03/08/2023.
తపస్వి మనోహరం పత్రిక కొరకు ఆగస్టు 15 ,
ప్రత్యేక e బుక్ కొరకు రచన ,
విభాగం : కథ/ వ్యాసం/ కవిత.
శీర్షిక : మరో ఉద్యమానికి శ్రీకారం చుడదాం.
(వచన కవిత).
రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కళ్యాణ్: మహరాష్ట్ర.
ఒకనాటి తన బానిసత్వపు శృంఖలాల వెనుక జరిగిన ,
హింసాత్మక అల్లర్లు, జాతి మత భేదాల పేరుతో జరిగే
మారణ హోమాలు, అతివలపై చేసే, అరాచక చర్యల
ఆత్మ ఘోషలు , అవమానాలకు , రాజుకున్న మంటలు
75 సంవత్సరాల స్వాతంత్ర్య జీవిత శాంతి బాటలో
తిరిగి రాజు కుంటూ, నిప్పులు కురిపిస్తున్నాయి.
దేశభక్తి గల వీర పుత్రుల ఉద్యమాలతో,
ఎందరో చేసిన, ఆతత్యాగాల రుధిర ధారలతో,
సాధించిన నా స్వాతంత్రపు , విజయ వీర రథముపై
వీర తిలకంతో ఎగురుతున్న మువ్వన్నెల
ముచ్చటైన నిండా ,వెలసిన రంగులతో వెలవెలబోతోంది.
నాలుగు జాతుల సమైక్యతతో నిలబడి ఉన్న
నాలుగు చక్రాల విజయ రథం ఇరుసు, నేడు
జాతి -మత జాడ్యాల కారణంగా బలహీన పడింది.
అహంకారపూరితమైన పురుషాహిక్యతల, పైసాచిక కృత్యాలకు, అబలల మానాలు అంగట్లో, నగ్నంగా ఊరేగుతున్నాయి.
స్వార్ధ రాజకీయాల ముసుగు చాటులో,
మూడు బొమ్మల మూర్తి తత్వం ,
కళ్ళు , చెవులు, నోరు, మూసుకుని ,
మంది బాధలకు, మౌనంగా కన్నీరు కారుస్తోంది.
న్యాయ, ధర్మాల సరి సమాన తూకంలో,
శాంతి సారాన్ని నింపడానికి వచ్చే సార యోధుల
కుత్తుకలకు, ఉరివేయబడుతోంది.
తిరిగి దేశ స్వాతంత్రానికి సంకెళ్లు పడక ముందే ,
తనను, తన మానాన్ని, రక్షించడానికి సిద్ధపడే,
బిడ్డలు,తప్పక వస్తారన్న ఆశతో నిరీక్షిస్తూ ,
భరతమాత తన కొన ఊపిరి ప్రాణాలను
నిత్య నమ్మకంతో ,నిలుపు కుంటున్నాది
" దేశం కోసం ,ప్రాణాలను సైతం ఫణంగా పెట్టే
వీర పుత్రుల్లారా రండి ! మన దేశ మాన,ధన,
సంపత్తిని, వరుస వేలం వేసి , విదేశాలలో
పూర్తి అమ్మకానికి పెట్టక ముందే ,
స్వార్థ రాజకీయాల చీడ పురుగుల నుండీ .
నన్ను, నా దేశాన్ని,, రక్షించండి." అంటూ
తల్లి భారతి ఆర్తిగా,వీర పుత్రులను పిలుస్తోంది.
దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసే
దేశభక్తి నిండిన భరతమాత బిడ్డల్లారా..!
రండి .చేయి- చేయి కలిపి ,భారత దేశపు
దివ్య చరితకు, నవ్య శ్రీకారం -చుడదాం.
తల్లి భారతి నమ్మకాన్ని, వమ్ము చేయమన్న
ఉజ్వల నినాదాలతో ఉత్తేజ పూరితంగా ఉద్యమిద్దాం.
మన దేశాన్ని మనం రక్షించుకుందాం.
-------------------------------------------
హామీ :
ఈ వచన కవిత ,నా స్వీయ రచన.
No comments:
Post a Comment