01/07/2023
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : బాలసాహిత్యం .
"త " వత్తు సంయుక్తాక్షరపదాలు.
శీర్షిక : పిల్ల మనసులు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
సంయుక్త ఆరోజు కూడా హోంవర్క్ చేయలేదు .
హోం వర్క్ చేయకపోతే బెత్తంతో మాస్టారు కొడతారు.
పక్కింట్లో కొత్తగా దిగిన "ముక్త"తో ఆడి- ఆడి ,సంయుక్త బాగా అలసిపోయింది.
ఆరోజు రథసప్తమి కావడంతో పూజా కార్యక్రమంలో పడి అమ్మ కూడా ఏం మాట్లాడలేదు
అందుకే సంయుక్త ఆరోజు రాత్రి హాయిగా నిద్రపోయింది.
పొద్దున్నే నిద్ర లేచిన సంయుక్త ,అత్తయ్య నెంతో బతిమాలి
యుక్తితో తన హోం వర్క్ అంతా చేయించింది.
స్కూల్లో మాస్టారు హోంవర్క్ చేయని వాళ్ళందరికీ "బెత్తం"తో తన "సత్తా" ఏంటో చూపిస్తున్నారు
సగమే హోం వర్క్ చేసిన పిల్లలు" బిత్తర"చూపులు చూస్తున్నారు. కొందరు పుస్తకాలు "విప్పి "హోంవర్క్ చూపిస్తున్నారు.
ఆరోజు" ఆముక్త మాల "పుట్టినరోజు అందుకే ఆమె "కొత్త" బట్టలు వేసుకుంది. జుట్టు పొట్టిగా "కత్తిరించు"కుంది.
మాస్టారు" బెత్తం "పట్టుకు దగ్గరకు రాగానే "భక్తిగా" దండం పెట్టి చాక్లెట్లు చేతిలో పెట్టింది.
ఈ విధంగా ఆముక్త "మొత్తా"నికి దెబ్బలు తినకుండా "మెత్తగా" తప్పించుకుంది.
"కీర్తి" చాలా తెలివైన పిల్ల . పెద్దగా ఆస్తులు అంతస్తులు లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు" కీర్తికి" మంచి సంస్కారం నేర్పించారు. స్కూల్లో ఆ అమ్మాయికి ఎంతోమంది"
నేస్తాలు" ఉన్నారు.
కీర్తి"ఛత్తీస్ గఢ్ఢ్ "నుంచి వాళ్ళ మామయ్య తెచ్చిన స్వీట్ ప్యాకెట్ ని మాస్టర్ చేతిలో ఉంచింది.
దానితో "మాష్టారికి కోపం " మొత్తం" పోయింది.
పక్క క్లాస్ రూమ్ లో మాస్టర్ ఇంకా రానట్టుంది
"మస్తాన్" "సుల్తాన్లు" కుస్తీ" పట్లు పడుతున్నారు.
" లిప్త" "అస్తమానూ ఫోన్ లో చెత్తని "చూస్తూనే వెకిలిగా నవ్వుకుంటున్నాది.
"కార్తీక్" కి"ఆప్త" మిత్రులు ఎవరూ లేరు. అతడు ప్రతి వస్తువు కోసం "కక్కుర్తి "పడుతూ అందరితో కొట్లాడుతూ ఉంటాడు. "పొగడ్త"లకి లొంగిపోతుంటాడు.
అతని అక్క" ఏక్తా "అదే
చదువుతున్నదిస్కూలులో పదవ క్లాసు.
మంచి వక్త, సంఘ సంస్కర్త కూడా. కానీ తమ్ముడిని అసలు పట్టించుకోదు.
దూరంగా మైకులో "సూక్తి ముక్తావళి "వినిపిస్తోంది.
పక్కనున్న పొలంలో రైతులు "విత్తనాలు" నాటుతున్నారు.
అంతలో ఆ స్కూల్ మాస్టారు లోపలికి వచ్చారు.
పిల్లలంతా బుద్దిగా కూర్చుని, గుస గుసలాడుకుంటున్నారు.
మాస్టారు క్లాసులో జరుగుతున్న హంగామా అంతా దూరం నుండి "చూస్తూనే "ఉన్నారు.
అతను పిల్లల్లో మార్పు తేవాలని ఎప్పుడూ
ప్రయత్నిస్తూనే ఉంటాడు..
అందులో ప్రయత్నంగా ఈరోజు
"దూర్తు" లతో నే స్నేహం చేయడం మంచిది కాదన్నారు.
మాస్టర్ పిల్లలకి "సూక్తి ముక్తావళి" వినమని చెప్పి అందరూ ఆ "సూక్తు"లను "స్ఫూర్తిగా "తీసుకొని మంచి బాటలో నడవడం వల్ల మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.
అని చెప్పడంతో పిల్లలందరూ నిశ్శబ్దంగా కూర్చొని గురువుగారు చెప్తున్న మాటలపై ధ్యాస పెట్టారు.
చిన్నపిల్లలు కదా! రాను రాను వీరిలో మార్పు వస్తుంది." తను తప్పకుండా తీసుకొస్తాడు "అనుకుంటూ
ఆ రోజు పాఠాలు మొదలు పెట్టారు గురువుగారు!
**********************************""""""""
మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
తేది: 01-07-2023
అంశము: త వత్తుతో సంయుక్తాక్షర పదాలు
శీర్షిక: బెత్తము దెబ్బలు వద్దండి
ప్రక్రియ: బాలల గేయాలు
కవి: వి.టి.ఆర్.మోహనరావు
ఊరు: పాల్వంచ
----------------------------
బెత్తము దెబ్బలు వద్దండి
చిత్తముతో పనిచేయండి
సత్తువ కల్గి ఉండండి
బిత్తర ఎప్పుడు పోకండి
సప్తమి తిథులు నేర్పండి
వర్తకుడంటే వ్యాపారండి
శిస్తులు ఎప్పుడు కట్టండి
ఉత్తరాలను రాయండి
విస్తరిలోనే భుజించండి
పొగడ్తలెపుడు వద్దండి
వస్తువులన్నీ జాగ్రత్తండి
నర్తకి నాట్యం చూడండి
గస్తీ బాగా తిరగండి
కల్తీ ఎప్పుడు వద్దండి
రక్తదానం చేయండి
ఆప్తుల వలె మెలగండి
భక్తితో ఎప్పుడు ఉండండి
శక్తిని మంచిగ కొలవండి
యుక్తిని బాగా చూపండి
ముక్తిని కూడా పొందండి
----------------------------
✍️స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.🙏
No comments:
Post a Comment