శీర్షిక : శివుడు ,స్వయం భవుడు (. వ్యాసం).
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
.శ్రీ మహావిష్ణువుకు పేరు, నిర్మాణం మరియు గుణాలు లేవు.
గుణాలు లేకుండా సృష్టి, నిర్వహణ మరియు నాశనం అసాధ్యం గనుక
మహావిష్ణువు మొదట త్రిగుణాలను అంటే ,సత్వ, రజస్సు , తమస్సు. లను సృష్టించాడు .ఆతరువాత అతను
స్వయంగా ఆ త్రిగుణాలను తీసుకొని త్రిమూర్తులుగా ఉద్భవించాడు,
సత్వగుణం తో విష్ణువుగా , తమో గుణంతో శివునిగా , రజో గుణుడైన బ్రహ్మగా అవతరించాడు.
ఈ త్రిగుణాల ఆధారంగా" సృష్టి , స్థితి అంటే నిర్వహణ , మరియు లయ అంటే నాశనం / మరణం ," జరుగుతుంది.
సృష్టిని బ్రహ్మ, స్థితిని విష్ణువు, లయను శివుడు చూసుకుంటాడు.
మహావిష్ణువు విష్ణువుకి పూర్తిగా భిన్నం. మహావిష్ణువుకు గుణాలు లేవు కానీ విష్ణువుకు సత్వగుణం ఉంది.
మహావిష్ణువు నుండి బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు జన్మించారు.
సూక్ష్మ దేవతలైన బ్రహ్మ , విష్ణు, మరియు శంకరు లతో సహా అన్ని ఆత్మలకు తండ్రి యైన ,పరమాత్ముడు శివుడు.
అతను అనంతమైన చిన్న కాంతి బిందువు.
ప్రపంచ నాటకం యొక్క ప్రతి చక్రంలో నాలుగు యుగాలు ఉన్నాయి.
సత్యయుగంలో దేవతలు పాలకులుగా ఉండేవారు మరియు విష్ణువు కృష్ణునిగా జన్మిస్తాడు .. త్రేతాయుగంలో రామునిగా .
జన్మించేడు.
కలియుగ ముగింపులో ప్రపంచం మొత్తం నరక భూమిగా మారగా ,.శివుడు ప్రజాపితయైన , బ్రహ్మ శరీరంలో అవతారమూర్తిగా. ఉద్భవించాడు .
ప్రకృతి యొక్క సత్వ, తమో, రజో గుణాలేవీ
అంటని వాడు శివుడు.
.కాలతీతుడైన శివుడు జనన,మరణాలుకు అతీతుడు.
పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క అర్ధం ఉంది.
రుద్రస్వరూపుడైన శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే, శాంతస్వభావునిగా ఉన్నప్పుడు , పరమేశ్వరుడు
పార్వతీ దేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మొదలైన పరిజనులతో... శాంతమూర్తి గా మనకు కనిపిస్తారు.
శివుడు దుఃఖభూమిగా మారిన ప్రపంచాన్ని నాశనం చేస్తాడు అన్ని ఆత్మలకు విముక్తినిచ్ఛి. , సత్యయుగంలో మళ్లీ స్వర్గాన్ని మరియు దేవతలను సృష్టిస్తాడు.
స్వయంభవుడైన. పరమశివుని "జ్ఞానగురువు"
అవతారం. శ్రీ దక్షిణామూర్తి .
అంతేకాదు ,
దక్షుడి యాగాన్ని భక్నం చేసినపుడు వీరభద్రుడిగా , మరో సమయంలో కాలభైరవుడుగా
హనుమంతునిగా అవతరించిన శివుడు. వేవేల నామాలతో
పిలుప బడుతూ పూజింపబడుతుతూ ఉంటాడు.
"శివ" అంటే సుాన్యమైనదని అర్ధం.
సుాన్యమైన ఈ విశ్వంలో గల సకల చరాచర జగత్తును సృష్టించిన వాడు , తిరిగి తనలోనే లయం చేసుకుంటుా
లింగాకారుడై ,సర్వ వ్యాపియై యున్నవాడే "శివుడు" ॥
త్రినేత్రధారిణి యైన" శ్రీ రాజరాజేశ్వరీదేవి"చే సృజింపబడిన త్రిముార్తులలో ఒకడై-శ్రీరాజరాజేశ్వరీదేవి కోరికమేరకు
ఆమెతో వివాహానికి అంగీకరించి , బదులుగా ఆమె ముాడవనేత్రాన్ని వరముగా పొందినవాడు పరమశువుడు॥
వివాహానంతరం అదే ముాడవనేత్రంతో
శ్రీ రాజరాజేశ్వరీదేవిని భస్మం చేసి , అదే భస్మంతో
దుర్గ, లక్ష్మి సరస్వతీ అనే ముాడు శక్తి స్వరుాపాలను సృష్టించిన పరబ్రహ్మానందస్వరుాపుడు శంకరుడు ॥
దుష్ట- శిక్షణ, శిష్ట -రక్షణకై కేశవునిగా జగములేలిన
శివ కేశవముార్తిస్వరుాపుడు శివుడు.॥
పరమశివుని ఆకృతిలో .శివుని" త్రిశూలం"లో నున్న
మూడు నామ సూచికలు
సత్వ, రజ,-తమో గుణాలకు ప్రతిరూపాలు..
"ఢమరుకం" శబ్ద బ్రహ్మ స్వరూపం.
అతని శిరస్సు నలంకరించిన"చంద్రవంక"
మనోనిగ్రహానికి, తలపైనున్న-"గంగాదేవి"
శాశ్వతత్వానికి ప్రతీకలు.
అతని దేహంపై గల" సర్పాలు" భగవంతుని జీవాత్మలుగాను,
ధరించిన" పులి చర్మం " , త్యజించమనే అహంకారానికి,
"ఆశీనం "పైన పులిచర్మం , కోరికలకు-దూరంగా ఉండమన్న సత్యానికి ,నిదర్శనం.
" భస్మం" పరిశుద్ధాత్మకు , అతను పట్టుకున్న
నాలుగు "జింక కాళ్ళు" చతుర్వేదాలకు,
" నందీశ్వరుడు" సత్సాంగత్యానికి,
నంది ధర్మదేవతకు, "మూడవ నేత్రం "
జ్ఞానానికి ప్రతీకలై విశ్వాన్ని నడిపిస్తున్న
శక్తికి సుాచికలు.॥
క్షేత్ర కారకుడు , క్షేత్ర దర్శకుడు , క్షేత్ర పోషకుడు ఐన శివుడు ,
జననమరణాలుకు అతీతుడై- వేల నామాలతో స్తుతింపబడుతుా., అనంత రుాపాలతో దర్శింబడుతుా,
సృష్టి, స్థితి ,లయ కారక , సకారాత్ముడైన
నిరాకార లయకారుడు" పరమశివుడు" ॥
కురుక్షేత్ర యుద్ధం ముగిసిసిన తరువాత
పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టు కోవడానికి "శివ దర్శననం"
చేసుకుందామని బయలుదేరగా .
శివుడు "నంది" రూపం ధరించి
వారికి దొరకకుండా , పరుగెత్తి అంతర్దానమైపోతాడు.
ఆ సమయంలో ఈశ్వరుని శరీర భాగాలు ఐదు ఛోట్ల ప్రతిష్ఠితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి..
శివ పురాణంలో వర్ణించబడిన ఈ "పంచ కేదారాలను" "పంచఆరామా"లని పిలుస్తుంటారు.
అవి వరసగా
" కేదారినాధ్, తుంగ నాధ్, రుద్ర నాధ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్. " లు.
ఇవి. గాక శివుని యొక్క మహా పుణ్య క్షేత్రాలు,
వాటి స్థల పురాణపు కధనాలు ఎన్నో ఉన్నాయి .
శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది.
"శి" అంటే, శాశ్వతానందమని , పురుష శక్తి అని ,
"వ "అంటే మహిళల శక్తి అని అర్థం.
శివుడిని" లింగ "రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడని వేదాలు వివరించాయి.
ప్రపంచమంతా మాయతో నిండి ఉండి, చావు, పుట్టుకలు చక్రంలా తిరుగుతుంటాయి.
తనువు చాలించిన తరువాత శరీరం ,మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మకు మాత్రం మరణం ఉండదు.
శరీరం నుంచి విడిపోయిన తర్వాత ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుంది. ఆ శరీరం అగ్ని వల్ల పునీతమైన తర్వాత , మిగిలే బూడిదను ఒంటికి రాసుకుని, కపాలమాలను మెడలో ధరిస్తాడు శివుడు . విషనాగులను కూడా తన ఆభరణాలుగా ధరించే శివుడు సమస్త జీవరాశిని శివుడు సమదృష్టితో చూస్తాడః .
ఆయనకు విషమైనా, అమృతమైనా, గుడియైనా స్మశానమైనా
ఒకటే.
శివుడు స్మశానం లో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాడు.
ఎందుకంటే , శ్మశానం అంటే ఎటువంటి భయాలు, ఆశలు, కోరికలు, కోపాలు, ఆందోళనలు, బంధాలు లేని ప్రదేశం. అక్కడున్న శరీరాలు, ఎండకు, చలికి, వర్షానికి దేనికి కూడా చలించవు. ఎవరు ప్రతి కర్మను కర్తవ్యంగా చేస్తారో, నిత్యం ప్రశాంతంగా ఉంటారో, సుఖః దుఃఖాలను సమానంగా చూస్తారో, ప్రతి విషయానికి ఆవేశ పడరో, అటువంటి వారి మనసు కూడా స్మశానం లాగ దేనికీ చలించకుండా ఉంటుంది.
అందుకే శివుడు. స్మశానాన్ని ఇష్టపడతాడు.
మహాపురుషుల మరణానంతరం, వారి చితాభస్మాన్ని శివయ్య తన శిరస్సుపై పోసుకుంటాడు. అలా నిష్ఠాపరులైన వారి కపాల మాలనే మెడలో అలంకరించుకుంటాడు. అందుకే ఆయన కపాలీశ్వరుడయ్యాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే, కర్మలన్నీ, జ్ఞానమనే అగ్నిచేత దహించబడగా మిగిలేది భస్మం మాత్రమే. అదే జ్ఞానైశ్వరం .
ఎంతగొప్పవాడైనా, బీదవాడైన, ప్రతి జీవుని ఆత్మ ,
ఆఖరున ఏ పరమాత్మను చేరాలో, ఏ ప్రదేశాన్ని చేరడం శాశ్వతమో, ఎక్కడకు చేరిన తరువాత ఇక తిరిగి జన్మించడం ఉండదో, ఆ కైవల్యపదమే శివుడి నివాస స్థానం .
ప్రపంచంలో ఉన్న ఆడంబరాలు ,శ్మశానంలో ఉండవు. కాలుతున్న శవాలు, బూడిద తప్ప. ఆ బూడిదే సత్యంమనీ
చెప్పే తత్త్వ జ్జనైక మూర్తి శివుడు. . అందుకే శివుడు ఎప్పుడూ బూడిద ధరిస్తాడు. అదే ఆయన ఆభరణం. అందుకే ఆయన నివాసం శ్మశానం.
శివుడు ధరించిన ఈ భస్మం
,( విభూది) చాలా మహిమాన్వితమైనది .
పంచభూతాలను ఆధీనంలో ఉంచుకున్న శివుని చూస్తే
చావు కూడా భయపడుతుందదంటారు.
"ఓం , నమఃశివాయ."
( గూగుల్ సేకరణ ).
------------------------------------------------
No comments:
Post a Comment