Wednesday, May 17, 2023

I love you Habby..(..ప్రేమ లేఖ).

16/05/2023
 మనోహరి మహిళా పత్రిక కోసం.
విభాగం:  లేఖ
(శ్రీవారికి ప్రేమలేఖ.)
శీర్షిక  : ఐ లవ్ యుా ..హబ్బీ..

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


"ఓయ్ ! హలో ! ఎప్పుడుా ఏదో
పని చేస్తుా , మౌనంగానే ఉంటారా..?
కాస్తా మాట్లాడొచ్చుకదా ! "అంటే..
 మీరు చిన్నగా నవ్వుతుా..
నీకు సాయం చేస్తే నాకు ఆనందం..
నవ్వు ఇంటి పనంతా చేస్తుాంటే 
నేనెలా కుార్చోగలను " అంటుాంటే.. 
నాకు మీ మీద చాలా కోపం వచ్చేది.

మార్కెట్ కు వెళదామంటే.."అలసిపోతావీశ్వరీ..
చాలా రష్ గా ఉంటుంది నువ్వు నడవడమే 
కష్టం అనేవారు". చిరాకు వేసేది.

"ఈ రోజు బయట కెళ్ళి హోటల్ లో
భోజనం చేద్దామంటే ," అక్కడ
ఆర్డరిస్తే గంటదాకా తేవరు. 
నువ్వా ఆకలికి  అగలేవు.
ఏంకావాలొ చెప్పు. నేనే ముందుగా 
వెళ్ళి పేక్ చేయించి తెస్తా.."
అంటుాంటే పట్టలేని కోపం వచ్చేది.॥

ఇదంతా నన్ను"  ఇంటికే పరిమితం చేయడానికి
మీరు ఆడుతున్న నాటకం " అనుకునేదానిని.
ప్లీజ్ ! నన్ను క్షమించరుా..🙏
..
మీరు మీ తండ్రిగారి  అనారోగ్య కారణంగా 
నన్ను వదిలి దేశం వెళ్ళిన ఈ పదిహేను రోజుల్లో,
మీ బాధ లేకుండా హాయిగా నాకు కావలసినట్లు
నా స్నేహితులతో తిరగొచ్చు అనుకున్నాను.
కానీ మీరు వెళ్ళిన మర్నాడే మా తమ్మడు వచ్చేడు.
ఉద్యోగ రీత్యా వారం ఉండాలంటుా..
వాడికి డబ్బా కట్టడంతో మొదలైన 
 ఇంటి పని రాత్రి వాడొచ్చేవరకు పుార్తయేది కాదు
 కష్టమై ,ఒక్కర్తినీ చేసుకోలేకపొియేదాన్ని .అప్పుడు
  మీరే గుర్తుకు వచ్చేరు.
మీరు వద్దంటున్నా అంత సాయం  ఎందుకు చేసేవారో
 నాకు  అర్ధమయింది. నా మిుద మీకెంత ప్రేమొా.
 మీ ప్రేమను గుర్తించనందుకు నన్ను క్షమించరుా..🙏
 
 తమ్ముడు పొద్దున్న వెళితే రాత్రే వచ్చేవాడు.
 కుారలు నేనే తేవలసి వచ్చేది .సంబరంగా
  మార్కెట్టుకు  వెళ్ళిన నేను నరకంలోకే 
  వచ్చాననుకున్నాను .
  ఆ జనంలో...కుళ్ళిన కుారల కంపులో, 
  ఆ తోపులాటల్లోంచీ బయట పడడం , 
  ఆటో దొరక్క  గంటలు గంటలు అలా నిల్చొని
  కాలక్ళు పీకుతుాంటే , చివరకు క్రిక్కిరిసిన బస్సులో పడి
  ఇంటికి వచ్చేసరికి కళ్లల్లో నీళ్ళు తిరిగేవి.
  మీరే జ్ఞాపకం వచ్చేవారు.
  నేను లిష్ట్ రాసి ఇచ్చే ప్రతీ వస్తువుా , మీరు 
  ఎన్ని అవస్థలు పడి కొనేవారో..కదా...
ఐనా ఇది బాగులేదు అది బాగులేదు అంటుా
మిమ్మల్ని సాధించేదాన్ని. 
     నన్ను మన్నించండి 🙏  మరెప్పుడుా అనను.
     
    మొన్న  అదివారం వాడుంట్లోనే ఉన్నాడు 
    సినిమాకి వెళదాం అన్నాను . 
సరే అన్నాడు. అక్కడికీ గంట ముందే బయలుదేరాము 
వెళ్ళేకా తెలిసింది . అక్కడెన్ని అవస్థలు పడాలో...
టికెట్  కోసం బారెడు లైనులో వాడు మగవారి లైనులో,
 నేను  ఆడవారి లైనులో నిలుచున్నాము .
 టికెట్ కౌంటరు   సినిమా మొదలవడానికి  పది నిముషాల ముందు తెరిచాడు. 
 అంతే ! అందరుా ఒకళ్ళమీద ఒకళ్ళు పడి,  కొట్టుకుంటుా ,
 తిట్టుకుంటుా,...ఎగబడ్డారు. ఆడవాళ్ళైతే మరీను.
 నా చీరంతా ఊడిపోయింది
  నా జుట్టు చెరిగిపోయింది, టిక్కెట్టు సంగతి దేముడెరుగు.
 బయట పడితే  చాలనుకున్నాను .  పిచ్చిదానిలాగే బయట పడ్డాను..
 అప్పుడు కుాడా మీరే  గుర్తుకు వచ్చేరు.
 ఇంట్లో   మీరు సాయం చేస్తుాంటే  చేసుకున్న పకోడీలు తింటుా వేడి వేడి టీ తాగుతుామీ పక్కనే కుార్చుని
  టి.వి లో  వచ్చిన సినిమా చుాస్తుా ఉంటే ఎంతబాగుండేదో...
  మిమ్మల్ని ఆడిపోసుకునేదాన్ని .నన్ను  క్షమించరుా..🙏

ఆ మర్నాడు నాకు జ్వరం వచ్చినట్టుగా , ఒళ్ళంతా నొప్పులుగా ఉడడం తో .తమ్ముడు ఆఫీస్ పనిమీద 
బయటకు వెలక్ళ లేదు సరికదా వంట కుాడా చేయొద్దు అన్నాడు.
ఐతే "మంచి హొటల్ కు తీసుకెళ్ళు" అన్నాను.
ఇద్దరముా తయారే  సిటీలో ఉన్న ష్టార్ హోటల్ కి
వెళ్ళేము.
 సర్వరు వచ్చి అందమైన గ్లాసులతో
మంచినీళ్ళు పెట్టేడు. పొంగిపోయేను.
తర్వాత మల్లెపుావుల్లాంటి గాజు ప్లేట్లు పెట్టేడు.
రిలాక్స్ గా కుార్చున్నాను.
ఆర్డర్ తీసుకుంటున్నపుడు , మెనుా కార్డ్ చుాసి 
నాకు కావలసినవి చెపుతుా ఉంటేనే నోట్లో
నీరుారింది.
సర్వరు  ఆర్డర్ తిుసుకొని వెళ్ళిపోయేడు.
అంతే...ఎంతకీ రాడు..
మాకు ఇటు అటు కుార్చున్న వాళ్ళంతా తింటుా ఉంటే
చుాస్తుా గుటకలు వేయడం తప్ప మరేం చేయలేకపోయాము.
 గంట తర్వాత ష్టాటర్స్ అంటుా...సలాడ్.అంటుా కొన్న ఉల్లిపాయ ముక్కలు . పకోడీలు, 
 ఇంకేవో తెచ్చేడు. ఆకలిమీదున్నామేమొా..
 ఆ పచ్చి ఉల్లిపాయలనే పరాపరా తినేసి పకోడీలు 
 ఖాళీ చేసి గ్లాసయడు నీళ్ళు తాగేసాము.
 ఆ తర్వాత అరగంటకి ఆర్డర్స్ వచ్చేయి.
 అన్నీ తినాలనుకొని ఇష్టంగా తెప్పించు కున్నవే..
 పకోడీల కారణంగా  ఏమీ తినలేక అన్నీ వదిలేసి ,ఏడ్చుకుంటుా 
 బోలెడుబిల్లు చెల్లించీ  ఇంటికి వచ్చేము.
 అప్పుడుా మీరే గుర్తుకు వచ్చేరు.
" నిజంగానే నేను ఆకలికి ఉండలేను.
మీరు చెప్పేవన్నీ  సాకులు అనుకున్నాను.
 నాకైన అనుభవంతో   మీ మాటలకు అర్ధం
తెలుసుకున్నాను.ఏమిటో తెలుసా...
మీకు నేనంటే పిచ్చి ప్రేమ..నేను కష్టపడితే చుాడలేరు."

ప్రేమంటే సినిమాలు షికార్లుా కాదనీ.మ
ఒకరి కష్టం ఇంకొకరు పంచుకోవాలనీ,
చెప్పకనే చెప్పేరు.
నామనసులో మాటకుాడా , ఈరోజు మీకు చెప్పేయనా."

నాకు కుాడా మీరంటే చాలా ఇష్టం .మీతో తిరగడం ఇష్టం.
మావారు నన్ను ఫలానా చోటుకి పట్టుకెళ్ళేరని నా 
స్తేహితులతో చెప్పుకోవడం  ఇష్టం.
అందుకే  అలా అడిగేదానిని.
కానీ ఇకముందు అలా అడగను .

మరో చిన్న మాట..
మీరు దగ్గరుంటే చెప్పలేను బాబుా..
అందుకే ఇప్పయడు చెప్తాను.
తెలుగులో చెప్పడానికి సిగ్గేస్తొింది.
మరి ఇంగ్లీష్ లో చెప్తానేం..
అదీ...అదీ...
"ఐ లవ్ యుా  హబ్బీ..."❤

***************************:

 హామీ: ఈ లేఖ నా స్వీయ రచన.

No comments:

Post a Comment