Monday, October 9, 2023

శీర్షిక : శ్రీ సీతారాముల కళ్యాణం.

[21/4/2021, 5:11 pm] JAGADISWARI SREERAMAMURTH: శీర్షిక   :  శ్రీ సీతారాముల కళ్యాణం.

శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
 
హిందువులందరు ఏ పని ప్రారంభించినా, ఏ పత్రము, ఉత్తరము వ్రాసినా శ్రీరామ నామముతో వ్రాయడం ఈనాటికీ ఒక ఆనవాయితీ, శుభ సంప్రదాయం. ఏనాటి రాముడు? ఈ నాటికీ కూడా మననలో ఎంత లోతుగా అణువణువునా ఇమిడిపోయాడు కదా! అదీ రామ నామంలో ఉండే గొప్పతనం.రామనామ స్మరణ కష్టాలలో కూడా ఎంత ఉపశమనం కలిగిస్తుందో కదా.సీతారాముల జన్మ విశిష్టత—సీతారాములు ఇరువురివీ యజ్ఞ సంబంధమైన జన్మలే. యాగం అంటే త్యాగం.అదే నిష్కామ కర్మ. యజ్ఞ పురుషుడు ప్రసాదించిన పాయస ఫలంగా శ్రీరామచంద్రుల వారు అవతరించారు. యజ్ఞనిర్వహణకై భూమిని శుధ్ధిచేసేటప్పుడు నాగేటిచాలులో దర్శనమిచ్చిన పరమపావని సీత. అందుకే ఆమె అయోనిజ. జనకాత్మజ!

శ్రీ రాముని ప్రవర–వాశిష్ట మైత్రావరుణ కౌండిన్యస త్రయార్షేయ ప్రవరాన్విత, వసిష్ట గోత్రోధ్బవస్య నాభాగ మహారజు వర్మణః నప్త్రే, అజమహారజ వర్మణః పౌత్రాయః దశరధమహారాజ వర్మణః పుత్రాయాః శ్రీ లక్ష్మీ నారాయణ స్వరూపాయ శ్రీరామ చంద్ర పరబ్రహ్మణే వరాయాః 

సీతాదేవి ప్రవర– ఆంగేయస, ఆయాష, గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగొత్రోద్భవస్య స్వర్ణరోమ వర్మణో నప్త్రీం, హ్రస్వరోమ వర్మణో పౌత్రీం, జనక మహారజ వర్మణో పుత్రీం సాక్షాత్ లక్ష్మీ దేవీ స్వరూపిణీం సీతాదేవీ నామ్నాం కన్యాం.

సీతారాముల కళ్యాణము సౌమ్య నామ సంవత్సర ఫాల్గుణ శుధ్ధ పూర్ణిమా ఉత్తర ఫల్గుణీ నక్షత్ర యుక్త కర్కాటకలగ్నమందు జరిగింది. కానీ రాముని జన్మదినం నాడే కళ్యాణము ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకుందామా!అవతార పురుషుడు శ్రీరాముడు జన్మించడమే లోకకళ్యాణం కోసం . అందుకనే శ్రీరామ జన్మదినమైన నవమినాడే అభిజిత్ లగ్నమందు (సూర్యుడున్న రాశినుండి నాలుగవ రాశి). శ్రీరామ కళ్యాణము ఆచరిస్తున్నాము.నేటి మనవివాహ వేడుకలు, ఆచారాలు, నాటి సీతారాముల వివాహమునుండి సంప్రదించినవే! ఈనాటికి వాడవాడల సీతారాముల కళ్యాణోత్సవము జరుపుకుంటున్నాము. మన ఇళ్ళల్లో కూడా అదేరీతిలో వివాహాలు చేస్తున్నాము.

ఉదాహరణకు పెండ్లి శుభలేఖ “జానక్యాః కమలాంజలిపుటే యాః పద్మరాగయితాః… అనే శ్లోకంతొ ప్రారంభమవుతుంది. తరువాత జరిగే స్నాతకం(వరపూజ), సుముహూర్తం, తలంబ్రాలు, కన్యావరణం , పెండ్లికుమారునికి పాద ప్రక్షాళన, అప్పగింతలు వంటి మన సంప్రదాయములోని పెండ్లి వేడుకలు, ఆచారాలు చాలామటుకు సీతారముల కళ్యాణంనుండి పాటిస్తున్నవే. దంపతుల అన్యోన్యతకు కూడా సీతారాముల వంటి దంపతులవాలని ఆశీర్వదిస్తారు.నేటికి కూడా మన ఇళ్ళల్లో జరుగు వివాహ సమయములో కన్యాదాత లక్ష్మీ నారాయణ స్వరూపుడైన వరుని పాద ప్రక్షాళన చేస్తూ చెప్పే మంత్రము ఒక్కసారి చూడండి. 

“ఇయం సీతా మమ సుతా సహ ధర్మ చరీ తవ | ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా | పతివ్రతా మహభాగా ఛాయ ఇవ అనుగతా  సదా!” 

రామయ్యా! నీకు సీత ఎవరో తెలీదు కదా, ఇదుగో ఈమే సీత, ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామ పత్నిగా ఇవ్వడంలేదు, నీతోపాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను, అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా!. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను, కాబట్టి నన్ను క్షమించు, ఈమెని నువ్వు పుచ్చుకో, నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో!( సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహుర్తం, మనం జీలకర్ర-బెల్లం పెడతాం సుముహుర్తానికి) ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది, నా భర్త అని నీ కోసమే చేస్తుంది. రామా! మాది విదేహ వంశం, మాకు దేహమునందు భ్రాంతి ఉండదు, నా కూతురిని అలా పెంచాను. ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే, అది నీ వల్లే రామా , ఎందుకంటే నేను నేర్పినదాన్ని భర్త ఉద్ధరించాలి!ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది, ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది అని జనకుడు చెప్పి రాముని చేతిలో సీతచేతిని ఉంచి మంత్రజలం విడిచి పెడుతాడు .రాముడు అగ్నిసాక్షిగా సీత యొక్క పాణిగ్రహణము చేసాడు .దేవదుందుభులు మ్రోగి పూలవాన కురిసినది. తరువాత జనకుడు లక్ష్మణునకు ఊర్మిళను, భరతునకు మాండవిని, శతృఘ్నునకు శృతకీర్తిని ఇచ్చి కన్యాదానము చేసాడు! 

ఈవిధంగా శ్రీ సీతారాముల కల్యాణంలో మన ముాడు తరాల వంశ ప్రవర చదవడం , కన్యా దాన సమయంలో 
వధువు తండ్రి , వధువుకు  ధర్మబద్ధమైన భాధ్యతలు తెలుపుతుా 
రాముని చేతికి తన  తన కన్యను అప్పగించడం ,  ఆ మాటలన్నీ విని అంగీకరించిన వరుడు అగ్నిసాక్షిగా ఆ చేతిని అందుకోవడం...మన  సాంప్రదాయ పద్ధతిని , మన సంస్కృతి  గొప్పతనాన్ని చాటి చెపుతున్నాయి.
నాటి నాటికి తరిగిపోతున్న మన సంస్కృతి , సాంప్రదాయాల్ని ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామ కల్లాణంలో నేటికీ మన విపృులు వేద పరంగా నిర్వహిస్తుా మనకు జ్ఞప్తికి తెస్తున్నారు. తిరిగి ధర్మ బద్ధమైన  మన సంస్కృతి , సాంప్రదాయ పద్ధతులను తప్పకుండా అందరుా ఆచరించాలని కోరుతుా...
అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు.


ఇది ఎప్పుడు ఎవరు పోష్ట్ చేసేరో తెలీదు .కానీ నాకు నచ్చినందున ఈ పోష్ట్ ను  నాకు తెలిసిన కొన్ని పంక్తులను జొిడించి మీ మధ్య నుంచేను.
[1/5/2021, 7:37 pm] JAGADISWARI SREERAMAMURTH: [5/1, 19:31] p3860749: కవితా పోటీ ఫలితాలు
*********************************************
ఫలితాలు:
ప్రథమ బహుమతి
*కడిమెళ్ల శ్రీ రామచంద్ర వర ప్రసాద్ గారు  ప్రకటిస్తారు*. 
1.శ్రీ ఆడిగొప్పుల సదయ్య
2.శ్రీమతి ఫుల్లాభట్ల జగదీశ్వవరి
3శ్రీ కిలపర్తి దాలినాయుడు
[5/1, 19:31] p3860749: శ్రీ రామనవమి కవితావసంతోత్సవం సందర్భంగా మీ కవితాపటిమను కనబరచి, *ద్వితీయ బహుమతి..* ని అందుకున్నందుకు
అభినందిస్తూ..🌹💐🌹

జక్కని గంగాధర్ 
ముంబాయి..
🌹🙏🌹

No comments:

Post a Comment