Thursday, October 5, 2023

పురాణాలలో మహిళల ప్రాముఖ్యత .

05/10/2023

*తపస్వి మనోహరం పత్రిక కొరకు రచన..*

*విభాగం:* వ్యాసం

*అంశం:* పురాణాలలో మహిళల ప్రాముఖ్యత .

శీర్షిక. : "సహనానికి మారుపేరు ".


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .


చిన్నప్పటినుంచి అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు చెప్పే కథలు వింటూ, పురాణాలలో గల స్త్రీల గురించిన  అవగాహనతో పాటు , మన సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా చాలా తెలుసుకున్నాను.

పురుషాధిక్యతతో తప్పు త్రోవలో వెళుతున్న ఎంతో మంది భర్తలను , భార్యలు తమ శాంత స్వభావంతో" ఇది తప్పు" అని చెప్పిన  స్త్రీలను , 

"ఆడదాని మాట వినేదేంటి" అన్న అహంకారంతో , తప్పు త్రోవలో నడిచి,తాము చేసిన తప్పులకు "శిక్ష" గా, తమ రాజ్యాలను కోల్పోవడంతో పాటు, తమ ప్రాణాలను కూడా కోల్పోయిన మగవారు ఎంతమందో మన పురాణాలలో కనిపించారు.


ఇంక విషయానికి వస్తే...

రామాయణంలో. లంకాధిపతియైన "రావణాసురుని" పట్ట మహిషి " మండోదరి."

మహా పతివ్రత..  

 శ్రీమద్రామయణంలో కొన్ని పాత్రలు , మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తిస్తే ,మరికొన్ని పాత్రలు దానవకులానికి చెందినప్పటికి మానవత్వానికి ప్రతీకలై , ఆ చంద్రార్కం నిలిచిపోయాయి. లంకాధినేత రావణుని పట్టమహిషి అయిన ఈ మహారాజ్ఞి అలాంటి తత్వంగల స్త్రీమూర్తి.

నీతిని, ధర్మాన్ని కర్తవ్యాన్ని ప్రభోధం చేయగల మనస్తత్వం గల "మండోదరి"  వ్యక్తిత్వం , మిక్కిలి ప్రశంసానీయమైనది.

సీతాపహరణ చేసి , ఆమెను  లంకలో నిర్బంధించిన

క్షణం నుంచి, రావణుని ధర్మపత్నిగా" మండోదరి" రావణుని హెచ్చరిస్తూనే ఉంది 

ఆమె సీత యొక్క ప్రతివ్రత్య మహత్యం గురించి , శ్రీరాముని యొక్క ధర్మనిరతి , యుద్దం పటిమల గురించి 

తెలియ పరుస్తూనే ,రావణుడిని మంచి వ్యక్తిగా

మార్చడానికి ఆమె తన వంతు కృషి చేస్తూ , విధ్వంసకర భవిష్యత్తుకు దారితీసే అతని తప్పుడు పనుల గురించి హెచ్చరిస్తూనే ఉంది.

  అతనిలో ఎన్నో లోపాలు  ఉన్నప్పటికీ, ఆమె తన 

పత్త్నీ. ధర్మాన్ని విడువక చివరి వరకు అతనికి అండగా నిలిచింది .


మండోదరిరే గాక , అహల్య, తార, సీత, ద్రౌపదితో కలిసి పంచ కన్యలుగా ప్రసిద్ధి చెందిన  ఈ అయిదుగురు స్త్రీలు, తమ భర్తలతో ఏదో విధంగా సంబంధాలు చెడిన వారే. 


అహల్య : 

అహల్యని గౌతమ ఋషి. "పర పురుష సంబంధం ఉందన్న" కారణంగా   వెళ్ళగొట్టాడు .భర్త గౌతమ మహర్షి శాపంతో రాయిగా మారిన అహల్య, శ్రీరాముడి పాదస్పర్శతో తిరిగి స్త్రీ రూపం ధరించిందని ఒక కథ.

  అహల్య   బ్రహ్మ మానస పుత్రిక , అత్యంత సౌందర్యవతి,

ఆ కారణంగా , త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వారే అహల్యను వివాహం చేసుకోడానికి అర్హులని బ్రహ్మ ప్రకటిస్తాడు.

 దీంతో, తన శక్తులన్నీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చిన ఇంద్రుడు, అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని కోరుతాడు. అదే సమయంలో నారదుడు వచ్చి ఇంద్రుడి కంటే ముందుగా గౌతముడు ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెప్పగా

 బ్రహ్మ , అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు. 

తన ఇంద్ర పదవి గౌతముడు దక్కించుకుంటాడేమోనని కలవరపడిన దేవేంద్రుడు, కుటిల ప్రయత్నంతో ,

 గౌతముడి రూపంలో వచ్చి తన వాంఛను తీర్చమని అడుగుతాడు.

మహా పతివ్రత అయిన అహల్య, తన భర్త వేషంలో  వచ్చింది

 ఇంద్రుడు అని తెలుసుకొని , తన భర్త రాకమునుపే

ఇంద్ర దేవుని వెళ్లిపోమని వేడుకుంటుంది. కానీ, ఈ లోగా అక్కడకు వచ్చిన గౌతముడు పొరబడి, అవేశంతో . తన భార్య అయిన హల్యను  అలాగే, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఎవరికీ కనబడకుండా కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వెయ్యేళ్లు జీవించాలని  ఆమెను శపించాడు. అలాగే ఇంద్రుడికి ",వృషణహీనుడవు" అవుతావని శాపం ఇచ్చాడు.

అటు పై నిజం తెలుసుకున్న గౌతముడు శ్రీరామ పాద స్పర్శతో అహల్యకు శాప విముక్తి అవుతుందని తెలియపరుస్తాడు.

ఈ విధంగా అహల్య తన భర్త శాపాన్ని.వెయ్యేళ్లు భరించింది గాని ,పతివ్రతా మహత్యంతో తాను తిరిగి, భర్తకు శాపం ఇవ్వలేదు.


ఇక శ్రీమద్రామాయణంలో, రాముని భార్య అయిన" సీత,"

తల్లి కైకేయి కోరిక నెరవేర్చడానికై 14 సంవత్సరాలు అడవికి వెళ్ళిన శ్రీరాముని వెంట వెళ్లి , ఆ అడవిలో మాయా రాక్షసుల బారిన పడి ఎన్నో బాధలు పడింది .

లక్ష్మణుడు ,  రక్తసియైన సూర్పణఖ పై  కోపంతో, ఆమె ముక్కు-చెవులు, కోసినందుకు రావణుడు ఆగ్రహించి ,మాయతో, సీతమ్మను ఎత్తుకెళ్లి లంకలో ఉంచాడు.

పతివ్రత అయిన సీత, తిరిగి రాముడు తనను వచ్చి తీసుకు వెళ్ళే దాకా ,రావణుడి లంకలో, అశోక వృక్షం కింద తన పాతివ్రత్యాన్ని కాపాడుకుంటూ, రామ నామం జపిస్తూ, కొన్ని సంవత్సరాలు గడిపింది.

రాముడు రావణాసురుని చంపి, సీతను తిరిగి తనతో తీసుకెళ్ళి, అయోధ్యలో రాజ్యపాలన చేస్తూ ఉండగా , ఒక చాకలివాడు అన్న మాటలకు తలవంచి, గర్భం ధరించి ఉన్న "సీతమ్మను* అడవులలో వదిలి వచ్చాడు.

 చెప్పుడు మాటలు విన్న రాముడి చేత వెళ్ళ గొట్టబడింది, 

ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన సీతమ్మ, తిరిగి రాముడు

 పిలచినా రాకుండా, అగ్నిలో దూకి తన పాతివవ్రత్యాన్ని నిరూపించుకుని అగ్నిపునీత అయ్యింది.


ఇక ద్రౌపది అయిదుగురు భర్తలు ఆమెను జూదంలో ఒడ్డి, పోగొట్టుకున్నారు.


మాయాద్యూతంలో గెలిచి పాండవులనూ, ద్రౌపదినీ బానిసలుగా చేసుకొన్నాడు దుర్యోధనుడు .అంతకుముందు ఏ మహారాణికీ జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి. ఏకవస్త్ర ఐన ద్రౌపదిని నిండుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకువచ్చాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. ఆమె పతులముందే ఆమెను వివస్త్రను చేయబూనాడు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు పన్నెండేళ్ళు వనవాసం చేయవల్సివచ్చింది. ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటపురం వెళ్ళినప్పుడు. ద్రౌపది విరాట రాణికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించటానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు.

అజ్ఞాతవాసం తరువాత రాయబారాలు, సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది. యుద్ధం జరిగి, తనను అవమానించినవారిని తన భర్తలు నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరుకొంది. ఆ కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత ఆమె కొన్నేళ్ళు హస్తినాపుర పట్టమహిషిగా జీవించింది. కొన్నాళ్ళకు కృష్ణుడు మరణించాడు. పాండవులు మహాప్రస్థానం ప్రారంభించారు. ఆ యాత్రలో అందరికన్నా ముందు మరణించింది ద్రౌపది.

ఇలా చెప్పుకుంటూ పోతే నాటి కాలం నుండి నేటి కాలం వరకు కూడా, స్త్రీలు , అటు పురాణాలలో వారైనా సరే, ఇటు సంసారికులైనా, సరే ఎన్నో బాధలు అవమానాలు పడుతూనే ఉన్నారని తెలుస్తున్నా ది.

నా నాటి కాలంలో కూడా, పతివ్రతలైన

 స్త్రీలు బానిసత్వానికి, పురుషాధిక్యతకు ,తలవంచారు.

 నేడు కూడా అదే జరుగుతున్నది.

 దీనికి అంతం ఎప్పుడు..?


(గూగుల్ సేకరణ)

------------------


No comments:

Post a Comment