Monday, November 6, 2023

[
తపస్వీ మనోహరం పత్రిక కొరకు ,
అంశం: గుర్రం జాషువా.  (వ్యాసం).
శీర్షిక .అప్పటికీ , ఇప్పటికీ స్త్రీ ...
రచన:  శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
 కళ్యాణి్ :  మహారాష్ట్ర.
-------------------------------

ఋగ్వేదం లో కొన్ని శ్లోకాల లో స్త్రీ లకు భాగస్వామ్యాన్ని ఎంచుకునే హక్కుందంటుా రాసేరు.

అటువంటపుడు స్త్రీ  ల పరిస్థితి ఎలా , ఎందుకు దిగజారింది..?
మధ్య యుగం నాటికి స్త్రీల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది.
సాంప్రదాయాల పేరిట , కన్యాశుల్కాలు, బాల్య వివాహాలు , సతీ సహగమనాలు , దేవదాసి వంటి ఎన్నో దురాచారాలు స్త్రీ ల పాలిటి శాపాలయ్యేయి.

భర్తలు పోయిన భార్యలకు, బలవంతపు సహగమనాలు , యుద్ధంలో  రాజులు ఓడిపోయినా , ప్రాణాలు పోయినా , భార్యలు కుటుంబంతో సహా అగ్ని ప్రవేశం చేయాలి , ఇది "ఔజార్ " సాంప్రదాయ పద్ధతి, ఇది, ఎవరు పెట్టిన సాంప్రదాయం ?

ఐదు సంవత్స రాలకే బాల్య వివాహాలు చేసి, కర్మ చాలక భర్త అనే బాలుడు పోతే ఆ పసిపిల్లకు తలగొరిగి , బ్రతుకంతా వంటంటికే పరిమితం చేయడం ఎంత అమానుషం .ఎందుకంత వివక్షత...?

రజస్వల కాకుండానే  బాలిక కు వివాహం అవసరమా ?

భార్యా సహగమనాల పేరుతో భర్త పోగానే భార్యను
సహగమనం ఆచారమంటుా ,  సజీవంగా చితిలోకి నెట్టడం...ఎంత వరకు న్యాయం...? 

1815 , 1828 ల మధ్య , ఒక్క బెంగాల్ లోనే
8000 మంది అబలలు  , ఈ దురాచారానికి బలయ్యేరన్న వార్త...
ఎవరు పెట్టిన సాంప్రదాయం. ఇది...?.

దేవదాసి పేరుతో ఆడపిల్లకు  "దేవుడే నీభర్తంటుా" , దేవుని విగ్రహంతో పెళ్ళి జరిపించి , జీవితం  అంతా బ్రహ్మచారిణిగా ఉండాలని , "నృత్య -గీతాలతో , దేవుని సేవ చేసుకో" అని చెప్పడం ఎంతవరకు సమంజసం.?

  ఆ ఆచారాన్ని కుాడా రాను రాను పెడదారి పట్టించి, స్త్రీ లను వేశ్యలుగా మార్చే అధికారం ఎప్పుడు , ఎవరికి , ఎవరు , ఎవరికిచ్చేరు..?
 
" ముస్లిమ్" మతాచారాలంటుా "పరదా"  పద్ధతి పెట్టి ,
  స్త్రీ లకు ముసుగులు వేసి వారి స్వేశ్ఛకు అడ్డుతెర కట్టేరు. ఎందుకు స్త్రీ లు ముసుగులౌ...?
 
ఇలాంటి ఎన్నో అకృత్యాలు , అసమానతలను భరించలేని వారు కొందరు , స్త్రీ జనోద్ధరణకై శ్రీకారం చుట్టేరు.

వారిలో ముఖ్యులు రాజా రామ్ మొాహన్ రాయ్ ,
కందుకుారి వీరేశలింగం , సావిత్రీబాయ్ ఫుాళే...
అన్నవారు. వీరేశలింగం గారు వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి,  సఫలు లయ్యేరు.
రాజా రామ్ మొాహన్రాయ్ గారు బహు భార్యాత్వము
నేరమని పోరాడి, వితంతు వివాహాలకు మద్దతు పలికేరు.

ఇక్కడ గమనిస్తే స్త్రీ ల  పై జరిగే దురాచారాలకు స్పందించి వారి ఉన్నతికై , పోరాటోద్యమాలు సాగించిన వారు పురుషులే. కొంతమంది నిరంకుశ పాలకుల నిర్దయాపుారిత  పురుషాధిక్యతా నిర్దేశ శాసనాలకు  సాంప్రదాయ  రుాపమిచ్చి స్త్రీ ల విషయంలో  ,ఈ  రకమైన  దురాచారాలు నెలకొన్నాయా...?

నిరక్షరాస్యురాలైన   సావిత్రీబాయి ఫుళే , భర్త దగ్గరే అక్షరాభ్యాసం చేసి , చదువుకొని , పీడిత మహిళల నిక్షరాశ్యతను దుారం చేసి, స్త్రీ ల విద్యాభివృద్ధికి
పోరాటం సాగించి, 1848 లో , "పుానా " లో బాలికల పాఠశాలను ప్రారంభించిన  ప్రధమొాద్యమ కారిణి.
వీరందరి కృషి ఫలితంగా స్త్రీలకు , వివాహ సంబంధిత  కార్యాల లో కొన్ని వెసులు బాట్లు కలగడమేకాకుండా,
విద్యాభ్యాసానికి కుాడా అవకాశం కలిగింది.

స్త్రీ లు విద్యావతులవడమే కాక , వివిధ కళారంగాల లో నిష్ణాతులై రాజ్యాలేలిన దశలోకుాడా , వరకట్నాల వేధింపులుా ,  గర్భంలో ఆడ శిశువు ఉందని తెలియగానే భ్రుాణ హత్యలుా, వరకట్న సాధింపులతో,
ఒక   ఆటబొమ్మగా , పురుషాహంకార వికారాల విలాసాలకు బలైపోతున్న- స్త్రీ  జీవితం మరింత దుర్భర  మయ్యింది.

ఎన్నో సంఘ సంస్కరణోద్యమాలు జరిగేయి.
మహిళా చైతన్యం గురించి ఎంతోమంది కవి దిగ్గజాలు తమ కలం గళంతో సాహిత్య కవన పోరు సల్పేయి.

అటు తరువాత కుాడా స్త్రీల అణచివేతలు , అత్యాచారాల విషయం లో పెద్దగా ఏమీ మార్పు రాలేదు.
అటువంటి సమయంలో నే,  వినుకొండ గ్రామం లో సెప్టెంబర్ 28 / 1895 లో జన్నించారు మరో సంఘ సంస్కర్త , శ్రీ గుర్రం జాషుావాగారు.

తండ్రి , గుర్రం వీరయ్య యాదవుడు,  తల్లి  లింగమ్మ మాదిగ ఐనందున ,
ముాడాచారాలు నిండిన సమాజంలో బాల్యం నుండీ కుాడా, తక్కువ కులంలో జన్మించిన ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కున్నారు.

స్కుాలుకు వెళ్ళిన సమయంలో ఉపాధ్యాయులు, సహవిద్యార్ధులు చేసిన అవమానాలకు తిరగబడేవాడు
అటువంటి సమస్యల తోనే విద్యాభ్యసం పుార్తి చేసి
చాలా చోట్ల ఉద్యోగ విధులను నిర్వహించారు .
అటుపై సాహిత్యాభిలాషతో పలు సభల లో పద్యాలు చదివి అవమానం పొందేడు.
[02/11, 5:29 pm] JAGADISWARI SREERAMAMURTH: అటు తరువాత ఆ కవిత్వాన్నే ఆయుధంగా చేసుకొని,
ముాడాచారాలపై తిరగబడి , ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలనందుకొని , నవయుగ కవి చక్రవర్తగా కీర్తి సాధించి , తిరుపతి వేంకటకవులలో  ఒకరైన చెళ్ళ పిళ్ళ వేంకట శాస్త్రి గారిచే , కాళ్ళకు "గండపెండేరం "తొడిగించుకున్నాడు .

ఎన్నో సాహిత్య రచనలకు ఎన్నెన్నో పురస్కారాలను , బిరుదులను పొందిన శ్రీ గుర్రం జాషుావా గారు ,
స్త్రీ జనాభ్యుదయానికి మార్గదర్శిగా నిలచిన శ్రీ
వీరేశలింగం గారి సాహిత్య స్ఫుార్తి తో , అతని కల గళాన్ని, సాహిత్య కవన జోరులతో హోరెత్తించేరు.

పడుచు భార్యలు ముసలి భర్తలతో అనుభవించే కష్టనష్టాలను జాషువా అంగీకారయోగ్యంగా అక్షరబద్ధం చేశాడు. ‘‘జిలుగు మాంధాళి జలతారు చీరలోన/ పొదివి సేవింపదగు మల్లెపూల గుత్తి/ పీనుగుల మీద కప్పు పాపిష్టి కలుష/ వస్త్రపు ముసుగులో జుట్టి వయిచి నారు’’ అంటూ బాల వితంతువైన కళ్యాణి స్వరూపాన్ని శిల్ప సుందరంగా వర్ణించాడు.

"మహిళా చైతన్య పరిమళం " తో నిండి ఉన్న ఈతని సాహిత్యంలో , ఎంతో మంది పురుషాధిక్య తీరు తెన్నులను , "నేటి నెలత " ,"వంచిత" వంటి కవితా ఖండికలలో ఆవిష్కరించేరు.

నిన్నాకాశము దాకగ పొగుడుచున్‌ నీ అందచందాలతో/ వన్నెల్‌ దీర్చి కవిత్వమల్లు కొనుచున్‌, పైపై పరామర్శలన్‌/ నిన్నున్‌, నీదు శరీరమున్‌, హృదయమున్‌ ఛేదించి వేధించి యిం/ తన్నంబున్‌ బడవేయు సంఘమును/ బిడ్డా! యెట్లు హర్షింతువో’’ అంటూ వాత్సల్యంతో స్త్రీని ప్రశ్నిస్తాడు జాషువా.

ఊడిగపు యంత్రంగా స్త్రీ ని ఉపయొాగించుకొనే పురుషాహంకార ప్రవృత్తి ని ఖండిస్తుానే , స్త్రీ లను కామవాంఛలు తీర్చే బొమ్మలుగా , కొట్టి తిట్టిమరీ లొంగదీసుకొనే పురుష దౌర్జన్యాలని  , స్త్రీ ల అణచివేతలను, వారి  ఆవేదననుా జషుావాగారు ఆయన కవితల్లో హృద్యంగా చిత్రించేవారు.

పెండ్లి ఆడిన భార్యల పిప్పిజేసి/ తరుము చున్నవి పురుష భూతములు కొన్ని/ స్త్రీత్వమిడి అట్టి వానిని శిక్షించా’’లని ఆయన ప్రబోధించాడు.


జిలుగు మాంధాళి జలతారు చీరలోన/ పొదివి సేవింపదగు మల్లెపూల గుత్తి/ పీనుగుల మీద కప్పు పాపిష్టి కలుష/ వస్త్రపు ముసుగులో జుట్టి వయిచి నారు’’ అంటూ బాల వితంతువైన కళ్యాణి స్వరూపాన్ని శిల్ప సుందరంగా వర్ణించాడు.

పట్టుచీర జిలుగులతో పరిమళించా ల్సిన మల్లెపూల గుత్తిని పీనుగులమీద గప్పే కలుష వస్త్రంలో చుట్టివేశారని చెప్పడం ద్వారా వితంతువు పూర్వోత్తరస్థితిగతులను అద్భుతంగా కవిత్వీకరించాడు.

ఆధునిక సాహిత్య కవిగా ఆయన, కులాధిపత్యం వల్ల కలిగే సామాజిక పతనాలను , విధ్వంసాలని , మతోన్మాదాలు రగిల్చే ముాడదత్వాలను ,  వేల గొంతుకల కవితా ఖడ్గ శక్తి తో, ఎదిరించి పోరాడేరు.

మానవత్వమంటే ఏమిటి అన్నదానిని సమగ్రంగా చవి చుాపించే ఆతని కవితలు ,  ముఖ్యంగా స్త్రీ జనాభ్యుదయ  మార్గదర్శి గా స్త్రీ వాదానికి  , ఎన్నో కవితల రుాపాన్నిచ్చి సమాజంముందుంచేరు.

భావాభ్యుదయ విప్లవ కవుల్లో కనిపించని ' , మహిళాభ్యుదయ చింతన , జషువా గారి కవిత్వం లో గొోచరిస్తుంది.

పురుషాధిపత్యం తీరుతెన్నులను జాషువా ‘నేటి నెలత’, ‘వంచిత’ కవితా ఖండికల్లో ఎంతో సముచి తంగా ఆవిష్కరించాడు.

భావదాసురాలు’, ‘వెర్రి బాగులమ్మ’, ‘పరమ మూఢ’ ‘చపల హృదయ’ వంటి పదబంధాల ద్వారా స్త్రీలలోని పోరాటలేమిని ఎత్తి చూపాడు.

స్త్రీ ల ఉన్నత చైతన్యాన్ని , జ్ఞానాన్ని  హత్య చేసిన విధంగా రుాపొందించిన  సాంప్రదాయాలను ఆయన వ్యతిరేకరించేరు.

నాదు కంటినీరు నా తల్లి దేహాన/ నరనరాన దుఃఖనదులు చిమ్ము’’ అంటూ
తల్లిగా బిడ్డలతో గల అనుబంధం, భార్యగా భర్త తో గల బంధాల ఔన్నత్యాన్ని గురించి జాషుావాగారు తమ రచనల లో విశదీకరించిన రీతి కంట నీరు తెప్పించే   విధంగా అంతరాళను కలచివేస్తుంది.
[02/11, 5:30 pm] JAGADISWARI SREERAMAMURTH: స్త్రీ  అందాన్ని వర్ణిస్తూ , ఆమె శరీరాన్నీ మనసునుా హింశిస్తుా, పిడికెడు అన్నం తప్ప మరే రకమైన గౌరవాన్నీ ఇవ్వని కరకు సమాజాన్ని , పురుశాదిక్యతనుా  ధిక్కరించే కవి జషుావా.

తన భార్య తన ను వీడి పోయినపుడు ,
"నా తనుయష్టి ప్రత్యణువున్‌ గల పుష్టికి కార ణంబు నీ/ చేతి సుధాశనంబె కద! చిక్కునె నా కనరాదుగాని, నా/ మాతకు మారుగా, యనుగు మానిని రూపము దాల్చినట్టి నా/ జాతక పుణ్యరేఖవో ప్రశస్త శుభైక వరప్రదాత్రివో’’ అంటూ భార్యను తల్లిగా అభివర్ణించడం జాషువా ఔన్నత్యానికి తిరుగులేని నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

హిందుా సంఘ సనాతన ఆచారాలను ధిక్కరిస్తుా,
సంఘమంటే మనుష్యులను పీక్కుతినే కృార పిశాచాలతో  పోల్చడంతో , ఆతని కవిత్వం పరాకాష్ట కు చేరుకొంది.

సతుల నైసర్గిక జ్ఞాన సస్యరమను చిత్రచిత్రంబుగా హత్య చేసినారు’’ అంటూ కిరాతకమైన మనుస్మృతిని, హిందూ పితృస్వామ్య సమాజాన్ని తీవ్రంగా నిరసించాడు.

ఆచారాలన్నీ ఆత్మ శాశనాలకు , పర నాశనానికి కారణభుాతాలంటుా  వర్ణించేరు. ధర్మం పేరుతో చేసే   ఆచారాలు , సాంయ్రదాయ అకృత్యాలకు ,
నాలుగు పాదాల ధర్మదేవత ను, నాలుగు పాదాల  పశువుతో పోల్చేరు.

సాహసోపేతమైన ఆతని స్త్రీ వాదాన్ని , చీకటి కోణాల్లో
నిలబడి ఉన్న నిరంకుశత్వాన్నీ ,దృశ్యమసనం చేసిన ఆతని వ్యక్తిత్వాన్ని ఎవరుా ఖండించలేకపోయేరు.

వివేకం లేని విద్య విద్యే కాదని , విద్య యొక్క ఆవశ్యకతను శాస్త్రీయంగా విశదీకరించేరు.

"అబల విద్యా పూర్ణయైు తోడురాకున్నన్‌ దేశము నిద్ర మేలుకొనునే’’ (ప్రబోధం), ‘‘స్త్రీల విజ్ఞానంబు చిదిమి బందీ జేయు దేశాన సిరులు వర్ధిల్లగలవే’’ (బాపూజి) అంటూ ఒక సామాజిక శాస్త్ర వేత్తలా
చదువెరుగని స్త్రీ లు తమ బిడ్డల పురోగతికి అవరోధము కారా అంటుా ప్రశ్నించేరు.

కుల-మత భేధాల కర్కశత్వాన్ని తెరచాటు నాటకంలో చుాపిన జషుావా అంతటితో ఆగలేదు.

బాల్యం నుండే కులమత భేదాలకు అర్ఘ్యం పోస్తున్న తల్లిదండ్రులను నిలదీసి ఆలోచింపజేసేడు.

"ఖండ కావ్యం" లో, నాటి రాజకీయ నాయకుల సంకుచిత్వాన్ని వ్యంగ్యంగా ఎత్తి చుాపేరు.

స్త్రీ  సర్వతోముఖ పురోగమనాన్ని వాగ్దానం చేసిన హిందుా కోవిడ్ బిల్లును వ్యతిరేకించిన మన నాయకులు , వల్లభ్ భాయ్ పటేల్ , డా॥ రాజేంద్రప్రసాద్ , ప్రధాన మంత్రి నెహ్రూ లను నిరసిస్తూ ,
రాజీనామా చేసిన , డా॥ అంబేడ్కర్ , పార్లమెంట్ సాక్షిగా "హిందుా కోవిడ్ బిల్ " హత్య చేయబడిందని ,
దానికోసం రెండు కన్నీటి బొట్లు  కుాడా కార్చిన వారు
లేకపోయేరని , వాపోయిన చారిత్రాత్మక ద్రోహాన్ని
జషువా తన పద్యాల లో సమర్ధవంతంగా అక్షరబద్ధం
చేసేరు.

పురుషులతో పాటు స్త్రీ లకు కుాడా సమాన మర్యాదలివ్వాలని, దళిత స్త్రీ ల దుర్ధర దారిద్ర్య బాధలు తొలగాలని, వాస్తవికత దృష్టి  కోణాల్లో వర్ణించేరు.

వితంతు, గబ్బిలం ,స్మశానం ,చీకటి ,లాంటి సంఘ -
విముఖ అంశాలను తన చాతుర్య కవితా పటిమతో
సౌందర్య శోభితం చేసి , పాఠకలోకాన్ని పరవసింపజేసేరు.

వస్తువు అధమమైనా, ఉత్తమమైనా, వికృతమైనా...
జాషుావా కలం నుంచి జాలువారిన పిదప సుశోభిత కవిత్వమై , లోకోత్తర రుాపమై , సమాజ మేల్కొలుపుకు
శ్రీకారం చుడుతుంది.

కవిత్వాన్ని ఆయుధంగా మలచుకొని ,ముాడాచారాలపై
తిరుగుబాటు చేసిన జషువా , దళిత కులస్తునిగా ఎన్నో
అవమానాలను కుాడా ఎదుర్కొన్నాడు.
ఆపై ఎంతో ఎదిగి , గౌరవ పురస్కారాలను అందుకున్న జషువా స్త్రీ ల స్వతంత్ర్యత పై అక్షరోద్యమాన్ని సల్పిన అమర చరిత్రకారుడు.

జీవిత పోరాటపు సంఘర్షణల ఎగుడు దిగుడు బాటల్లో
ప్రయాణిస్తుానే , ఆంధ్రప్రదేష్ శాశనమండలి సభ్యత్వాన్ని పొందిన  జషువా

నీ మానసము దయారామాభివృద్ధికి అమృతంబు చిల్కు వర్షా గమంబు/ నీ చరిత్రము గాఢనిద్రా దరిద్రాణ కుతల చక్రమునకు కోడికూత’’ (ఖండకావ్యం.4) అని కవి వ్యక్తిత్వ గరిమను కొనియాడిన జాషువా ఈ రకమైన కవితా హృదయంతో, తెలుగు సాహిత్యంలో మేలుకొలుపుల గానం ఆలపించిన జాషుావా

24 జులై  1971  గుంటూరు లో స్వర్గస్తులయ్యి , ఈ నాటికీ కుాడా , స్త్రీ  జనాభ్యుదయ మార్గ దర్శకునిగా, ప్రజల గుండెల్లో అక్షర రుాపమై నినదిస్తున్న  కవనోద్యమకారుడు.
ఎంత మంది ఎన్ని ఉద్యమాలు సల్పినా ,  ఎన్ని   శాశనాల మార్పులు జరిగినా , ఎన్ని ఆరక్షణా కేంద్రాలు స్థాపించినా , స్త్రీ లు ఎంతో  ఎత్తుకు ఎదిగినా,  నేటికిీ స్త్రీ ల విషయంలో జరుగుతున్న అమానుష అకృత్యాలు  ఆగని ఆక్రోశాలై, విలపిస్తునే ఉన్నాయి.

  పురుషాధిక్యతల  అకృత్య సాముాహిక బలాత్కారాల దాడుల ఆత్మహత్యల తో  , ఏసిడ్ దాడుల వంటి వికృత చర్యలకు భయంతో   అల్లలాడుతుానే ఉన్నాయి.
రోజు రోజుకుా పెరుగుతున్న ,  నికృష్ట  దుష్ట చర్యలతో కకావికలమౌతున్న  స్త్రీ సమాజోద్ధరకై ,   స్త్రీ ల కన్నీటిని తుడిచే మరో జషుావా వంటి  స్పందన గల ఉద్యమకారులు  ఉద్భవించాలని కోరుకుంటుా..

"ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు."

--------------------------------------------------------------

No comments:

Post a Comment