11-07-2023.
మహతి సాహితీ కవి సంగమం-
అంశం : మత్తు
శీర్షిక : తాగుబోతు
ప్రక్రియ : రుబాయిలు
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
ముందు మత్తు మరిగినోడి మాట జారి పోతుందట.
చుక్క గొంతు దిగకపోతే చెమట కారి పోతుందట.
ఇంటిపట్టు నుండలేని వింత జీవి తాగుబోతు.
సంసారమె వీధికెక్క బ్రతుకుమారి పోతుందట !
మత్తులోన మైమరచును కష్టాలను తాగుబోతు.
వీడ లేడు మత్తు పైన ఇష్టాలను తాగుబోతు
భార్య బిడ్డలను సాకడు, మత్తు లోన మునిగి వాడు
తెగ తెంపులు చేసి పోవు బంధాలను తాగుబోతు.!
అన్న మేదొ తెలియనోడు, ఆకలంటు ఎరగనోడు.
నిజాలెన్నొ తాగుబోతు తెలుసంటూ చెపుతాడు
నీతు లెన్ని చెప్పిన , నీ మాటకేమి విలువివ్వడు .
మత్తే తన లోకమంటు, మారనంటు తిరుగుతాడు.!
హామీ : ఇది నా స్వీయ రచన.
No comments:
Post a Comment