Wednesday, September 27, 2023

మా ఊరి పైడితల్లి

అంశం : మా ఊరి గౌరమ్మ..

శీర్షిక  :   పైడితల్లి.


రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

కల్యాణ్ :  మహారాష్ట్ర .




అమ్మా । పైడమ్మ తల్లి  మా ఊరి  కల్పవల్లి

మా గ్రామ దేవతవై మమ్మేలు బంగారు మల్లి --


వమ్మా  బంగారు బొమ్మ  మా వేల్పీవేగదమ్మ

మా భాగ్యపు రాసి నీ పండగె మా వరము సుమ్మ ॥


తెలంగాణ ఆడబిడ్డ వై నావదె  భాగ్యముా

వరముగాను పొందితిమీ నీ కొలువుల తీర్థము

పసుపు ముద్దలో  మంగళల  పుాజలంది బ్రోవుమా

 రంగు పుాల అలంకరణలిష్ట పడే దైవమా ..నీ

వే మా... భాగ్యముా, అందుకకో మా బోనముా ॥


 పచ్చ పట్టు చీరగట్ట  ' పలరించు  తల్లివే

పసుపు కుంకుమల పుాజకు పరవశించు మల్లివే

బోనాల జాతరలో , గాచు కల్పవల్లి వే

బ్రతుకు లోన వెతలన్నీ తీర్చు వేద వల్లివే...రా 

వే మా పుణ్యరాసి , నీ రక్షయె మాకు శాంతి ॥


తిమ్మిదౌ రుాపులలో జుాపినావు మహిమలుా 

 నీ కీర్తులె నలుదెసలూ, నీ లీలలు కొల్లలుా  

మా ఆట పాటలతో  చేసేటి విందులుా

గేౖకొనవె  తల్లీ  ,తీర్థాల పైడి తల్లీ ॥

నిన్నే నమ్మితిమి సుమ్మ,  నీవే కుల దైవమమ్మ ॥



-------+----------------------

No comments:

Post a Comment