Sunday, July 16, 2023

అంశం :కళాకారుల జీవనం /జీవితం

11/07/2023.
ప్రదన్య సాహితీ వేదిక
కవితల పోటీ కొరకు
అంశం :కళాకారుల జీవనం /జీవితం
కవితా రీతి :అంత్య ప్రాస.
శీర్షిక :  వెల -వెలబోతున్న కళా వైభవం. 
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


కష్టం మైనా, కనపరచలేని దైన్యం.
కన్నీటితో నవ్వులు పంచే  సహజత్వం.
నటనలో లీనమైన జీవితం.
కళాకారులకు పుట్టుకతో అబ్బిన గుణం.॥

కళాకారుల జీవితంలో నటనో వసంతం .
నవరసాలుా కురిపించగలిగే నటనాభినయం.
రంగస్థలంపై పోషించే పాత్రలో కళాకారుడు నిమగ్నం.
కానీ , కళాకారులకు  పుట్టుకతోనే దేవుడిచ్చిన  వరం ll

నాటి , హరికథల్లో  భక్తితత్వం.
బుర్రకథలలో ,, పిట్ట కధల హాస్యం .
రోజుకో పాత్ర , పాత్రకో అనుభవం .
 కళలను బ్రతికించాలన్న  ఆరాటం
 అదే, కళాకారుల  జీవిత పోరాటం .ll

రంగస్థలాలకు విలువ నివ్వని నేటి సమాజం .
క్లబ్బులు, పబ్బుల మత్తులో  నేటి జనం.
చేయుాత నందివ్వమని అర్ధించే  ప్రారబ్దం .
కళాకారుల్లో అలముకున్న  తీరని మనస్తాపం .॥

నాటి భారతికి వెలుగు హారతైన కళారంగం .
నేటి చరవాణి, దుారదర్శినిల ప్రవాహంలో మాయం.
కళాకారుల జీవితాల్లో చీకటి నిండిన వైనం.
నేడు ,వెల -వెలబోతున్న కళా వైభవం. ॥


హామీ :  ఇది నా స్వీయ రచన. 



  .

No comments:

Post a Comment