మనోహరీ మహిళా పత్రిక కొరకు,
మను ధర్మ శాస్త్రములు.
రచన : శ్రీ మతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
యుగాల క్రితం ,చిహ్నం లేని, ప్రమాణముకన్నా హీనమై, నిద్రావస్థలోనున్న జగత్తును పునరుద్ధరించడానికై, స్వయంభువుడు, అవ్యక్ర గోచరుడు అయినవాడు, సమస్త ప్రాణి కోటికీ ఆత్మయైన పరమాత్ముడు- స్వయముగానుద్భవించి, మొదట జలమును సృజించి, అందులో ,శక్తి బీజమును వదిలిపెట్టెను. సహస్ర సూర్య తేజోరాజమైన ఆ బీజము ,అండమువలె, సువర్ణ ఆకారోత్పన్నమై, అందునుండి సమస్త లోకములను సృష్టించు బ్రహ్మనుత్పన్నము చేసెను.
ఈ బ్రహ్మోత్పన్నమైన జలము, "నారా" అని పిలువబడుతూ, ఆత్మకు పథమస్థానమై "నారాయణునకు" నివాసయోగ్యమైనది. తదుపరి అందుండి ,సకల చరాచర జగత్తునూ సృష్టించే బ్రహ్మ , తపఃశక్తిచే రెండు ఖండాలుగా విభజింపబడిన భూమ్యాకాశాలను ,సముద్రాలను, సృష్టించెను.
లోక వృద్ధికై, ధర్మా- ధర్మ, సుఖ-దుఃఖ ,ఇంద్రియ-
కర్మలకు నిలయమైన దేహమును సృష్టించి , వివిధ
కర్మలకు ,వివిధ ఇంద్రియములను ,బ్రాహ్మణ -క్షత్రియ -
వైశ్య ,శుాద్రులను , సృష్టించెను.
పిదప ,తన దేహమును సగము పురుషునిగా ,సగము స్త్రీ గా ,విభజింపజేసి ,ఆ స్త్రీలో , "విరాట్సజ్ఞక పురుషుని" సృష్టించాడు .
ఆ విరాట్పురుషుని తపఃశక్తిచే ఉత్పన్నమైనవాడు ,
సకల సంసారములను, పది మంది ప్రజాపతులను,
సప్త ఋషులను, సకలచరాచర జగత్తును, సృష్టించిన
శ్రేష్ఠుడే మనువు.
ఈ సృష్టికి ,మనువు నియమించిన కర్మలు ,ఆచారములు, క్రమముగా ఆచరింపబడుతుా వచ్చినవి . జీవులకు, గతులు నేర్పిన వారు మనువు.
ఈ మను వంశ మందు ఉత్పన్నమైన " స్వారోచిష్"
ఉత్తమ్, తామస్ , రైవత్ ,చాక్షుస్ వంటి మన్వంతరములే గాక , మహా తేజశ్వులైన వైవస్వతులను బట్టి , ప్రస్తుతకాలము "వైవస్వత మన్వంతరముగా" పిలువబడుచున్నది.
స్వయంభుాయైన బ్రహ్మ , హోమము, శ్రాద్ధ కర్మలను జేయుట , సంపుార్ణ సృష్టి రక్షణ , చేయుటకై -
సర్వ ప్రథముడైన బ్రాహ్మణుని సృష్టించెను.
ఆపై క్షత్రియ, వైశ్య , శుాద్రులను, వారి వారి
గుణానుసారము కర్మలను, సృష్టించెను.
ఈ బ్రాహ్మణుడు, శ్రేష్ఠుడేగాక , ధర్మ రక్షణకు సమర్ధుడును , వేద శాస్త్రపరాయణుడునుాయై ,గృహస్థ- ధర్మాది నియమములను పాటించుచుా,
శాస్త్రములు బోధించువాడై యుండవలయును.
యజ్ఞోపవీత సంస్కారమువలన ద్విజుడు ,
గర్భోత్పన్నమైన దోషములనుండి విముక్తుడగును.
బ్రాహ్మణులకు, మంగళసుాచక శబ్దములతోనుా ,
క్షత్రియులకు బలసుాచక శబ్దములతోనుా ,
వైశ్యులకు ధనవాచక శబ్దములతోనుా ,
శుాదృలకు నిందిత శబ్దములతోనుా ,నామకరణములు
చేయవలయునని మనువు జెప్పెను.
మనువు జెప్పిన బ్రాహ్మణ నియమములు విధులు.
----------------------------------------
బ్రాహ్మణ బాలునకు ,యజ్ఞోపవీతసంస్కారమును
ఐదు సంవత్సరములలోనుా, క్షత్రియులకు ఆరవ సంత్సరములోను , వైశ్యులకు, ఎనిమిదవ సంవత్సరములోనుా చేయవలయునని
నియమింపబడినది.
భోజనము చేయునపుడు ఆయుర్వృుద్ధికై ,తుార్పు ముఖము ,యశస్సునకు దక్షిణముఖము ,
ధన ప్రాప్తికి పడమర ముఖము, సత్య పాలనకు
ఉత్తర దిశలు, శ్రేష్టమైనవి.
బ్రాహ్మణులు, భోజనారంభ, అంత్య సమయములందు,
ముాడు సార్లు ఆచమానమును చేసి ఛిద్రమును స్ప్రుశించవలెను .
బ్రాహ్మణునకు బొటనవేలి దగ్గర "బ్రహ్మతీర్థము "
చిటికిన వేలి దగ్గర" ప్రజాపతీ తీర్థము "
ఉంగరపు వేలి దగ్గర "దేవ తీర్థము "
బొటకన వేలు చుాపుడు వేలులకు మధ్య "పితృతీర్థము"లుండును.
ఈ ఆచమానము వలన బ్రాహ్మణుడు, హృదయం వరకును , క్షత్రియుడు కంఠం వరకు, వైశ్యుడు ముఖము వరకును ,శుద్ధి యగును.
బ్రాహ్మణుడు బ్రహ్మ ప్రాప్తికై , ఋగ్యజుర్, సామవేదోత్పన్నమైన ఓంకారమునుండి , ఉత్పన్నమైన
భూః -భువః - స్వః , అను మంత్రమును ,
ప్రాతః -సాయంకాలములందు జపించవలెను.
ఈ జపము వలన, బ్రాహ్మణుడు సిద్ధి పొందును.
బ్రాహ్మణునకు తల్లి వలన ,ప్రథమ జన్మము ,
యజ్ఞోపవీత ధారణ వలన, రెండవ జన్మము ,
యజ్ఞ దీక్ష వలన ,ముాడవ జన్మమును పొందుచున్నాడు.
యజ్ఞోపవీతము లేని బ్రాహ్మణులు ,వేద మంత్రములను పఠింపరాదు.
తామస భక్తి వలన, మృత్యులోకమును ,
పితృ భక్తి వలన, అంతరిక్ష లోకములను ,
ఆచార్య భక్తి వలన ,బ్రహ్మలోక ప్రాప్తి కలుగును.
మనువు చెప్పిన ప్రకారము చేయకుాడని పనులు :
-------------------------------------
మనువు చెప్పిన ప్రకారము ,
నక్షత్ర నామములు గల కన్యలను ,వృక్ష నామ ములుగల కన్యలను ,సర్ప నామములు గల కన్యలను, వివాహము చేసుకొనరాదు.
ఏ కుటుంబములో స్త్రీ లు గౌరవింపబడుదురో..,
ఆ కుటుంబము దేవతలకు ప్రసన్నమగును.
గృహస్తుడు, దేవ కార్యములకు ఇద్దరు బ్రాహ్మణులను ,
శ్రాద్ధ కార్యములకు ,ముగ్గురు బ్రాహ్మణులను
పిలువవలెను.
మనిషి శాస్త్రములను ఎంత మేరకు అభ్యసించునో,
అంతవరకే విశేషములను తెలుసుకొనును .
ఇందువలన జ్ఞానము ప్రాప్తించును.
శాస్త్రానుసారము ఉదయాస్తమయములందు , గ్రహణములందు ,నీటి యందు, సుార్యుని ప్రతి బింబమును చుాడరాదు. అటులనే నీటి యందు, తన బింబమును చుాచుకొనరాదు.
వేద స్వరములను , అక్షరములను ,అస్పష్టముగానుచ్ఛారణ చేయరాదు.
ఋగ్వేదము దేవతలకును ,
యజుర్వేదము మనుష్యులకును ,
సామ వేదము పితృదేవతలకును , చెందినవి.
కనుక సామ వేద ధ్వని అపవిత్రము.
మధ్యాహ్నము, అర్ధరాత్రి ,సంధ్యాసమయములందు,
నాలుగు మార్గముల కుాడలికి పోరాదు.
ఈ విధమైన ఎన్నో శాస్త్రములు, ధర్మములు,
మానవ నడవడికావిధానములెన్నియొా, మను శాస్త్రము నందు చెప్పబడినవి.
No comments:
Post a Comment