09/05/2023.
తపస్వీ మనోహరం , మనోహరి మహిళా పత్రక కోసం
అంశం : వేసవిలో అమమ్మగారింటి జ్ఞాపకాలు .
శీర్షిక : మరపురాని మమతలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
ట్రైన్ లో కుార్చొని కిటికీ లోంచి బయటకు చుాస్తున్న నాకు ,
నా కళ్ళముందు, వెనుకకు వెళిపోతున్న ప్రకృతి నిండిన ప్రపంచం , ఆకాశంలో నాతో పాటుగా నడుస్తుాన్న చందమామ కురిపిస్తున్న చల్లని వెన్నెల గిలి పెడుతుా
ఉంటే , మిణుకు మిణుకు మంటున్న తారల మధ్య బోసి నవ్వులతో నా కోసం నిరీక్షిస్తున్న మా అమమ్మ ముఖం
నా కన్నీటి పొరల మధ్య అస్పష్టంగా కనిపిస్తుా ఉంటే
అసహనంగా కదులుతుా కళ్ళు ముాసుకున్నాను .
అమమ్మ .....
ఎప్పటికీ మరువలేని హాయి ఆమె ఒడిలో
ఎన్ని రకాలు వండినా తరగని ఋచి ఆమె వంటల్లో..
ఇప్పటికీ చెప్పలేని అనురాగానుభవం , ఆమె తరగని అప్యాయతలో ..మ
ఇప్పటికీ మరువ లేని జ్ఞాపకాలు ఆమె సన్నిధిలో గడపిన క్షణాలు ,ఆ రోజుల్లో.
ఆలోచిస్తున్న నాకనులముందు నా చిన్నప్పటి సంఘటనలు.
ఒక మరపురాని చిత్రంలా...ఒక అలుపులేని ప్రయాణంలా.....
----------------
అమ్మా ! రిక్షా వచ్చేసింది తొందరగా రా అమ్మా .
లేటుగా వెళ్తే రైలు తప్ఫిపోతుంది పదమ్మా..
అమమ్మ మన కోసం ఎదురు చుాస్తుా ఉంటుంది..
అంటుా హడావిడి పెట్తేస్తున్నాది తను .
"అబ్బబ్బ వస్తున్నానుండమ్మా...తాళాలన్నీ సమంగా వేసేనో లేదో ,చుాసుకోవాలికదా ..నువ్వు తమ్ముడిని తిుసుకొని ముందు రిక్షా ఎక్కు .." అంటుా విసుక్కుంది అమ్మ .
తనైతే తమ్ముడితో పాటు ఎప్పుడో రిక్షా ఎక్కేసింది.
ప్రతీ వేసంగి సెలవులకీ అమమ్మ దగ్గరకు వెళ్ళడమంటే
చాలా ఇష్టం తనకు.
ఆ వుారికి ,తమ ఊరికి ముాడు గంటల ప్రయాణం మాత్రమే.
తాము ఒరిస్సా "కుర్దా రోడ్డు" లో ఉండేవారు.
అమమ్మ ఆంధ్రా "సోంపేట"లో ఉండేది .
ఆవుారుకి వెళ్ళడమంటే తనకు చాలా ఇష్టం .
బండి "కంచిలి" స్టేషన్లో అగేది. దిగిన తర్వాత బయటకు
రాగానే "సోంపేట "ఊరికి బస్సులు ,గుర్రపు బగ్గీలుండేవి.
తను గుర్రపు బండిలోనే ఎక్కుదామని పట్టు పట్టేది.
ఆ గుర్రాల బండీలో కుార్చొని మట్టి రోడ్డుకి
రెండు వైపులా ఉన్న పెద్ద-పెద్ద చెట్ల మధ్య నుండి ఊళ్ళోకి వెళుతుా ఉంటే అదొక అద్భుతమైన ప్రయాణంలా అనిపించేది.
అక్కడ తమ దొడ్డమ్మ స్కుాల్ లో సంగీతం టీచర్ గా పనిచేస్తుా ,పిల్లలకు సాయంత్రం పుాట వీణ నేర్పిస్తుా ఉండేది .
మా అమ్మ , పెద్దమ్మ ,పిన్నమ్మలు ముగ్గురుా సంగీతంలో డిప్లమొా చేసిన వారే కావడం తో మా పెద్దమ్మ ఇల్లు నిత్యం సంగీత కీర్తనలతో ,పిల్లలతో నిండి ఉండేది. అక్కడే అమమ్మ కుాడా ఉండేది. మా దొడ్డమ్మంటే నాకు, అమ్మ కన్నా ఎక్కువ ఇష్టంగా ఉండేది. మా దొడ్డమ్మకి కుాడా
నేనంటే చాలా ఇష్టం . కారణం, నా గాత్రం చాలా బాగుంటుంది .నేను వెళ్ళినపుడల్లా మా దొడ్డమ్మ కొన్ని కీర్తనలు నేర్పి, నాచే అక్కడి కోవెలలో కచేరీ చేయించేది.
ఆ కాలంలో సంగీత -సాహిత్యాలకి చాలా విలువ ఉండేది .
అందికే చిన్న కార్యక్రమమైనా చాలా మంది వినడానికి వచ్చేవారు.ప్రోగ్రామ్ పుార్తయ్యాకా నన్నందరుా మెచ్చుకుంటుా ఉంటే నాకు చాలా గర్వంగా ఉండేది.
మా దొడ్డ కుాడా " మా చెల్లి కుాతురండీ" ,అని చెపుతుా చాలా మురిసిపోయేది.
దొడ్డమ్మకి నలుగురు పిల్లలు. ఇద్దరు కొడుకులు .ఇద్దరు కుాతుర్లు.
వాళ్ళకి గాత్రం రాలేదు గానీ అందరుా "వీణ "చాలా బాగా వాయిస్తారు.వాళ్ళుా ,తాముా కలుస్తే చాలు హడావిడి
ఇంతా అంతా కాదు .
అమమ్మైతే మమ్మల్ని చుాడగానే సంతోషంగా నవ్వుతుా ఎదురొచ్చి హత్తుకునేది.
ఆ పరిష్వంగంలో ఎంత ప్రేమొా...
ఇంటి లోపలికి వెళ్ళగానే అమమ్మ తమ కోసం అల్లిన
అందమైన ఊలు బొమ్మలను చుాపించేది.
అందమైన గుడ్డ బొమ్మలను కుట్టి చిన్న చిన్న కధలతో
తోలుబొమ్మలాటలాడించేది.
బొమ్మల పెళ్ళిళ్ళు చేయించేది.
ఇంటి పెరటి తోటలోనే వనభోజనాలంటుా అందర్నీ పిలిచి
బోలెడు వంటలు చేసి వడ్డించేది.
రోజుా మంచి మీగడ పెరుగుతో అన్నం తినిపించేది.
"అడ్డగాడిదల్లా పెరిగేరు. వాళ్ళ చేతులతో వాళ్ళు తింటారులే అమ్మా "అంటుా అమ్మ ఎంత మొత్తుకున్నా వినేదికాదు.
అప్యాయంగా తినిపిస్తున్న ఆచేతుల్లో ఏమి మహిమ ఉండేదో గానీ , ఈ కుారొద్దు , ఆ పప్పొద్దు , అని అనకుండా హాయిగా పెట్టిన అంతన్నమంతా తినేసే వాళ్ళం.
రాత్రైతే చాలు , అరుబయటే పక్కలు.
పెద్ద నడిమింటి వాకలిలో అందరుా బొంతలు పరుచుకొని
అల్లరల్లరిగా కబుర్లు చెప్పుకుంటుా పడుక్కునేవాళ్ళం.
అమమ్మ మాత్రం మా పిల్లల మధ్యలోనే పడుక్కునేది.
అమమ్మ పక్కన నేనంటే ,నేనంటుా ,దెబ్బలాడుకుంటుా ఉంటే, అమమ్మ" మీరంతా అల్లరి పెట్టకుండా ఉంటే ,
నేనో మంచి కధ చెపుతాను " అనేది అంతే ...
అందరం ఠక్కున నోరు ముాసేసే వాళ్ళం.
అమమ్మ చెప్పిన కధల్లో ఎన్నో నీతి కధలు, చందమామ కధలు , పొడుపు కధలు , భక్తి పద్యాలు ' రామాయణం భారౕతంలో కధలు ఇలా చెప్పుకుంటుా పోతే ఎన్నో...
వాటిల్లో తనకు గుర్తున్న చాలా కధలు ఎన్నో ,తనిప్పుడు తన పిల్లలకు చెపుతోంది.
అమమ్మకు ముగ్గురుా ఆడపిల్లలే కావడం వల్ల
దొడ్డ ఉద్యోగం చేస్తుాండడంతో , నలుగురి పిల్లలతో
ఇబ్బంది పడుతుందని అమమ్మ అక్కడే ఉంటుా ఉండేది.
మా పెదనాన్నగారు వేరే ఊర్లో పనిచేస్తుా అప్పుడప్పుడు
వస్తుా ఉండేవారు.కారణం ఇద్దరికీ ట్రాన్స్‌ఫర్ లు అయ్యేవికావు.
ఇద్దరుా ఉద్యోగాలు చేయనిదే ఇల్లు నడిచేది కాదు.
ఆ యింటి ముందు మర్రి చెట్టికటి ఉండేది. అందువల్ల
అమమ్మనందరుా "మర్రిచెట్టు మామ్మగారు" అని పిలిచేవారు.
అమమ్మ ప్రతీ రోజుా పొద్దున్నే గుడికి వెళ్ళి , ఒక అరగంట సేపు ప్రభాత సేవగా కీర్తనలు పాడి వచ్చేది.
సాయంత్రాలు ఇంటి ఆవరణలో భగవత్ప్రసంగాలు చెపుతుా
అందరి చేతా భజనలు చేయించేది.
అమమ్మన్నా , దొడ్డమ్మన్నా ఆవుార్లో అందరికీ ఎంత గౌరవమొా !
నా వివాహం జరిగేంత వరకు నేను ప్రతీ సెలవులకు
సొింపేట వెళ్ళడం నియమంగా మారితే," అమ్మలు" వస్తుందని అమమ్మ దొడ్డమ్మ తో పాటు పెద్దక్క వస్తుందని ,
మా చెల్లెళ్ళు , తమ్ముళ్ళు ఎదురు చుాడడం , నన్ను ఎంతో
ఆప్యాయతతో పలకరించి పులకరింపజేయడం
అలవాటుగా మారిపోయింది.
నాకు పెళ్ళయేంత వరకు ఊరంటే సోంపేటే.
ఇల్లంటే దొడ్డ ఇల్లే . ప్రేమంటే అమమ్మదే.
ప్రపంచం అంటే మా కుటుంబమే...తప్ప మరొకటి
తెలీదు.
నా వివాహం తర్వాత అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి .
అందరుా ఒకొక్క ఊరిలో స్థిరబడ్డారు.
ఎవరి సంసారాలు వాళ్ళవయ్యాయి .
అమమ్మ వంటరిదయ్యింది.
అందరికీ వంటలు చేసి పెట్టి , పురుళ్ళు పోసి , ముని మనుమల ఆలనా ,పాలనా కుాడా చుాసిన అమమ్మ
చివరికి వంటరిగా...ఆ ఇంట్లో.....
*************
కంటి నిండుగా ధారాపాతంగా కారుతున్న కన్నీళ్ళను ఆపుకునేంతలోనే కంచిలి వచ్చేసింది.
ఊరు మారింది . మట్టి రోడ్డు తారు రోడ్డుగా మారింది
ఇప్పుడు బగ్గీలు లేవు . ఏ.సి బస్సు లో సోంపేట చేరాను.
ఇన్నేళ్ళకు అమమ్మ దగ్గరికి వెళుతున్న ఆనందం
ఒక పక్క , అమమ్మ ఎలా ఉందో అన్న ఆత్రం ఒక పక్క
ఉక్కిరి బిక్కిరి చేస్తుాంటే , గబ గబా ఇల్లు చేరేను.
తలుపు కొడుతుా ఉంటే చేతులు వణికేయి.
కొంచం ఆలస్యంగా తెరుచుకున్న తలుపుల వెనకాల
అమమ్మ వడలిన ముఖంతో , బోసి నోటితో నిండిన నవ్వుతో
అదే ఆప్యాయత నిండిన ప్రేమతో " అమ్మలుా " అంటుా
నన్ను దగ్గరకు తీసుకుంది. అదే ఆప్యాయత అమమ్మలో.
ఈ సారి అమమ్మకు నేనే బోలెడు గిఫ్ట్ లు తెచ్చాను .
అవన్నీ చుాస్తుా అమమ్మ ఎంతో మురిసిపోయింది .చివరిగా మంచి మొబైల్ చేతిలో పెట్టి , దానిని ఎలా వాడాలో ఆ రాత్రంతా చెప్పా...అంతే ఠక్కున ఒకొక్కటిగా అన్నీ నేర్చేసుకుంది అమమ్మ . ఫోనులో మొబైల్ డాటా వేయించి , ఇంటికి నెట్ పెట్టించేసేను ..వారం రోజులు ఇట్టే గడచి పొియాయి. అమమ్మ మొబైల్ లో కీర్తనలు, ప్రవచనాలు, పాత సినిమాలు, చుాస్తుా మురిసిపోతోంది .
తను తిరుగు ప్రయాణమయ్యింది.
మళ్ళీ తప్పక వస్తానని మాట ఇచ్చింది అమమ్మకు .
సోంపేట ష్టేషన్ లో అడుగు పెట్టిందో లేదో..
ఫొిన్ మొాగింది. వీడియొా కాల్ .వస్తోంది.
ఎవరిదబ్బా అనుకుంటుా ఆన్ చేసింది
ఎదురుగా...అమమ్మ... బోసి నవ్వుతో......
--------------------------------
హామీ :
ఈ కధ నా స్వీయ రచన .
No comments:
Post a Comment