Wednesday, October 4, 2023

నవరాత్రి కీర్తనలు. ..రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

[03/10, 11:45 pm] JAGADISWARI SREERAMAMURTH: నవరాత్రి కీర్తనలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

**********************
హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించి, ప్రతి అవతారం నుండి ,మరొక రెండు రూపాలతో వెలువడిందని కథనం.
మహిషాసురుణ్ణి వధించేందుకు ఆ దేవి నవరూపాలు ధరించిందని , చివరికి దశమి రోజున మహిషాసురుణ్ణి మర్దించి విజయాన్ని వారంచిందని ఐతిహ్యం . దీనికి చిహ్నంగానే , శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి ,నవావరణ కీర్తనలతో అర్చించి , పూజించడం 
ఆనవాయితీగా వస్తోంది . 
అమ్మవారి "శ్రీ చక్రంలో" గల తొమ్మిది
ఆవరణలలో,  ఆ తల్లి తొమ్మిదైన శక్తి రుాపాలతో  విలసిల్లి , అసురుల 
దునిమేందుకు అష్టభుజాస్త్ర, శస్త్ర ధారిణియై , అభయహస్తముతో
చిన్మయానందమయ ఛిద్రుాపముతో అలరారుతుా , ఆర్తత్రాణ పరాయణిగా 
ఈ జగములనేలుతున్నది.
తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు.


ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది . 
అటువంటి శక్తి స్వరుాపిణియైన దుర్గాంబ
అవతార విశేషాలను , నవావరణాల విశిష్టతను
తెలుపుతుా , ఒకొక్క  అవతారనికీ ఒకొక్క  కీర్తన
చొప్పున తొమ్మిది అవతారాలనుా, అచ్చమైన
తెలుగులో   కీర్తనలుగా రాసి , మీముందుంచుతున్నాను.
రోజు కొకటిగా రాసిన ఈ కీర్తనలను, తొమ్మిది రోజుల
పాటు , అమ్మవారి పుాజా సమయంలో ఆలాపనచేసి ,  పసుపు- కుంకుమలతో 'ఆ తల్లిని 
అర్చించి, ఆమె కృపకు , అందరుా పాత్రులు కావాలని 
కోరుకుంటూ.....
నా ఈ సంకల్పానికి,  మీ ఆశీస్సులు తోడుకాగా, అందరముా ఆ తల్లి కృపకు పాత్రులం  కావాలని
ఆశిస్తున్నాను.

ముందుగా...‌
నవావరణ చక్రాలు : ముద్రలు.
---------------------------

1.. త్రైలోక్య మోహన చక్రము  
ముద్ర పేరు - సర్వసంక్షోభిణీ
 
2. సర్వాశాపరిపూరక చక్రము 
ముద్ర పేరు - సర్వవిద్రావిణీ
 
3. సర్వసంక్షోభణ చక్రము 
ముద్ర పేరు - సర్వాకర్షిణీ
 
4. సర్వసౌభాగ్యదాయక చక్రము 
ముద్ర పేరు - సర్వవశంకరీ
 
5. సర్వార్థసాధక చక్రము 
ముద్ర పేరు - సర్వోన్మాదినీ 
 
6. సర్వరక్షాకర చక్రము 
ముద్ర పేరు - సర్వమహాంకుశా
 
7. సర్వరోగహర చక్రము 
ముద్ర పేరు - సర్వఖేచరీ 
 
8. సర్వసిద్ధిప్రద చక్రము
ముద్ర పేరు - సర్వబీజ
 
9. సర్వానందమయ చక్రము 
ముద్ర పేరు - సర్వయోని 


ఆ జగదంబ అవధరించిన, తొమ్మిది రూపాలు :
కీర్తనలు.


1 .శైలపుత్రీ.


శ్లోకం: 
వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్‌!, వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్‌!!..

1.. త్రైలోక్య మోహన చక్రము  .
ముద్ర పేరు - సర్వసంక్షోభిణి.
బ్రాహ్మీ మాతృక .

నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తుంది.

కీర్తన :

పల్లవి :
పాహి పాహి జయ,  శ్రీ  చక్రేశ్వరి
పాలించుము మము  జగదీశ్వరీ..॥

అను పల్లవి:
పాహి పరాత్పరి  , శంకరు రాణీ..
గిరి రాజ నందిని  ,  సతి శర్వాణీ...॥

చరణం :
దక్షుని యింటను  , అవమానితవై
యాగాగ్నిని నువు దుమికితివంటా
యొాగాగ్నిలొ , నీ తనువును త్యజియించి 
హిమవంతు పుత్రికవైనావంట ॥  పాహి ॥ 

దద పప మమరిరి.  పప మమ రిరి సస
దా.సరి, సా.రిస.  రీపమపా..!!
దపమపధస , మప దస. సని దసరీ..
రిపా.మ గరి ,  ధరీ.సనిధ  మగరిమప !! పాహి!!

చరణం : 
త్రైలోక్య మొాహన  చక్రమునందుండి 
అణిమాది సిద్ధులకాధారమై...
వేదపురాణ సంవేదినివై మాఁ...
బాధల బాపేవు శైలసు పుత్రివై ...

దద పప మమరిరి.  పప మమ రిరి సస
దా.సరి, సా.రిస.  రీపమపా..!!
దపమపధస , మప దస. సని దసరీ..
రిపా.మ గరి ,  ధరీ.సనిధ  మగరిమప !! పాహి!!

మిత్రం : 
అహరహముా నిను అర్చింతుము మా
అంతరంగమున  నిలుమా తల్లీ
ముల్లోకములము ఏలేటి జననీ
కల్లోల జగతిని కాపాడు తల్లీ...॥ పాహి॥

శ్రీ చక్రేశ్వరి ,  జయ జగదీశ్వరి -
లక్ష్మీ రుాపిణి పార్వతీ..
హిమవత్పన్నగ  రాజకుమారీ..
"బ్రాహ్మీ " శివే  జయ  కామేశ్వరీ...॥
----------------------------
[04/10, 9:39 am] JAGADISWARI SREERAMAMURTH: 
నవరాత్రి  కీర్తనలు .
ధ్యాన కీర్తన.. షణ్ముఖ ప్రియ రాగం.
శ్లోకం.
-------
జయ జగదంబ శివే.,ఏ....ఏ....
లయబరిత ఝం  ఝణిత ,  ఝంకార నాద ఘోష
మృదంగ నాద జనిత  ఓంకార నాద ప్రియే....!!
భయ ఘోరతర ఖలు-కలిత. భవార్ణవ తారణ,
కారణాంఘ్రి యుగళే...!!
అఖిల జగదుదయ , స్థితిలయకార ,అవ్యయానంద,
మోక్ష సామ్రాజ్య బ్రహ్మానంద వెలసితే......
ఆనంద హృదయ సామ్రాజ్య ఖనే , గనే....,ఏ. ఏ..ఏఏ !!

*****
పల్లవి : 
------
అంబా పరమేశ్వరీ. !  ఓ జగదంబ పరమేశ్వరీ!
ఓంకార రూపిని నాదస్వరూపిణి ! నారాయణి గౌరీ !
ఓం నారాయణి గౌరీ.  !! ఓ జగదాంబ పరమేశ్వరీ !!

అనుపల్లవి :
----------
అఖిల కోటి బ్రహ్మాండ నాయకి
ఆగమనుత సారే...పరే.....!! ఓ జగదంబా పరమేశ్వరీ!!

చరణం :
------
సుందర వదనీ ,  సాంభుని రాణీ ,
మందగమని మధు-కైటభ భంజని ,
పంకజముఖి పరమేశ్వరి పార్వతి ,
పర్వత వర్ధిని పాహి మహేశ్వరి ,
మృగవాహిని గౌరీ.. శివే... ! ఓ జగదంబా పరమేశ్వరీ!!

చరణం:
--------
కాత్యాయనీ, కరుణాంతరంగి, కామకోటి పీఠ వాసినీ...
కామ దహను , కాయార్ధ శరీరిణి..
కామితార్థప్రద కాల స్వరూపిణి..
కలినాసిని కామే.... శమే....!! ఓ జగదాంబా !!

మధ్యమ కాలం:
-------------
ఘణ , ఘణ. ఘణ...ఘణ    ఘంటారవే.,...
ఝణ.   ఝణ.  ఝణ. ఝణ.. నూపురపాదే....
ఐం ..హ్రీం....శ్రీం....సౌం..... మంత్ర మాన్యే.....
శ్రీచక్రేశ్వరి ,   భాగానే.. భవానీ.....
రౌద్రే , మహంకాళే ....శివే....‌!! ఓ జగదాంబ బా !!

ఐం ..హ్రీం....శ్రీం....సౌం.....మంత్రేశ్వరి....
ఐం ..హ్రీం....శ్రీం....సౌం .... చక్రేశ్వరి.....!!

---------------------------------
[04/10, 8:23 pm] JAGADISWARI SREERAMAMURTH: నవరాత్రి  కీర్తన

2 .రెండో రోజు పరాశక్తి ""బాలాత్రిపుర సుందరీదేవి".
అవతార మూర్తిగా  "బ్రహ్మచారిణి ".
సర్వాశా పరిపూరక చక్రం ".బృందావని". రాగం.
------------------------------------------

బాలాత్రిపుర సుందరీ
శ్లోకం:
 హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం; త్రినేత్రోజ్జ్వలామ్‌ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్‌!!

2.కీర్తన.
--------
పల్లవి:
--------
పూర్ణ జ్యోతి రూపాన బ్రహ్మచారిణివై.
వెలసిన పర్ణా, అపర్ణ  పాహిమాం పాహిమాం!!

అనుపల్లవి:
-----------
స్వర్ణ మకుట, మణిద్వీప, వాసములను వదిలి నీవు
ఘోర తపము నాచరించి గౌరవములనందినావు !!

చరణం:
-------
చంద్రమౌళీశుని సగభాగము నీదైన ," ఉమ"గ
భాగ్యముంది , ఖ్యాతి చెంది , పరవశించినావు
తపః , త్యాగ, వైరాగ్య ,సదాచార సంయమములు
వర్థిల్లే ఫలములిచ్చు  తల్లిగ విలసిల్లినావు !!

చరణం:
-------
సర్వాశా పరిపూరిత చక్ర స్థితవై
సాధకులకు సిద్ధినిచ్చు సిద్దేశ్వరివై
ఒక చేతిని జపమాల , వేరొకచే కమండలము
ధరించి దర్శనమిడి దీనుల బ్రోచేవు !!

బృందం:
--------
జయ జయ మహేశ్వరీ , జగదాంబా ఈశ్వరీ
జయమీయవె  జగదీశ్వరి , జయ శ్రీ దుర్గా !!
--------------------------------------

నవరాత్రి కీర్తన.

రచన : సంగీతం:  గానం : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .


3. మూడో రోజు- గాయత్రీదేవి.

అవతారిణిగా  "చంద్ర ఘంట".

సర్వ సంక్షోభణ చక్రం.

పంతువరాళి రాగం  (ఆధారంగా)

.అది తాళం.


శ్లోకం: 

ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్ముఖై స్త్రీ‌క్షణైః యుక్తామిందుని బద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌, గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీ భజే.

కీర్తన:


పల్లవి: 

-----

ఖడ్గ, బాణాది,శర , అస్త్ర-శస్త్రములెన్నియొ

దశ భుజముల ధరియించి  ధరణి నేలినావు.

అను పల్లవి:

---------

చంద్రఘంటాకార తిలకాంకితవై నీవు

సింహ వాహనమెక్కి అసురుల దునిమావు..!!


చరణం:

-------

సర్వసంక్షోభణ  చక్రస్థితవై. 

నిర్విరామ నిత్య, యుధ్ధోన్ముఖివైనావు

భూత, ప్రేత గణాదులను  ఘంటారవములతోడ

పారద్రోలి పరిరక్షణ జేసినావు !!


చరణం:

-------

దుష్ట-దమన, దురితాది శమనవై, శాంకరీ

జగముల నేలేటి జనని  జగద్ఘనివి నీవు

వీర -సౌమ్య- వినమ్ర భావముల విస్తృతి చేసేటి

విజయదుర్గ రూపి ,  "చంద్రఘంటువు" నీవు!!


బృందం:

పాహి పాహి చంద్రఘంట  పాహీ జగదీశ్వరి

పాహి జనని దుర్గా , భవాని పాహి పాహి !!


--------------------------------



No comments:

Post a Comment