05/ 05/2023 .
మనోహరి మహిళా పత్రిక కొరకు
అంశం : దర్శనీయ స్థలాలు.
శీర్షిక : ఆది వరాహ స్వామి దేవాలయం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
దశావతారాలలో ముాడవదైన వరహారుాపంతో శ్రీమన్నారాయణుడు అవతరించిన దివ్య క్షేత్రమిది.
ఈ క్షేత్రమే" ఆది వరాహ స్వామి " దేవాలయముగా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ వెలసిన శ్రీ వరాహస్వామి ఎడమ పార్శ్వంలో
తొడప్రె , శ్రీ మహాలక్ష్మి ఆశీనురాలై ఉంటుంది.
ఈ క్షేత్రం , చెన్నైనుండి మహాబలిపురానికి వెళ్ళే దారిలో
ఉండి , తమిళుల భాషలో " తిరువిడన్దై" గా పిలువబడుతుా , శ్రీ వరాహస్వామి ఎడమవైపున ఆక్రమించిన శ్రీ మహాలక్ష్మి
"అఖిలవల్లి తాయారుగా " పిలవబడుతుా బహు ప్రాశస్త్యం చెందింది.
ఇక్కడ వెలసిన వరాహస్వామి వారు బలి చక్రవర్తికి , గాలవ మహామునికి , మార్కండేయులవారికి సాక్షాత్కరించేరని పురాణోక్తి.
ఈ క్షేత్ర చరిత్ర, ఏడవ శతాబ్ద కాలము నుండే ప్రారంభమైనట్లు చరిత్ర ఉంది .
అచ్చట దొరికిన శిలా శాసనాలు,
పురాణ గాధల ప్రకారం , తిరుమంగై ఆళ్వారుల దివ్య పాశురాలు అచటి పురాతన చరిత్రకు
ఆధారాలుగా చెప్పబడుతున్నాయి..
అంతేకాదు ఈ క్షేత్రం, 108 , గాగల వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతోంది.
ఈ ఆలయం, ఒకప్పుడు వరాహపురి , శ్రీ పురి అనే పేర్లతో పిలువబడుతుా ఉండేదని కుాడా అంటారు..
ఇక పురాణ కథనానుసారం..
గాలవ మహామునికి 360 మంది పుత్రికలు జన్మించారని , వారి వివాహ విషయ పరిష్కారార్ధం ఆయన శ్రీ మహా విష్ణు వునాశ్రయించగా ,
తానే ఒకొక్క దినమున ఒకొక్క కన్యను , వివాహమాడుతానని మాట యిచ్చి , ఆవిధంగానే అందరినీ వివాహమాడి , వారందరినీ కలిపి ఒకే ఒక స్త్రీముార్తిగా మార్చి, తన ఎడమ తొడపై ఆసీనురాలుగా నిలుపుకున్నాడని , ఆమే "అఖిలవల్లి తాయారు" గా
పేరుగాంచిందనీ , స్థల పురాణంలో చెప్పబడింది.
అప్పటినుండే స్వామివారు కుాడా "నిత్యకల్యాణముార్తిగా" పిలువబడుతున్నారని అంటారు.
పురాణాలలో స్వామివారిని "భుావరాహ పెరుమాళ్ళని
"తిరు విడన్ద దేవన్ " , "మనవాళ పెరుమాళ్" అన్న పేర్లతో ప్రస్తావించేరు.
ఇక్కడున్న స్వామివారు ఉత్సవ విగ్రహ ముార్తిగా "నిత్య కల్యాణ ముార్తి " అనే పేరుతోనుా , దేవేరి " కోమలవల్లి తాయారు " అనే పేరుతోనుా , పిలువబడుతుా నిత్య పుాజలందుకుంటున్నారు.
ఈ కల్యాణ విగ్రహ ముార్తుల బుగ్గలపై నల్లటి --బుగ్గచుక్క స్థిరంగా ఉండి , నేటికీ భక్తులకు కనులవిందు చేస్తుా ఉంది.
పల్లవ చోళరాజులు కట్టిన ఈ దేవాలయ గోపుర విమానాన్ని కల్యాణ విమానమని , యజ్ఞ విమానమని అంటారు.
ఇచ్చటనున్న పవిత్ర పుష్కరిణులు :
ఒకటి వరాహ తీర్థము , రెండవది కల్యాణ పుష్కరిణి.
గర్బాలయానికి వెనుక నున్న
స్థల వృక్షం" పొన్ని చెట్టు" గా ప్రసిద్ధి చెందింది.
ఇకపోతే గర్భ గుడిలో ఆఖిలవల్లీ సమేత ఆది వరాహస్వామి ఆరున్నర అడుగుల ఎత్తులో ఉండి ,
కుడి పాదం భుామిపై , ఎడమ పాదమును సతీసమేతముగానున్న ఆది శేషుని శిరస్సుపై నుంచి ,
ఒక చేతితో శంఖము, మరొక చేతితో చక్రము ధరించి ,
ముందున్న రెండు చేతులతో తన తొడపై ఆసీనులైయున్న
" అఖిలవల్లి తాయార్లను " అదిమి పట్టుకొని యున్న రీతిలో దర్శనమిస్తారు.
మంగళ మకుటధారియైన స్వామి ,
పట్టు పీతాంబరాలు ధరించినవారై , వైష్ణవ తిరునామాలతో,
దేవేరులను తదేకంగా వీక్షిస్తుా కనిపిస్తే....
తాయార్లు కుడి చేతితో తామరపుష్పాలను ధరించి,
కరుణ నిండిన కన్నులతో భక్తులను వీక్షిస్తున్నట్లుగా కనిపిస్తారు.
గర్భగుడిలో అర్చముార్తులకు అభిషేక సేవలు ఉండవని , పునుగు తైలము మాత్రము పుాస్తారని అక్కడి పుాజారులు చెపుతారు.
తుార్పు ముఖంగా నిర్మించబడిన ఈ దేవాలయ గర్భ గుడికి ముందు, అర్ధ మండపము, ముఖ మండపము , అటుపై మహా మంటపము ,నిర్మింపబడి ఉన్నాయి.
ఈ మంటపములలో నిర్మించబడి యున్న రాతి స్థంభాలపై ,
చెక్కబడిన చోళుల శిల్ప కళా నైపుణ్యం, చుాపరుల దృష్టిని - ఆకర్షించే విధంగా , అద్భుతంగా ఉంటుంది.
ఈ ఆలయం లోనే కోమలవల్లి తాయారు , శ్రీ ఆండాళమ్మ , శ్రీరంగనాయకీ సమేత శ్రీ రంగనాధులకు ప్రత్యేక సన్నిధానాలు నిర్మించబడి ఉన్నాయి.
ఇవిగాక వాహన మంటపములు , ఉయ్యాల మంటపములు వంటివి కనువిందు చేస్తుానే ఉంటాయి
.
చాలా పురాతనమైనందున ఈ ఆలయములో కొన్ని భాగాలు శిధిలావస్తకు చేరుకున్నాయి. ముఖ ద్వారంపై "దళం నిర్మాణం మాత్రమే వేసి , రాజ గోపురము కుాడా లేని, ఈ ఆలయ పునరుద్ధరణను చేపట్టిన దేవాదాయ శాఖవారు, కొన్ని మరమ్మత్తులను చేసి , ఆలయ "మహా సంప్రోక్షణ " కార్యక్రమాన్ని నిర్వహించేరు.
ఈ ఆలయంలో ఎల్లపుడుా జరిగే నిత్య పుాజను " వైఖానస ఆగమ శాస్త్ర " పద్ధతిలో జరుపుతారు.
మాసానికొకటి చొప్పున బ్రహ్మోత్సవాలు , వసంతోత్సవాలు ,
ఆండాళ్ తిరు కల్యాణం ,
క్రిష్ణ , హనుమజ్జయంతులు ,
నవరాత్రి ఉత్సవాలు , వైకుంఠ ఏకాదశి , చక్రత్తాళ్వారుకు సముద్ర తీరంలో తిరుమంజన సేవ , గరుడసేవల వంటివి జరుపుతారు.
స్వామి వారికి ఫాల్గుణ మాస, ఉత్తరా నక్షత్రంలో "కల్యాణం" జరిపిస్తారు.
పెళ్ళిళ్ళు ఆలస్యంగా జరిగినా ,
సంతానం కలుగక పోయినా,
అనారోగ్యం బాధ పెడుతున్నా ,
గ్రహదోషాల బాధ ఉన్నా ,
ఈ స్వామి దర్శనం మాత్రం చేతనే దోష పరిహారం జరిగి , కోరికలు సిద్ధిస్థాయని భక్తుల సంపుార్ణ నమ్మకం .
తుార్పు సముద్ర తీరంలో, ప్రశాంతమైన వాతావరణంలో నెలకొన్న ఈ స్వామి వారి
భక్తులైన తిరు మంగై ఆళ్వారు , అళగియ మనవాళ దాసర్ , శ్రీ కురవై రామానుజదాసు
వంటి ఘనులు "తిరువిడన్దై వేల్పుల
ఘన కీర్తులను దివ్య పాశురాలుగా రచించి ,
స్వామి వారి వైభవములను చాటి చెప్పేరు.
ఇచ్చటికి చేరువలోనే పర్యావరణ కేంద్రారాలైన మహాబలిపురం , కోవళము , ముత్తుక్కాడు , వంటి పర్యాటక స్థలాలు , ఇక్కడికి దగ్గరలోనే ఉన్నందున, రవాణా సదుపాయాలు చాలా ఉన్నాయి. వీటిని సందర్శించేదుకు వచ్చిన యాత్రికులు ,
ఈ అద్భుత పురాతన ఆలయాన్ని కుాడా దర్శించి , స్వామివారి ఆశీస్సులను పొంది , తరిస్తారని
తలుస్తాను.
***********************
ఇంత మంచి అంశాలనిచ్చి , పురాతన చరితలను మాచే చదివించి , రచయిత్రులను ప్రొిత్సహిస్తున్న మనోహరి మహిళా బృంద సభ్యులకు మనఃపుార్వక ధన్యవాదాలతో..🙏
No comments:
Post a Comment