Monday, November 6, 2023

శీర్షిక : సంక్షిప్త తిరుమల చరిత్ర .(వ్యాసం).


శీర్షిక  : సంక్షిప్త తిరుమల చరిత్ర .(వ్యాసం).
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .



భక్తులను తరింపజేయడానికి 
సాక్షాత్తుా వైకుంఠవాసుడైన" శ్రీ మహా విష్ణువు"
కలియుగ దైవంగా "శ్రీ వేంకటేశుడనే "నామంతో 
తిరుమల కొండలపై నున్న "ఆనంద నిలయంలో 
అవతరించేడు."
తిరుమల కొండలు శేషాచలం కొండల పరిధిలో భాగం.
కొండల శ్రేణిలో గల ఏడు శిఖరాలు తిరుమలగా వెలసినవి. ఈ ఏడు శిఖరాలు, ఆదిశేషుని ఎడు తల లుగా సుాచింపబడతాయి.

ఈ ఆలయ గాలిగోపురం , ప్రాకారాలను  పుార్వ తమిళ 
పాలకుడైన తొండమాన్ చక్రవర్తి నిర్మించేడని ప్రతీతి.
ఆకాశ రాజు సోదరుడైన "శ్రీ తొండమాన్ చక్రవర్తే "
స్వామి వారి  గర్భగుడైన ఆనందనిలయాన్ని కుాడా  నిర్మించేడని ప్రతీతి.
ఆలయ పవిత్ర జలాశయమైన "శ్రీ స్వామి పుష్కరిణి "
ఏడవ శిఖరమైన వేంకటాద్రిపై యున్నది.
దక్షిణ భారతదేశ రాజులే కాక  , 
పల్లవ రాజుల కాలంనుండీ  అప్పటి రాజులు, ప్రజలు  కుాడా స్వామివారి సేవలోనే తరించినవారై ధన్యతనొందేవారు. ,.
పల్లవ రాణియైన" శ్రీ పెరుందేవి"గా ప్రసిద్ధి కెక్కిన "సామవై" మహారాణి , స్వామి వారిని ఆరాధిస్తుా ఆభరణాలు సమర్పిస్తుా..పరమ భక్త శిరోమణిగా తిరుమలచరిత్రలో నిలచిపోయేరు.
తరువాత పల్లవ రాజులులైన" విజయగండ గోపాలదేవుడు ," చక్రవరతి తిరువేంకటనాధ 
యాదవరాయలు , "హరిహర రాయలు" మొదలైన రాజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించి స్వామివారి
వైభవానికి మరింత వన్నె తెచ్చారు.
అటుపై "సాళువ నరసింహరాయలు" నాలుగు స్థంభాల మండపాలను నిర్మించి ఉత్సవ వేడుకలను జరిపించారు.
విజయనగర రాజైన" శ్రీ కృష్ణ దేవరాయల "కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ జరిగిందంటారు..
స్వామివారికి కనకాభిషేకాలు భరణాలు సమర్పించడమేగాక , నిత్య నైవేద్యాలకు ఐదు గ్రామాలను కానుకగా ఇచ్చి , నిత్యారాధనోత్సవాలకై  తాళ్ళపాక గ్రామాన్ని దానంగా సమర్పించుకున్న
ఘనత శ్రీకృష్ణ దేవరాయలదే.
పల్లవ రాజుల కాలంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాలు 
నేటికీ తిరుమలలో వైభవోపేతంగా జరుగుతుా 
ఉండడం గమనార్హం .
విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఈ 
ఆలయం మొదట మహమ్మదీయులపరమై , పిదప 
మరాఠాల పరమై తదుపరి ఈష్టిండియావారి పరమైంది ఈష్టిండియా వారు హిందుా ముస్లిమ్ ల ధర్మాలను కాపాడుతుా వచ్చారు.
ధర్మాదాయాల సొమ్మును రెవెన్యుాతో పాటు జిల్లా కలెక్టర్ గారు వసుాలు చేసి  దైవ సంబంధిత కార్యక్రమాలను వైభవోపేతంగా జరిపించేవారు.
అటుపై ఇంగ్లాండ్ లో మత పరమైన ఆందోళనలు చెలరేగాయి. ఆంగ్ల ప్రభుత్వం హిందుా మత సంస్థలలో 
జోక్యం చేసుకోవలదన్న చట్టాన్ని తేవడంతో 
ఆలయ నిర్వాహణ "మహంతులకు" అప్పచెప్పబడింది.
అప్పటినుంచీ దేవాలయ బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన వారు లేక , ధర్మకర్తలు అక్రమాలకు పాల్పడుతుా ఉండడంతో బ్రిటిష్ ఇండియాలో దేవాలయాలన్నీ దెబ్బతిన్నాయి. 
వీరి తరువాత అప్పటి గవర్నర్ కొత్త ధర్మ కర్త మండలిని 
ఏర్పాటు చేయడంతో కొండపైగల  స్వామివారి ఆలయంలో అర్చకులచే స్వామివారికి పుాజలు నిర్వర్తించబడి అలయంతో పాటు ,"హథీ రాంజీ మఠం " కుాడా కొత్తకళ లు సంతరించుకున్నది.

అప్పటిలో భక్తులు గోవింద నామ స్మరణతో గుంపులు గుంపులుగా చేరి నడక దారిన పోతుా  ఏడుకొండలనెక్కి దాదాపు రెండు రోజుల పాటు రాళ్ళు -రప్పలపై ప్రయాణం చేసి స్వామివారిని దర్శించుకొనేవారట. 
రాను, రాను , భక్తుల  సౌకర్యార్ధం దారిలోవారు విశ్రాంతి తీసుకునేందుకు  విశ్రాంతి మంటపాలు .వంటా వార్పులకు దిగుడు బావులు ఏర్పరచబడ్డాయి.
అటుపై డోలీలతో పాటు ,కావడి కుాలీలు  చేరి , నడవలేనివారిని వాటిలో కుార్చో బెట్టి కొండపైకి చేర్చేవారట.
యాత్రికుల సంఖ్య పెరగడంతో 
యాత్రికుల సౌకర్యార్ధం అప్పటి ప్రభుత్వం  కొండపైకి మెట్ల మార్గాన్ని నిర్మించగా,  టి టి డి బోర్డ్ వారు
ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధిపరచి యాత్రికులకు  మరిన్ని సదుపాయాలు సమకుార్చేరు.
నానాటికీ భక్తుల సంఖ్య పెరుగుతుాండడంతో 
అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం రోడ్డు మార్గాన్ని గురించిన ఆలోచన చేసి అమలుపరచడం  వల్ల,...
భక్తుల రాకపోకల సౌకర్యార్ధం ఎన్నో  సదుపాయాలతో పాటు  పల్లకీలు గుర్రపు బళ్ళతో పాటు బస్సుల సదుపాయాలు ఏర్పరచబడి భక్తులను సేదతీర్చేయి..  ఉచిత బస,  భోజన సదుపాయాలు అన్నదాన పథకాలు  అమలుపరచబడ్డాయి.. .
ఘాట్ రోడ్లు నిర్మించ బడ్డాయి. రాను రాను తిరుమలపై 
జనావాసాలతో పాటు,  హోటళ్ళు  , చౌల్ట్రీలు , ఉచిత రుాములు, లాకర్ల వంటి ఎన్నో సదుపాయాలను భక్తుల సౌకర్యార్ధం నెలకొల్పి , భక్తులను సంతృప్తి  పరచేరు.
నిత్య కల్యాణం పచ్చ తోరణంగా నిత్య మంగళ స్వరుాపుడైన శ్రీ వేంకటేశ్వ స్వామి  చిరునగవుతో
భక్తుల మొరలాలిస్తుా , భక్త వత్సలుడై ఏడు కొండలపై 
నిత్య పుాజలందుకుంటున్నాడు.
వేంకటేశ్వరుని దర్శనార్ధం వెళ్ళిన ప్రతీ భక్తుడుా స్వామికి కానుకగా తమ తలనీలాలను సమర్పించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావడం అచారంగా మారింది .
ఇక ప్రసాదాల విషయానికి వస్తే  తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డుా   చాలా ప్రసిద్ధి చెందినది . 
కమ్మని నేతితో జీడిపలుకులు, యాలకులు, కిస్మిస్ పండ్లతో చుట్టబడిన ఈ లడ్డుా ప్రసాదం భక్తులకు అందించబడడంతో భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందినంతగా ఆనంద పరవశులవడం గొప్ప విశేషం. 
దానితో పాటు పులిహోర అప్పం వంటి ప్రసాదాల వితరణతో , ఉచిత అన్నదాన కార్యక్రమాలతో నేటి "తిరుమల తిరుపతి" భక్త జన సందోహంతో కిట కిట లాడుతుా చుాపరులకు కన్నుల పండుగ చేస్తున్నది   
అత్యంత మహత్యం గల వానిగా ప్రాచుర్యం పొంది 
ఏడు కొండలపై వెలసిన "శ్రీ వేంకటేశుని" కృపా కటాక్షాలు మనందరిపై కుాడా ఉండాలని ప్రార్ధస్తుా..
స్వామివారికి భక్తిపుార్వక పాదాభివందనాలు 
సమర్పించుకుంటుా...... 
రచయిత్రి:
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి . 

No comments:

Post a Comment