Thursday, May 18, 2023

ఛందస్సు ..గణములు.

17/05/2023.
మహతీ సాహితీ కవి సంగమంలో....
నేటి ప్రక్రియ: పద్యం
అంశం: కల 
శీర్షిక  : 
ప్రక్రియ :సీస పద్యము.
-------------------
1.
నీవెంట పడినాను నీప్రేమ కోరేను
వలదంచు జెప్పకే  వదరుబోడి
కలలోన కనిపించి కవ్వించి పోయావు.
తెలివైన దానవే  తెలుగు బాలా ॥

నీఅంద చందాలు నీముద్దు  మురిపాలు
నినుబాయు విరహాల నిదుర రాదే
నినువీడి  నేనింక నిలువజా లనుశీల
గనుమొక్క పరినన్ను  కనుల తోడ ॥

ప్రక్రియ : ఆట వెలది.
------------------
వట్టి మాటలు గావు వలదు శంకిక నీకు.
వావి వరుస గలుపు  వలపు తోడ
మాఘ మాస మొచ్చె మంచిరో జులువచ్చె
పెండ్లి యాడ రావె పెంకి బాలా  ॥

2.
కలలోకి వచ్చేటి కథలుకా వ్యాలెన్నొ
కలవీడి పోగానె కావు నిజము
కలలోన కనులందు కనిపించు చిత్రాలు.
భారమౌను మదిని భయము గొల్పు॥

మదిలోని భావాలు మనసులో తాపాలు
కలబోయు తలపులే కలల రుాపు
కలత నిద్దుర లోన కనిపించు శాపాలు.
మంచి భావము లున్న మరలి రావు॥


ప్రక్రియ : ఆట వెలది.
------------------
కష్ట బెట్ట వద్దు  కన్న వారి నెపుడు
రక్త బంధ మందు వలదు పోరు
 ఆలి కంటి నీరు అవని ముంచే ఏరు
 ఆడ దాని ఉసురు కవును చేటు॥
-----------------------

No comments:

Post a Comment