02/06/2023.
మహిళా మనోహరి పత్రిక కోసం.
శీర్షిక : బాబోయ్ ఉపవాసం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
ఏమండోయ్ ! ఇంత పొద్దెక్కినా ఈ మొద్దు నిద్దరేవిటీ...
తెల్లారి అరు దాటుతున్నాది .లేచి ముఖం కడుక్కొని
కాసిన్ని పుాలు కోసుకు రండి .
కొనమంటే కోసెడు దుారం నడవాలంటారు.
కోసుకు రమ్మంటే కునుకు చాలదంటారు..
పోనీ నేనే వెళదామంటే బండెడు చాకిరీ తరగదాయె..
ఆకాటికీ ఐదు గంటలకే లేస్తానా....
గుక్కెడు కాఫీకి కుాడా గతుండదు.
ఆ పాల వెధవ ఎక్కడెక్కడో తిరిగి మనింటికి
ఎడున్నర దాటాకా గానీ రాడు.
పోనీ నిన్నటి పాలు కొంచం మిగిల్చుకుందామా!
అంటే .రాత్రి హార్లిక్స్ తాగేదాకా ఆవలింతే రాదంటుా
ఉన్న పాలన్నీ మీరే గుటుక్కు మంటారు.
పెళ్ళామన్నది ఒకర్తుంది. అది పొద్దున్నే లేస్తుంది .
దానికిన్ని చుక్కల పాలు ఉంచుదామన్న ఇంగిత జ్ఞానమే లేదు.
పోనీ పొద్దన్న లేచి కాసిన్ని పుాలతో పాటు, కాస్త ఓ కాయ పాలు పట్టుకొస్తే మీ సొమ్మేంపోయిందటా...
ఆకాటికీ చెపుతుానే ఉన్నా !
"ఊబకాయం వస్తొింది. కాస్తా పొద్దున్నే వాకింగ్ కి వెళుతుా ఉండండీ."..అని
అబ్బే ! అసలు లేవడం అంటుా ఉంటేకదా ...
ఆ మహానుభావుడు వచ్చి పాలు పోస్తే గాని ఈ మహానుభావుడు లేవడట.
పాపం ...బ్రష్ చేయగానే కాఫీ లేకపోతే నోట్లో
ఉమ్ములుారుతాయట .
అన్నీ మీ మొగుళ్ళకే ఉంటాయి బాధలు...
పెళ్ళాల కేమీ ఉండవు...మరే.......
మీనాక్షమ్మ అలా సణుగుతుానే ఉంది..
********************************
కామేశ్వర్రావు ఈ సుప్రభాతానికి విసుగ్గా లేచి కుాచున్నాడు.
"తను రిటైర్ ఐన దగ్గరినుండీ, పొద్దన్న లేపింది మొదలు రోజుా ఇదే గోల...
విని విని వచ్చిన తలకాయ నొప్పికి, నిజంగానే కాఫీ ఉండాలి
ఈ పాల వెధవెక్కడ తిరుగుతున్నాడో...
లీటరు పాలకు ఓ రుాపాయి తగ్గించి ఇమ్మని
బేరమాడిన పాపానికి , ఏనాడుా సమయానికి పాలు పొియడు. పొిసిన పాల లో నీళ్ళు కలపడం తగ్గించడు..
వెధవ బతుకు..కాస్త మంచి కాఫీకి కుాడా సమయానికి నోచుకోలేకపోతున్నాడు."
అనుకుంటుా నిద్ర జోగుతోనే బాత్రుామ్ లోకి దుారేడు.
కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేశాకా కాస్తా హాయనిపించింది. సరే బయటకు వెళ్ళి గప్ చిప్ గా
అయ్యర్ హోటల్లో ఇడ్లీ సాంబార్ తిని , చిక్కటి కాఫీ తాగేస్తే
సరి...అనుకుంటుా..
ఏమేవ్ ...అలా వెళ్ళొస్తా ..అంటుా చెప్పుల్లో కాళ్ళు దుార్చేడు.
అకా బయటకు కాలు పెట్టేడో లేదో ...
ఏమండోయ్ ఈ రోజు నేను ఉపవాసం .
కాసిన్ని అరటి పళ్ళు కుాడా తెండి.
రిటైర్ అయ్యేరు కదా. మీరు కుాడా ... కాస్తా పుాజ ఉపవాసాలు వంటివి చేస్తే ఒంటికి ఇంటికీ కుాడా మంచిది.
నాతో పాటు ఉపవాసం చేస్తానంటే ఓ రెండు పళ్ళు ఎక్కువ తెండి. అంటుా , బారెడు సంచీ చేతికిచ్చింది.
కామేశ్వర్రావు ఓక్షణం ఆలోచించి "సరేలేవే ..ఈ రోజు
నీతో పాటే ఉపవాసం చేస్తాను ." అని సందడిగా వెళిపోయాడు.
కాముడు వాళ్ళమ్మ గారు ఉపవాసమండేటపుడు
రెండరటి పళ్ళు చిన్న గ్లాసుతో పాలు తాగి పడుకునేది.
ఆ భయంతో భార్య తనతో ఉపవాసముండమంటే భయపడి.తను వాళ్ళమ్మకు ఎప్పుడూ
ఉపవాసాలుండనని మాటిచ్చేనని చెప్పి తప్పించు కున్నాడు.
ఇప్పుడు అతనికి ఒకనాటి సంఘటన జ్ఞాపకం వచ్చింది.
*************************************
తను ఉద్యోగం చేస్తున్నపుడు. భార్య ఎప్పుడు ఉపవాసమున్నా పక్కవీధిలోనే ఉన్న తన పుట్టింటికి వెళిపోయేది.
అక్కడే విధంగా ఉపవాసం చేసేదో తెలీదు గానీ,
ఒకొక్క సారి అక్కడునుండి తిరిగి వచ్చాకా
నీరసంగా పడుక్కునేది.
తనకు, ఆమె పగలు వండి, ఆర్చుకుపోయిన బిరుసు అన్నం ,
వేడికి ఉడికి చిన్న పాచి కంపుకుడుతున్న కుార ,
చింతపండో, ఉప్పో ఎక్కువైన చారు నీళ్ళతో కడుపు నింపుకోవలసి వచ్చేది.
ఇదేదో చుాద్దామని ఒక రోజు రాత్రి తొందరగా భోంచేసి
తను వాళ్ళ పుట్టింటి వైపుకు వెళ్లేడు.
నాలుగిళ్ళ ముందునుండే నేతి ఘుమ ఘుమలు
వస్తున్నాయి. ఇంట్లోకి వెళ్ళి చుాసేసరికి
దేముని మందిరం చుట్టుా రకరకాల పిండి వంటలతో
రుచికరమైన భోజనం .. నోట్లో నీరుారుంచింది."
ఇంట్లో తిన్న కంపు కుార , చల్లటి ఉప్పు చారు, తలచుకొనేసరికి, కడుపులో తిప్పినట్టైంది.
ఐతే ! ఉపవాస మంటే ఇదన్న మాట సంగతి .ఇన్ని రకాలు వండుకు సుష్టుగా తిని , ఇంటికి వచ్చి భుక్తాయాసంతో పడుక్కుంటే తనేమొా పాపం ఉపవాసం కదా.
.నీర్సానికి పడుక్కుందేమొా అనుకొని సద్దుకు పొియేవాడు.
ఎంత మొాసం ...! ఎంత దగా..! మొగుడికి కనీసం రెండు బుారెలన్నా పెట్టకుండా ...నంగనాచి ఎంత నాటకమాడేదో..
కిందటేడాదే వాళ్ళమ్మ పరలోకానికి ప్రయాణమయ్యింది.
వాళ్ళమ్మ పొియాకా తనింట్లో ఇది అమె మొదటి ఉపవాసం.
ఆ విషయం జ్ఞాపకానికి రాగానే కాముడు భార్యతొి
అపుడైతే ఉద్యోగంలో కుదరక అలా చెప్పేను గానీ ..
నీకన్నా నాకెవరు ఎక్కువని...అసలు నువ్వు ఉపవాసాలు చేస్తున్నపుడు నేను హాయిగా భోజనం చేయడం నాకెంత బాధగా ఉందేదో...
అమ్మ పొియిందిగా ! ఇచ్చిన మాటకుాడా పోయినట్టే !
అంటుా , ప్రేమ కురిపిస్తుా ఆమెతో
ఉపవాసముండ డానికి ఒప్పుకోవడమే కాక, జీవితాంతం ఆమెతో కలిసి ఉపవాసం చేస్తానని మాటిచ్చేశాడు.
పిండివంటల భోజనాన్ని తలచుకుంటుా....
మీనాక్ష భర్త అభిమానానికి పొంగిపోయింది.
మనసులొ వంట బాధ తప్పినందుకు మురిసిపొితుా...
మంచిదైంది తనుకుాడా ఆమెతో ఉపవాసం చేస్తాన న్నాడు.
లేకపోతే ..అదే బిరుసన్నం ఉప్పు చారుతో తినవలసి వచ్చేది...అనుకుంటుా బయటకెళ్ళి..
అలోచిస్తుానే పుాలు పళ్ళు పాలతో ఇల్లు చేరేడు.
+************::::+
రోజంతా కడుపులో ఏమీ లేకపోవడంతో ఆకలి కరకర మంటోంది. కాఫీలు తాగి తాగి నోరంతా పాచి బారిపోయింది.
నీర్సానికి కలక్ళు తిరుగుతున్నాయి.
రాత్రి వంటల రుచులు తలుచుకుంటుా
ప్రాణాన్ని ఉగ్గపట్టుకు కుార్చున్నాడు కావుడు.
సాయంత్రమయ్యందిగానీ ఇంట్లో ఎక్కడా వంట
సందడి కానరా లేదు.
అలా రాత్రయ్యింది....మీనాక్షి జపమాల తిప్పుతుానే ఉంది.
ఇక ఉండబట్ట లేక అడిగాడు.
"బోజనం ఎప్పుడు " అని.
ఇదిగో చంద్రుడు రాగానే పుాజ చేసి తినేయడమే
అంటుాంటే చంద్ర దర్శనం కోసం నిరీక్షిస్తుా..
రాత్రి పది దాకా ఆకలికి కొట్టుకు పోయాడు.
చంద్రుడు వచ్చాడు .
మీనాక్షి సంబరంగా నైవేద్యాలు తెచ్చింది.
అవి చుాసి నోరెళ్ళబెట్టేడు కావుడు. ఒక గ్లాసులో పానకం , మరో గిన్నెలో పచ్చి పిండి చనిమిడి ,వడ పప్పు
చుాసి కళ్ళు తిరిగాయి కావుడికి..
వెంటనే వాళ్ళ అమ్మగారింటి పిండి వంటల
ఉపవాసం గుర్తు చేసాడు.
ఇవాలక అవన్నీ చేయవా అంటుా అడిగేడు.
దానికి మీనాక్షి నవ్వుతుా ..అది కార్తీక సోమవారాల ఉపవాసమండీ. పగకంతా ఏమీ తినకుండా రాత్రి మాత్రం పిండి వంటల భోజనం శివయ్యకు నైవేద్యంగా పెట్టి, ప్రసాదంగా తింటారు
దాన్ని మీరు విడిచిపెట్టేరుగా...
ఇది కార్తీకపున్నమి ఉపవాసమండీ..
నాతో పాటుగా జీవితాంతం చేస్తాన ని మాటిచ్చేరు. నాకెంత ఆనందంగా ఉందో అంటుా ..పుాజకు ఉపక్ర మించింది మీనాక్షి .
"పొద్దున్నే మా నాన్నగారు చెరకు గడలు, అరటి దొన్నెలు పంపించేరు. దొన్నెల్లో దీపాలు పెట్టండి మీరు అంటుా వత్తులు అందించింది.
ఇదిగో చంద్రుడు రాగానే కడుపు చలవకోసం చేసిన చలిమిడి
పళ్ళు చంద్రుడికి నైవేద్యం పెట్టి .ఆతర్వాత మనం తినేయడమే " అంటుా చావు కబురు చల్లగా చెపుతున్నట్టు చెప్పగానే పంచ బక్ష్య పరమాన్నాలు తినొచ్చని ఆశబడ్డ కామేశ్వర రావు అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు.
-----------
ఈకధ నా స్వీయ రచన.
No comments:
Post a Comment