Monday, November 6, 2023

మనసు"లో" మాట విను..కధ

*

రచన :శ్రీమతి ; పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ :మహారాష్ట్ర.
----------------
కథా ప్రారంభం.

శీర్షిక:  మనసు" లో"మాట విను.. 
-------------

మనోహర్ కష్టపడి చదువుతున్నాడు.
మనసులో నిండా కసి ప్రకాష్ మీద .
వెధవ ,వాడే ఎప్పుడు కాలేజీలోని ఫస్ట్ వస్తూ ఉంటాడు .
కాలేజ్ ఎలక్షన్లో వాడే ఎప్పుడు లీడర్ గా ఎన్నుకోబడతాడు.
ఇప్పుడు ఎలాగైనా సరే వాడిని నేను ఓడించాలి.
 ఓడించాలంటే చదవాలి .కాలేజీలో నాకు మంచి పేరే ఉంది. కానీ ఏం లాభం..?
 తను ఎలాగైనా" లీడర్ "అవ్వాలి  అంతే ....
మనోహర్ "లో" మనసు బాధగా మూల్గింది.
" నువ్వు పైకి రావాలని చదువుకో"...
"ఆ ప్రకాష్ మీద పంతంతో  మాత్రం చదవకు  మనోహర్." అంటూ....
తన బుద్ధిని విమర్శిస్తున్న మనసును కోపంగా
 పక్కకు నెట్టాడు  మనోహర్.
"నువ్వు ముందు నోరుముయ్..."
"ఈసారి నేను లీడ్ లీడర్ అవ్వకపోతే వాడి పని చెప్తా..",..
----------------------
రిజల్ట్స్ వచ్చాయి. మనోహర్ డిష్టెన్షన్ లో పాస్ అయ్యాడు. మనోహర్ ప్రవర్తన, చదువు ,చూసిన మీదట ,ఆ సంవత్సరం కాలేజీ "లీడర్ "గా మనోహర్ ఎన్నుకోబడ్డాడు
తనను కంగ్రాట్స్ చేస్తున్న ప్రకాష్ వైపు, మనోహర్ క్రూరంగా చూశాడు.
-----------------
మనోహర్ ఇంటికెళ్లగానే తల్లిదండ్రుల ఆనందం చెప్పలేనిదనే చెప్పాలి .మనోహర్కి కూడా చాలా ఆనందం వేసింది .
తండ్రి మనోహర్ ని పిలిచి, ఓ" తాళం చెవి "చేతిలో పెట్టాడు ఏంటి నాన్నా.,? అన్నాడు మనోహర్  .
తండ్రి బయటికి చూపించాడు .
"స్కై బ్లూ కలర్" లో ఉన్న కొత్త "బైక్ "తనకు స్వాగతం చెప్తోంది.
మనోహర్ ఆనందం అంతా ఇంతా కాదు .
వెంటనే ,అవునులే..
 తను ఒక్కడే గా కొడుకు. తన తర్వాత ముగ్గురు అప్పచెల్లెళ్లు   ఉన్నారు. వాళ్లకు పెళ్ళవగానే వాళ్ళు వెళ్ళిపోతారు. తనేగా నాన్నని చూడవలసింది. మరి తనకు ఇవ్వక మరెవరికి ఇస్తాడు.
మనసులో స్వార్థంగా ఆలోచించినా , పైకి మాత్రం మనోహర్ 
సంతోషంగా డాడీని హత్తుకున్నాడు.
-------------------
మనోహర్ డాబా మీద నిల్చుని బైనాక్యులర్తో ఎదురింటి
" మీనాక్షిని" అదేపనిగా చూస్తున్నాడు . "మీనాక్షి"  ఎదురింట్లో ఉన్న "చంద్రం". భార్య.
చంద్రం కి తనంటే ఎంతో అభిమానం . తన "క్యారెక్టర్" అంటే చంద్రం కి  ఎంతో ఇష్టంట.   అవును మరి తను అందరి
దగ్గర అలాగే బిహేవ్ చేస్తాడుగా....
తన మనసులో జరుగుతున్న యుద్ధం ఎవరికీ తెలుసు..?
తను రోజూ వాళ్ళ ఇంటికి వెళ్తాడు.   చంద్రం వెంటనే భార్యను పిలిచి , కాఫీ టిఫిన్ తెప్పిస్తాడు .ఇద్దరు కూర్చుని చాలా సరదాగా  తనతో మాట్లాడుతూ ఉంటారు .
తన కళ్ళు మాత్రం , నఖ సిఖ పర్యంతం మీ మీనాక్షి అందాన్ని,.
పరిశీలిస్తూనే ఉంటాయి... దొంగతనంగా.,...
కానీ తను వెళుతుంది మీనాక్షి కోసమే అని చంద్రం కి తెలియదు ఇంతకీ తనకు ప్రత్యేకంగా "మీనాక్షి" అంటే ఏమీ అభిమానం లేదు , 
కానీ ఆమె ఫిగర్ ఉందే.....అబ్బ....
ఏదో రోజు దీని పని పట్టాలి. "తనే "అని తెలియకుండా ,ఏదో చేసేయాలి..... కాఫీ తాగుతూ మనోహర్ "కామ వాంఛతో" 
.. రగిలిపోతున్నాడు.
మనోహర్ "లో" మనసు మళ్లీ బాధగా మూల్గింది.
"నమ్మిన వాళ్లని మోసం చేయకురా"... అంటూ..
నువ్వు " పో " అవతలికి అంటూ, నెట్టేసాడు నిర్లక్ష్యంగా.,

-----------------------
పిల్ల నచ్చిందా మనోహర్..?
 ఎన్నో సంబంధాలు చూసాం రా .కానీ మాకే పిల్లా నచ్చలేదు ఈ పిల్ల నీకు బాగా నప్పుతుందని అనిపించింది .
చూడు ఎంత అందంగా ఉందో. 
కట్నాలు, కానుకలు కూడా మనకు తగ్గట్టుగానే ఇస్తామంటున్నారు ...అంటూ మెల్లగా చెప్పింది మనోహర్ చెవులో..
పెళ్ళంటకు ఏం బాగోలేదు కొంచెం లావు కూడాను అయినా
 మనోహర్ కి , వాళ్ళు ఇస్తున్న కట్నం మాత్రం భలే నచ్చేసింది .
అందుకే ,మనోహర్ కళ్లు దించుకొని అన్నాడు
,మీ ఇష్టమేనమ్మా,! మీరు ఎలా చెప్తే అలా "
పిల్ల పేరు రాజ్యలక్ష్మి. రాజ్యం ,రాజ్యం అని పిలుస్తూ ,కొన్నాళ్లు చుట్టూ తిరిగాడు .కానీ  పై కిటికీ లోంచి మీనాక్షిని చూడడం మాత్రం మానలేదు.

". ఛి..ఛీ .. నీ బుద్ధి మరి మారదా ? మనసు మళ్లీ హెచ్చరించింది ...
"ఏయ్ ! మళ్లీ నన్ను డిస్టర్బ్ చేయకు".. అంటూ మనసు తలుపులను అప్పటికి మూసేశాడు మనోహర్.
-----------------
తన పెళ్లయిన సంవత్సరం తర్వాత ,తండ్రి వీలునామా రాశాడు ఆస్తి తనతో పాటు, ముగ్గురు ఆడపిల్లలకి పంచాడు.
 మనోహర్. మనసులో కుతి కుతలాడిపోయాడు.
" ఏంటి? వాళ్ళు తన దగ్గరే ఉంటారు. కానీ ఆస్తి మాత్రం ఆడపిల్లలకు కూడా ఇస్తాడా ..? ఎంత దుర్మార్గం.
ఈ ఆస్తి మగపిల్లాడినైనా తనకే కదా చెందాలి. తన దగ్గరే ఉంటూ ఆస్తి మాత్రం అందరికీ పంచేస్తే ఎలా..?
  వాళ్ళు చచ్చే వరకు, తనే చూసుకోవాలి కదా!
 ఇంకా ఈ పప్పులేం ఉడకవ్ .
వీళ్ళ పని చెప్తా ..ఏదో ఒకలాగా వీళ్ళని వృద్ధాశ్రమానికి పంపించేస్తా.... హమ్మా.....
ఆ క్షణం నుంచి మనోహర్ కి తల్లిదండ్రుల పైన గౌరవం తగ్గిపోయింది.
మనోహర్ లో అప్పుడు మొదలైన" కసి "క్రూరత్వంగా అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంది. ఈటెల లాంటి మాటలతో ,తల్లిదండ్రులని అవమానిస్తూనే ఉన్నాడు..
 మనోహర్ లో వచ్చిన ఈ మార్పుని , తల్లిదండ్రులు గమనించారు  గానీ ,ఏమి చేయలేక కళ్ళు నీళ్లు పెట్టుకునేవారు.
మనోహర్ కి మాత్రం, తల్లిదండ్రులని ఇంకా తన దగ్గర ఉంచుకోవడం అనవసరం అనిపిస్తుండేది
"కానీ వాళ్ళని బయటకి పంపడం ఎలా ? భార్య "రాజ్యం" కి ఏమీ అర్థం కాదే ..? వాళ్ళని తన తలిదండ్రుల కన్నా ఎక్కువ గౌరవంగా చూసుకుంటున్నాదే....
బయట తనను , తనను అందరూ పొగుడుతున్నారు.
 పెళ్లయినా తల్లిదండ్రులను తన దగ్గర ఉంచుకొని ఎంత గౌరవంగా చూస్తున్నాడో అని.....
"అందుకే ఎవరికీ పట్టు పడకుండా" ప్లాన్" వెయ్యాలి"  అనుకున్న. మనోహర్  ..
అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు...

మనోహర్ "లో" మనసు మళ్లీ బాధగా మూల్గింది.
"ఒరేయ్.. నీచుడా! వాళ్ళు నిన్ను కన్న తల్లిదండ్రులు రా! 
"వాళ్ళ  ఋణం తీర్చుకోరా" అంటూ ఏదో చెప్పపోయింది.
"నువ్వు లోపలికి పోతావా ?పోవా ? 
 మళ్ళీ నాకు ఇలాంటి సలహాలు ఇవ్వకు." అంటూ లోనికి నెట్టేసాడు.
---------------
మనోహర్ భార్య రాజ్యం, నెల తప్పింది .అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.    ఇదే సాకుగా, భార్య "ఇంట్లో పనులు చేస్తే కష్టం" అని చెప్పి , మనోహరో భార్యని పుట్టింటికి పంపించేశాడు." అమ్మయ్య దీని బాధ తప్పింది" అనుకుంటూ.
భార్య వెళ్ళిన నెలలోనే తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో దింపి వచ్చాడు మనోహర్ . తను ఆఫీస్ పనితో వారిని సమంగా చూసుకోలేడని , భార్య వస్తే ,మళ్లీ  ఇంటికి తీసుకొస్తానని చెప్పి మభ్యపెట్టి వచ్చేసాడు ...
కళ్ళు నీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రులను "కసిగా" చూశాడు. "ఉండండి ఇక్కడే ..డబ్బంతా ఇచ్చేసారుగా అప్పచెల్లెళ్లకి... 
ఇకపై వాళ్లే చూస్తారు మిమ్మల్ని," అనుకుంటూ,
 పైకి మాత్రం వాళ్లని వదిలి వెళ్ళలేనట్టుగా వెళుతూ,," నటనలో తనను మించిన వారు లేరు "అనుకోని మురిసిపోతూ,
" నాన్న ఇచ్చిన బైక్ " ఎక్కి ,
ఇంటికి బయలుదేరాడు మనోహర్.
"ఛీ...సిగ్గులేని వెదవా" ఉంటూ ఏదో చెప్పబోతున్న మనసుని  మళ్లీ పక్కకు తోసేసాడు.
----------------------------+
భార్య పుట్టింటికి వెళ్ళడం, తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉండడం ,  సాటర్డే సండే ఆఫీసుకు సెలవులు కావడంతో, కాలక్షేపం కోసం చేసే చెత్త ఆలోచనలు బోలెడు స్వాగతం చెప్పాయి మనోహర్ కి.
కనిపించిన ఆడవాళ్ళని ,కళ్ళతోనే ఎక్స్రే తీసేస్తున్నాడు.
ఆలోచనలోనే ఆనంద విహారాలు, శోభనాలు, జరుపుకుంటున్నాడు. 

ఒకరకంగా చెప్పాలంటే ,  "టెన్షన్ "లేని , మా మానసిక వ్యభిచారిగా  మారి ,హాయిగా జీవితం గడుపుతున్నాడు ,  మంచివాడుగా "మాస్క్" వేసుకున్న మనోహర్.

---------------------------------
ఏడవ నెలలో " గాజులు పెట్టిన ఫంక్షన్ కి "వెళ్లి ,
ఫంక్షన్ కి వచ్చిన లేడీస్ ని, చూసి చూడనట్టు చూస్తూ,
తృప్తిగా తిరిగి వచ్చాడు మనోహర్.
"డెలివరీ టైం ", దగ్గర పడగానే, భార్యని ఆస్పత్రిలో జాయిన్ చేసిన చోటికి బాధ్యతగా వెళ్ళాడు మనోహర్.
అక్కడ నర్సులతో మర్యాదగానే ఉంటూ ,మానసికంగా దగ్గరైన ఫీలింగ్స్ తో, మనో యాత్రలో  మలినం పూసుకున్నాడు.
-------------------
టెన్షన్ గా ఉంది . మనోహర్ కి.
భార్యను "డెలివరీ రూమ్" లోకి పట్టుకెళ్ళారు 
కొన్ని క్షణాల్లో తనకి "వారసుడు" పుట్టబోతున్నాడు.
తండ్రిగా చాలా ఆత్రుత పడుతున్నాడు మనోహర్.
పుట్టబోయిన పసికందు,  "మీనాక్షి లా ఉంటుందా..?
 రాగిణిలా ఉంటుందా..? షీలాలా ఉంటుందా..?
 మీనాలా ఉంటుందా.".?  అనుకుంటూ ,ఊహల్లో తేలిపోతున్నాడు. మనోహర్.
------------------
నర్స్  వచ్చి ,పిలిచే అంతవరకు ఈ లోకంలో లేడు మనోహర్. "చూడండి మీకు మగపిల్లాడు పుట్టాడు"  అంటున్న నర్స్ మాటలకు తుళ్లిపడి , ఆ వైపుకు చూశాడు.
"నర్స్" తన చేతిలో ఉన్న బాబును" మనోహర్ కు" అందించింది.
మనోహర్ ఆనందంగా బాబుని, చేతులతో పట్టుకున్నాడు. చూశాడు, మళ్లీ చూశాడు మళ్ళీ మళ్ళీ చూసాడు .ఆశ్చర్యంగా చూశాడు.  అదోలా చూసాడు.. మనసులో అలజడి మొదలైంది ఏంటి బాబు ఇలా ఉన్నాడు..? చిన్న పిల్లలు ఇలాగే ఉంటారా? ఏమో? మనోహర్ లో తండ్రి ప్రేమ తన్నుకొచ్చింది .
నెమ్మదిగా బాబును ముద్దు పెట్టుకున్నాడు .
లేదు ..లేదు.. " తను బాగుంటాడు .తన భార్య బాగుంటుంది.  తల్లిదండ్రులూ అందంగానే ఉంటారు . భార్య వేపు వాళ్లు కూడా చాలా బాగుంటారు.
"బాబు , ఎలాగ, ఇలా పుడతాడు"
" అందంగానే ఉంటాడు " 
మనోహర్ తన మనసుకు తనే, సర్ది చెప్పుకుంటూ పిల్లాడిని
" నర్స్ " కు  అందించాడు..
మనోహర్ "లో" మనసు పెద్దగా నవ్వింది .
ఒరేయ్ బాగోదు నీ రక్తమేరా..? 
ఒరేయ్ నీ వికృత ఆలోచనల భావమే నా కొడుకుగా నీ ముందు కొచ్చింది రా.....
 " అది నిన్ను  జీవితాంతం తరుముతూ, నీతోనే ఉంటుందిరా.... వాడు వచ్చేసాడు గా.‌.ఇక నేను నీతో ఉండను . హహహహహ"అంటూ..
వెళ్ళిపోతున్న మనసును గట్టిగా పట్టుకు లాగాలనుకున్నాడు కానీ మనసు మనోహర్ "వశం" కాలేదు.

----------------------
ఏళ్లు గడుస్తున్నాయి . బాబు పెద్ద అవుతున్నాడు.
 కానీ వికృతంగా....
పక్క నుంచి ఎవరో ,
ఆలోచనలు మంచివి అయితే ,ఆచరణలు మంచివౌతాయి.
ప్రస్తుతం మనుషుల్లో "రాక్షసుడు "ప్రవేశించినట్టు,
మానవత్వం లేకుండా పోయింది .వావి ,వరుసలు, మరిచిపోయాడు.
 ఎక్కడపడితే అక్కడే దొంగలు ,దురాగతాలులూను .
అంటున్నాడు . పక్కనే ఉన్న అతను
అయినా "చెట్టు చెడే కాలానికి కుక్క మూతి పిందెలు పుడతాయట ". 
"ఈ తరం మనుషులు చేసే పనులకి ,వాళ్ళ ఆలోచనలకి,
తగ్గట్టుగానే వాళ్ళ పిల్లలు కూడా, వికృతంగా పుట్టి, వెధవల్లా ప్రవర్తిస్తున్నారు.
 " యద్భావం తద్భవతి" అన్నట్టు,
"మనసులో మంచి భావాల్ని పక్కకు నెట్టి,
 చెడ్డ భావాల్ని ప్రేరేపిస్తూ ఉంటే ,ఈ ప్రపంచం ఇలాగే తయారవుతుంది, ఏం చేస్తాం ఎవరి ఖర్మ వాళ్లది"
 అనుకుంటూ వెళ్లిపోతున్నారు.
మనోహర్ గతుక్కుమన్నాడు అంటే ....
"తన  వికృతమైన ఆలోచనల వల్లే, తనకు ఇలాంటి బాబు పుట్టాడా ? ...
"మనసు "అద్దం" లాంటిదంటారు.
"అది తనని తనకు చూపిస్తూనే ఉంది.
"తనే నిర్లక్ష్యంగా ,ఆ అద్దాన్ని ,ముక్క ముక్కలు చేశాడు కదూ.!

"అంటే తన ప్రవర్తన అంత  బాగోలేదా ? తన ఆలోచనలు తప్పా?"
 "అవును . తను కూడా, మంచి మనసు మాటలను వినకుండా , ఎన్నోసార్లు నెట్టేసాడుగా ! తన వికృత ఆలోచనల వల్లే బాబు ఇలా పుట్టాడా!  "
"నేను ఒక్కడినే నా ఇలా,"
 అనుకుంటూ, మనోహర్ కంగారుగా బయటకు వెళ్లాడు తిరిగినచోట తిరగకుండా తిరిగాడు .తనతో ఉన్న స్నేహితుల్లో చాలామందికి ఇలాంటి పిల్లలే పుట్టారు .
కొంతమంది పిల్లలు చాలా అందంగా ఉన్నారు 
అవును వాళ్ళ బుద్ధి,మనసు  చాలా మంచివి .
తనలా లోపలొక లాగా, పైకొక లాగా,  ఎప్పుడూ
 ప్రవర్తించలేదు."
పక్క మైదానంలో తన కొడుకు" స్కూల్ ఎగ్గొట్టి "పిచ్చిపిచ్చిగా అరుస్తున్నాడు . అవతలి వాళ్ళతో దెబ్బలు తింటూ...
ఇదివరకు తన లోపల బుద్ధి ఎలా ఉండేదో ,
పుట్టిన బాబు బుద్ధి బయటకు అలా ఉంటోంది .
మరి  అందుకే, అందరి చేత తన్నులు  తింటున్నాడు.
మనోహర్ , బాధతో ఆలోచిస్తున్నాడు. బాబుని  ఉంచుకోవాలా? వద్దా? ఏ అనాధాశ్రమంలోనో వదిలేస్తేనో....
అమ్మో తన" రక్తం పంచుకు పుట్టిన బిడ్డని" తను వదిలేయగలడా?
క్షణంలో అతని మనోగతంలో తల్లితండ్రులు మెదిలారు. 
ఉడిగి పోయిన బడుగు శరీరాలతో, వణుకుతున్న చేతులతో కన్నీళ్లు తుడుచుకుంటూ.
 తనలాంటి వాడికి మంచి సాస్తే అయ్యింది.
. తనకిప్పుడు" మంచి- చెడులు",  చెప్పడానికి
, తన మనసు కూడా తనని వదిలిపెట్టి వెళ్ళిపోయిందే.,. ఎలా... ఇప్పుడు నేనేం చేయను ? అనుకుంటూ..
ఎటు తేల్చుకోలేని మనోహర్,  పిచ్చివాడిలా "బుర్ర "పట్టుకుని కూర్చున్నాడు కొడుకు తీరును చూడలేక ,చూడలేక, చూస్తూ..
----------------------------
మనసు లోతుల్లో ఎక్కడి నుంచో  లీలగా వినిపిస్తోంది .
"ఇప్పటికైనా మారు".
"మంచిని చూడు"
"మంచి మాట్లాడు"
 "మంచి చేయి"
" మంచి ఆలోచనల బాటలో నడువు"
ఎటు తేల్చుకోలేనప్పుడు "మనసు మాట విను".
మనసు "అద్దం లాంటిది"
" నిన్ను నీకు "చూపిస్తుంది.
 

----------------------------------.

No comments:

Post a Comment