02/05/2023.
తపస్వీ మనోహరం "e " సంకలనం కొరకు..
అంశం : ప్రేమ.
శీర్షిక : నేనో ప్రేమ పిపాసిని .
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
ఊరు: కల్యాణ్ . మహారాష్ట్ర .
రెండక్షరాల ప్రేమ
నన్ను జ్ఞాపకాల పడవలో
ఊగిసలాడిస్తోంది.
తొలిసారి నిన్ను చూసిన క్షణాలు
నా మస్తిష్కపు పొరల్లో
కొట్టుమిట్టాడున్నాయి.॥
అనుభూతుల ఆనందాలు
వలువలై నా మేనిని కప్పేస్తుంటే
నిన్ను చూడని ఒక్కో క్షణం ఒక మరణంలా..
విరహ వేదనకు వంతు పాడుతున్నాయి ॥
గుండెల్లొ చెప్పలేని వ్యధ ..
చలిస్తున్న కనురెప్పల్లో కన్నీళ్ళు సంద్రమైనపుడు...
క్షణికమైన అస్పష్టపు బాధ ముఖంపై
నీలినీడై ప్రతిఫలించినపుడు ,
నాకేమీకాని నువ్వు, నా కన్నీటి చుక్కవై
నా చంపల్ని ప్రేమగా స్పృశిస్తావు.
నీ స్మృతుల అలలతో దారి మళ్ళించి
గతాల ఆనంద తీరాలకు లాక్కుపోతావు.॥
నువ్వు నన్ను వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు
భగ్నమైన మనసు పొరల్లోంచీ పయనించీ.
కవితాక్షర ప్రణయ కావ్యాలై , నిన్ను చేరి
నీ గుండె లయల స్పందనై నినదించినపుడు ....
నీ మనసులో నీలి నీడల జ్ఞాపకాన్నై
నీ మదిలో ,నేనే నీవుగా నిలిచిపోతా ॥
హామీ :
పై కవిత నా స్వీయ రచన .
-----------------------------
No comments:
Post a Comment