16/05/2023.
శ్రీ శ్రీ కళావేదిక కవితా పోటీల కొరకు ,
అంశం : కాలుష్యపు కోరలు.
శీర్షిక : ఓ మనిషీ !ఇకనైనా మేలుకో !
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
తడి మట్టి ఒడిలోంచీ తన్నుకొస్తున్న
చిరు మొలకలను చుాసి ఓ చెట్టు తల్లి
భోరున విపిస్తోంది.
ఏదో ఓ నాడు, మనిషనే రాక్షసుడి
చేతిలో, మానులైన ఈ చిరు మొలకల
కుత్తుకలు కోయబడతాయి కదా! అని॥.
పొగ నిండిన కాలుష్యాన్ని పొగరుగా
మొాసుకొస్తుా తమ వెంటబడుతున్న
వాహనాల వరుస పొగలకు ,నిర్మలమైన
మేఘమాలికలు దుారంగా పారిపోతున్నాయి
తమలోనున్న కుసింత తేమనుా
కురియనీయక దోచుకుంటాయన్న భయంతో...॥
అశుభ్రత నిండిన అవస్థకు లోనైన
పిల్లగాలి, ఊపిరాడని స్థితిలో ఉరేసుకుంది ॥
కసవు దొరకని పశు- పక్ష్యాదులు కలుష్యాలు
నిండిన ఆహారాన్ని, ఆబగా తింటుా,
అంతుబట్టని -రోగాలతో అశువులు బాస్తున్నాయి ॥
పుడమి నిండిన మాలిన్యాలలో పుట్టుకొస్తున్న
పేరుతెలియని "కణాల" కాటుకు జన జీవితం
మందులేని రోగాలతో అస్థవ్యస్థమౌతోంది.॥
కాలుష్యం కాటుకు తన ఉనికినే కోల్పోతున్న
భుామాత భోరుమంటుా, తనలో తానే
ఐక్యమయ్యేమయ్యేందుకు ,మౌనంగా,ప్రళయ-
ఆవాహనానికి ప్రచండ శ్రీకారం చుడుతోంది.॥
తస్మాత్ జాగర్త..!
హమిపత్రం :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.
***********
No comments:
Post a Comment