనుక దాగున్న మేఘమాల 
ఆనందంగా అవని తల్లిని పలకరిస్తుా
చిరు జల్లులు వెదజల్లుతోంది. ॥

అవని  పొరల్లో దాగి ఉన్న  మొలకబారిన
విత్తతు చిన్నారి తడి ఒడిలో ఒదిగేందుకు
 ఆనందంగా మొాము పైకెత్తింది.॥

లేతాకుపచ్చ రెక్కల్ని  మొదటిగా విప్పుకున్న  
మొలక చిన్నారి, ఉదయపు వెలుగు రేఖల్ని 
వింతగా చుాస్తుా వెర్రి ఆనందం పొందింది ॥

 కాలుష్యంతో పొగ నిండిన చిరుగాలి.
మొలక, వృక్షమై ఇచ్చే స్వశ్ఛమైన
"ప్రాణవాయువు " రాకకై నిరీక్షిస్తుా  .
మీనమేషాలు లెక్కపెడుతోంది.॥

గాయపడ్డ కాలం, గ్రహాల గమనాన్ని 
గంభీరంగా చుాస్తుా ,మారుతున్న
 మరో చరిత్రకు శ్రీకారం చుడుతోంది॥

ఊపిరిలో దీపం వెలిగించే వాయువు..
మొలక పెరుగుదలకు సారమిచ్చే
మట్టి చెలియతో కలిసి మనసారా-
మేలు మంతనాలు జరుపుతోంది.॥

సాదా సీదాగా అలా నడుచుకుంటూ
వెళుతున్న చిన్ని కీటకమొకటి
చిగురుటాకుల  పచ్చదనాన్ని చుాసి 
ముచ్చటపడి , దానితో దోబుాచులాడసాగింది ॥

మనిషిగా పుట్టి  మానవతను 
మరచిన  మనిషి , ప్రకృతి వరాలను ,
ప్రాణవాయువు విలువను తెలుసుకొని,
 విత్తనాల నాటుకై , మడులను
సాగుచేసే యత్నాన్ని జోరుగా సాగిస్తున్నాడు.॥

పరిణితి చెందుతున్న మనిషి 
మనో-వికాశానికి తోడుగా 
నేనున్నానంటుా,ఆకాశంలో 
మేఘమాల ఆనందంగా కురిసింది.॥

ప్రకృతి ప్రకోపానికి బీటలువారిన 
పుడమి తల్లి హృదయం , 
ఆనందంతో పులకరించిపోయింది..॥

"మార్పు సహజమేకదా" 
గ్రీష్మం దాటగానే వచ్చే రుతువులన్నీ
ఇచ్చేది చల్లదనమే కదా....
అంటుా...కోయిలమ్మ కులుకుతుా 
 కొత్త రాగాలు తీసింది.॥

హామీ : ఈ కవిత నా స్వీయ రచన.


 ----

No comments:

Post a Comment