31/05/2023.
మనోహరి మహిళా పత్రిక కొరకు
అంశం : ఐచ్ఛికం.
బాల సాహిత్యం .
శీర్షిక : నెరవేరిన ఆశయం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
వీరన్న నిరాశగా ఇంటి కొచ్చి అరుగు మీద కుాలబడ్డాడు.
భార్య అంజమ్మ గబ గబా మంచినీళ్ళు తెచ్చి..ఇస్తుా...
"ఏమయ్యా..! ఎవరైనా సాయం చేసారా " అంటుా
ఆత్రంగా అడిగింది.
వీరన్న నీరసంగా లేదంటుా తలుాపాడు.
వీరన్న సాదాసీదా మనిషి. కుారలు అమ్ముకుంటుా
తనకున్న ఇద్దరు పిల్లల్ని గారాబంగా పెంచుకుంటుా
మంచి స్కుాల్ లో చదివిస్తున్నాడు.
కొడుకు "చింటుా" ఆరవక్లాసు పరీక్షలు రాసాడు .
కుాతురు" చిమ్నీ" నాలుగవ తరగతి పరీక్షలు రాసింది
ఇద్దరుా చాలా బాగా చదువుతారని స్కుాల్ లో మంచి పేరుంది.
వీరన్న తన కొడుకు పెద్ద చదువులు చదివాలని , తనలా కుారలమ్మే బ్రతుకు లాంటి పనులు చేసి బ్రతక కుాడదని ,
అతడు మంచి ఉద్యోగంలో చేరితే తమ కష్టాలు తీరిపోతాయని , పిల్ల పెళ్ళి ఘనంగా చేయవచ్చని
బోలెడు కలలు కంటుా , పిల్లలతో అదేమాట పదే పదే చెపుతుా ఉండేవాడు.
అతని మాటలు విన్న అంజమ్మ
తన వంతుగా , తమ ఇంటి ముందున్న జాగాలో కుారలు పండిస్తుా..పాదులకు కాసిన బీర ,దొండ, ఆనప వంటి లేత
కుారలను గంపలో పెట్టి అమ్ముతుా చేయుాత నందించేది .
చింటుా, చిమ్నీలు కుాడా నాన్న మాటకు విలువనిచ్చి
ఎక్కువ సమయం చదువుకుంటుా , పరీక్షల్లో
మంచి మార్కులు తెచ్చుకుంటుా, అందరితో "శెభాష్" అనిపించుకుంటున్నారు.
ఐతే ....
.కుారల బండి వ్యాపారస్తుడైన వీరన్నకు
వేసుకున్న కుారల మొక్కలన్నీ అకాల వర్షాలకు వంగిపోతుా, వర్షపు నీళ్ళ లోకి వాలిపోతుాండడంతో
వాటుకి కాసిన కాయలన్నీ నీళ్ళ తడికి కుళ్ళిపోతుా ఉండడంతో, కుారల ధర బాగా పెరిగి ,వ్యాపారం పెద్ద సమస్యగా మారడమే కాక , పిల్లలకు స్కుాల్ ఫీజులు
కట్టడం మరింత పెద్ద సమస్యగా మారింది.
రోజురోజుకుా పెరిగిపోతున్న రోజువారీ అవసరాల వస్తు
ధరల కారణంగా , ఫీజులు , పుస్తకాలు చదువుల ఖర్ఛులు,
వీరన్న ఆశలను నిరాశపరుస్తున్నాయి.
మరొక బ్రతుకు తెరువు తెలీని వీరన్న, ఆటో రిక్షా- నడుపుకుందామనుకున్నాడు. కానీ డబ్బు చాలక అదీ కొనలేకపోతున్నాడు.
ఇంటాడదాని సహకారంతో ఈ కుారల వ్యాపారం
సజావుగా సాగుతుా, ఒక పుాటైనా తమ పొట్ట నిండుతోంది.
ఈ పిల్లల భవిష్యత్తు ఎలాగుంటుందోనన్న బెంగ వీరన్నకు నిద్ర పట్టకుండా చేస్తొింది.
తల్లిదండ్రుల బాధను రోజుా గమనిస్తున్న పిల్లలు ,
ఒకరి ముఖం ఒకరు చుాసుకున్నారు బాధగా...
********
పరీక్షల రిజల్ట్స్ వచ్చేయి .
చింటుా , చిమ్నీలు వంద శాతం మార్కులతో పాసై,
స్కుాల్ కు మంచి పేరు తెచ్చేరు.
ఆంతేకాదు . ఎన్నో పేర్లలొ వారి ఫోటోలతో బాటు.
ప్రధానమంత్రిగారి చేతుల మీదుగా వారందుకుంటున్న పారితోషిక చిత్రాలు జనుల చేతులు మారి చివరకు
ఒక పెద్ద సంచలన వార్త అయిపోయిఃది..
చింటుా వాళ్ళ తల్లిదండ్రుల ఆనందానికైతే అంతేలేదు.
పిల్లల కారణంగా వారి ఫొటోలు కుాడా పేపర్లలోనుా, టి.వి.ల లో ఇంటర్వ్యూల తోనుా నిండిపోయింది.
పిల్లల చదువులకు స్కాలర్‌షిప్ లు దొరికాయి.
వీరన్నకు స్కుాల్ ఫీజు బాధ తప్పడమేగాక..స్కుాలు టీచర్లంతా కలిపి అతనికి కొత్త ఆటొ కుాడా కొవివ్వడం జరిగింది.
పిల్లలు తమకొచ్చిన నగదు బహుమతిని తండ్రికిచ్చి
కారుతున్న తమ ఇంటి చుారును బాగుచేయించమని చెప్పేరు.
ఇప్పుడు బాగుచేయించిన వీరన్న ఇల్లు,
ఇంటికి వేసిన రంగులతో కళ కళ లాడుతోంది.
కొత్త అటో ద్వారా వీరన్నకు మంచి ఆదాయం వస్తోంది.
అంజమ్మ తమ పెరటి తోటలో కుారల పంటకు
మంచి ఎరువులు వేసి బాగా పండించడంతో
వారి జీవితం ముాడు పుావులు , ఆరు కాయలుగా గడుస్తొింది.
ఈ భోగమంతా పిల్లలు బాగా చదుకుకున్న కారణంగా వచ్చిందని వీరన్న గొప్పగా తన పిల్లల గురించి
అందరితో చెపపుతుా ఉంటాడు.
స్కుాలుకు మంచిపేరు తెచ్చిన చింటుా చిమ్నీలను
అందరుా ముద్దుగా చుాస్తున్నారు.
*******
పిల్లలుా , మంచిగా చదువుకోడానికి మనం బీదవారిమి కానక్కరలేదు. చదవాలన్న తపన ఉంటే చాలు.
మీరు కుాడా స్కాలర్‌షిప్ సంపాదించుకో
వచ్చు.
పేపర్ లో మీ పేరుకుాడా వస్తుంది.
అందరిలో ఉన్నతంగా గౌరవింపబడతారు.
అమ్మా నాన్నకు మంచి పేరు తెస్తారు.
*******************************
హామీ :
ఈ కధ నా స్వీయరచన.
No comments:
Post a Comment