తేది: *12-10-2021: బుధవారం*
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ: పద్యము *మత్తకోకిల.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
మ.సా.క.సం.: 37.
కవిత సంఖ్య :3.
******************
చిందులేయుచు ఆడరా ఘన
ఇందు లోచన సద్గుణా ॥
కాలి మువ్వలు ఘల్లుఘల్లన
మేలి హారసు భుాషణా ॥
బాల లీలల మాత మానస
మేల వచ్చిన బాలకా
మాయ లెన్నియొ చేసి నాడవు
కాయ నీల జ పావకా ॥
భుామినావత రించినావయ
కామి తార్ధము లీయగా
కంస మర్దన జేయ వస్తివి
హింస నాశము సేయగా
దాన వాంతక దీనపోషక
గాన మంజుల మొాదితా
దాస భక్తసు పుాజితార్చిత
మాస మార్గళి వందితా ॥
శ్యామ సుందర మొాహనా పరం -
ధామ విశ్వసు పాలకా॥
నాద వేణుసు రాగ రంజన
మాధవా మదు సుాదనా ॥
గోప బాలవు గోసు,పాలవు
గోప బాలక గో
మొాహనాంగసు యొాగ కారణ
మొాద మానస మందిరా .
నీదు పాదమె నమ్మి నానుర
నిత్య నిర్మల సుందరా ॥
నీదు సమ్మతి నీయరా ఘన
నిత్య పుాజలు సేయగా
పుాలతోనిను గొల్తు మంజుల
భుాష ణాంగవు బ్రోవగా ॥
వేల కీర్తుల వేడు చుంటిని
వేగ రారఘ నాఘనా
వంద్య మానవు వంశి ధారివి
వారిజాక్షవు వందనా ॥
భక్తి ముక్తిని ఇచ్చు వాడవు
భాగ్య దాయక పాహిమాం ॥
విష్ణ వేప్రభ విష్ణ వేఘన
విశ్వ రక్షక రక్షమాం ॥
**********************
*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ కుందారపు గురుమూర్తి గారు*
సమీక్షణ: *శ్రీ పొర్ల వేణుగోపాలరావు గారు*
తేది: *12-10-2021: బుధవారం*
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ: పద్యము *మత్తకోకిల.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
*మత్తకోకిల-నిర్వచనం*
*సత్తయౌ రసజాభరల్ భవసంఖ్య విశ్రమ మొప్పినన్*
*మత్తకోకిల వృత్తమౌన సమానరంగనృపాలకా.*
*లక్షణములు :*
*పాదాలు* : నాలుగు
ప్రతి పాదంలోని గణాలు : ర స జ జ భ ర
*యతి* : ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము
*ప్రాస* : పాటించవలెను, ప్రాసయతి చెల్లదు
*నడక* :
మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా
తాన తానన తాన తానన తాన తానన తాన తా
*ఉదాహరణ1*
రాజభూషణ నిత్యసత్య సరస్వతీవిలసన్ముఖాం
భోజ రాజమనోజ భూజనపూజ్యమాన మహాయశో
రాజహంస పయోజినీవనరమ్య దిఙ్ముఖ విక్రమో
ద్వేజితాహిత విష్ణుసన్నిభ విష్ణువర్ధనభూపతీ
--ప్రాచీన కవి
*ఉదాహరణ 2*
మాన్యులార! కవీంద్రులారసమాన భాసుర శేముషీ
నాణ్యులార! వదాన్యులార! సనాతనీ తనుజాత నై
పుణ్యులార! వరేణ్యులార! యపూర్వమద్భుత సంస్థగా
గణ్యమౌ మహతీ సమాజ సుకావ్య కర్తలు మీరెగా...
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
*గణవిభజన*
*మా* న్యులా /ర కవీం /ద్రులార /
U I U / I I U/ I U I/
ర స జ
స *మా* న/ భాసుర / శేముషీ /
I U I / U I I / U I U /
జ భ ర
యతిమైత్రి: 11 వ అక్షరం -మా
ప్రాస : న్య/ణ్య
*
No comments:
Post a Comment