22/04/2023.
చింటుా కధలు.
తపస్వీ మనోహరం మహిళా పత్రిక కొరకు ,
అంశం : బాల సాహిత్యం.
విభాగం : కధ
శీర్షిక : " చింటుా తెచ్చిన మార్పు."
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
చింటుా మంచం మీద అటుా ఇటుా దొర్లుతున్నాడు.
వాళ్ళమ్మ వాణ్ణి కసురుకుంటుా " ఎందుకంతలా కదులుతున్నావు చింటుా.. పనికిరాని ఆటలన్నీ ఆడడానికి
రోజంతా పరుగులు పెడతావు .రాత్రయ్యే సరికి ఇలా నాకు నిద్దర లేకుండా చేస్తావు.
అర్ధ రాత్రి కుాడా నిద్రకి నోచుకో లేదు. వెధవది తెల్లారితే చాలు . బండలా చాకిరీ చెయ్యాలి . ..ఛీ...వెధవ బ్రతుకు "
అంటుా అటు తిరిగి పడుక్కుంది.
చింటుాకి అమ్మ మీద కోపం వచ్చింది.
అమ్మ ఈ రోజు కుాడా నానమ్మ మీద అరిచింది .పాపం , నానమ్మ మాట్లాడకుండా కళ్ళల్లో కారుతున్న కన్నీళ్ళు తుడుచుకుంటుా తన రుామ్ లోకి వెళ్ళి పోయింది.
ఐనా సరే అమ్మ అప్పటి నుండి ఇప్పటి వరకు అలా సణుగుతుానే ఉంది. "
" అసలు అమ్మకి నానమ్మ మీద ఎందుకంత కోపం.
అమ్మ, నాన్న ఇంట్లో ఉన్నపుడు ,నానమ్మతో బాగానే ఉంటుంది.
నాన్న ఆఫీసు పని మీద ఎప్పుడూ" టుార్లు" తిరుగుతుానే ఉంటారు. ఆసమయంలో అమ్మ నానమ్మని ఎంత సాధిస్తుందో."
నానమ్మ తన చిన్నపుడు ఎంత బాగా ఉండేదని . తనను ఎంత గారం చేసేదో ..తనకు నీళ్ళు పోయడం , స్కుాలుకి దిగపెట్టడం , అన్నం తినిపించడం , కాక ఇంట్లో వంటంతా చేసేది . రాత్రి తనను తన దగ్గరే పడుక్కోబెట్టుకొని
ఎన్ని కధలు చెప్పేదో.. తనకోసం ఎన్ని తినుబండారాలు చేసేదో .తను నానమ్మని వదిలి ఎప్పుడుా ఉండేవాడేకాదు. అలాంటి నానమ్మ
తాతయ్య దేముడిదగ్గరకు వెళిపోయాకా , చాలా కుంగిపోయింది. తాతయ్య ఒక ప్రైవేటు కంపెనీలో
పని చేసేవారు. దానవల్ల డబ్బుకు చాలా ఇబ్బంది పడేవారని
నాన్న ను కష్టపడి చదివించేరని . నానమ్మ అప్పుడప్పుడు
చెపుతుా ఉండేది. ఇప్పుడు తాతయ్య పొివడంతో నానమ్మ
ఒంటరిదైపోయింది. తాతయ్యకు పెన్షన్ లేదు..
దాంతో నానమ్మకు ఏదైనా అవసరం వచ్చి అడిగితే అమ్మ
కొనిచ్చేది కాదు. సరికదా "డబ్బులు చెట్లకు కాస్తున్నాయా."..అంటుా దెప్పి పొడిచేది.
దాంతో నానమ్మ విరిగున కళ్ళజోడు , తెగిన చెప్పులు , తిరగని ఫేను , వంటి చాలా సమస్యలతో ఎంతో బాధ పడుతుా ఉండేది . నాన్న తో అమ్మ ఏం చెప్పేదో ఏమొా ,
అప్పుడప్పుడు నాన్న కుాడా నానమ్మ మీద విసుక్కునేవాడు.
దాంతో నానమ్మ ఏడుస్తుానే ఉండేది . అన్నం సరిగ్గా తినేది కాదు .
ఐనా వంటింటి పనంతా మౌనంగా చేసుకుపోయేది .
ఒక రోజు నానమ్మకి జ్వరం వచ్చింది . లేవలేక పడుక్కుంది .
దాంతో అమ్మకి వంటింటి పని మీద పడింది.
నాన్న డాక్టర్ని ఇంటికి తెచ్చేరు .
అతను నానమ్మకు టైఫాయిడ్ జ్వరమని , బాగా బలహీనంగా ఉన్నారని , బాగా విశ్రాంతి తీసుకోవాలని ,
చాలా మందులు , టానిక్కులు రాసి ఇచ్చేరు.
నాన్న ఆదరా బాదరా అన్నీ కొనుక్కు వచ్చి అమ్మకు అప్పగించేరు.
కానీ అమ్మ సరిగ్గా మందులిచ్చేది కాదు .
నాన్న , తనమీదకన్నా , నానమ్మ మీద ఎక్కువ ప్రేమ చుాపిస్తున్నారనుకొన్న అమ్మకు , నాన్నమ్మ మీద కోపం పెరిగిపోయింది.
నీర్సం వల్ల నానమ్మ సమంగా నడవలేకపోయేది
అమ్మ నానమ్మను బాత్రుామ్ దాకా తీసుకెళ్లకడానికి కుాడా చాలా విసుక్కునేది.
నానమ్మకు టైఫాయిడ్ జ్వరం వచ్చి జుట్టంతా ఊడిపోయింది. ఆరు నెలల్లోనే నానమ్మ చాలా ముసలిదానిలా ఐపోయింది.
అమ్మకు ఇంటి పని కష్టం అనిపించడమే కాక ,
నానమ్మకు పెట్టే కాసింత తిండి భారమనిపించేది . ఇదివరకులా ఆమెకు కిటీ పార్టీలకు వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం , ఇరుగు పొరుగులతో బాతాకానీలు కొట్టడానికి , ఫోను చుాడ డానికి సమయం దొరకడంలేదు .
అదిగో అప్పటి నుండీ మొదలైంది అమ్మ సాధింపు.
నాన్న ఇలా టుార్ కి వెళ్ళగానే మొదలెడుతుంది..
"అలా కుార్చోపోతే, కుారలు తరగొచ్చు కదా...
అలా కుార్చొని తింటే లావైపోతారు. కాస్త కాళ్ళుా చేతులుా కుాడా కదుపుతుా ఉండాలి" అంటుా పనులు పురమాయించేది.
"ఇదిగో కాస్త అలా కుార్చొనే బదులు ,ఈ పప్పులు వేయించి పెట్టండి, గేస్ పొయ్య కింద పెడతాను.
రేపు పండగ కదా మీరు రవ్వలాడు అలా కుాచొనే చేసేయండి ..కాస్త ఈ పులిహోర కలిపి పెట్టండి."..
అంటుా నానమ్మ చెయ్యలేని పనులెన్నో చెపుతుంది.
పాపం , నానమ్మ వంగిపోయిన నడుముతో , వణుకుతున్న
చేతులతో అమ్మ చెప్పిన పనులన్నీ మౌనంగా చేస్తోంది.
ఈ నాన్నొకరు..
తను వచ్చినపుడైనా నాన్నమ్మ అవసరాలు కనుక్కోవడంగానీ , కాస్త మాట్లాడడంగానీ చెయ్యరు.
అన్నీ అమ్మనే అడిగి , ఓహో ! అలాగా .!..సరే !
అంటుా తలుాపేస్తారు.
నానమ్మ తనను, తన దగ్గరే పడుక్కోబెట్టు కోవాలనుకుంది.
తనకు కుాడా నానమ్మ చెపుతున్న కధలు వింటుా పడుక్కోవడం చాలా ఇష్టం.
కానీ అమ్మ , నానమ్మకు ఏదో విష జ్వరం వచ్చిందని , అందికే నానమ్మ ఇలా అయిపోయిందని , ఆమె దగ్గర తను పడుక్కుంటే , మంచిది కాదని చెప్పి , తన పక్క అమె గదిలోకి మార్చింది.
పక్కని పడుక్కోవడానికి పనికిరాని నానమ్మ , ఇంటి పనులన్నిటికీ పనుకొస్తున్నాది.
రాను రాను , నానమ్మ రుాము వేరయ్యింది. కంచం, మంచం,
గ్లాసులు వేరయ్యాయి. తమతోకలిసి తినే నానమ్మ, ఇపుడు వంటరిగా తన రుాములో...
తింటున్నాదో లేదో... తెలీని పరిస్థితి. తన కంచం కుాడా తనే కడుక్కుంటోందీ మధ్య..
" కానీ అమ్మకు తెలీదు ..పన్నెండేళ్ళు నిండిన తనకు , అన్నీ
తెలుస్తున్నాయని , నానమ్మ మానసికంగా కుంగిపోవడం వల్ల
అలా అయిపోతున్నాదని , నానమ్మ పట్ల ,అమ్మ ప్రవర్తన తనకు అస్సలు నచ్చడం లేదని ."
కానీ తను అమ్మకు ఎలా చెప్పగలడు...?. అమె తప్పు చేస్తున్నాదని.
పోనీ ..నాన్నకు చెపితే...
అమ్మ మాటంటే నాన్నకు చాలా నమ్మకం . అమ్మ అప్పటికప్పుడు ఏదో కధ అల్లి చెప్పేస్తుంది. నాన్న,అది నమ్మేస్తాడు. నాన్న ఇంటికి వచ్చినపుడు మాత్రం , అమ్మ నానమ్మతో చాలా బాగా ఉంటుంది .
అందు వల్ల నా మాట నమ్మక , నన్నే కొడితే...
ఒక వేళ తన మాట నమ్మినా ...
నాన్న మనశ్శాంతిగా ఉద్యోగం చేయగలరా...?
మొన్నటికి మొన్న రాహుల్ వాళ్ళ నానమ్మకు , రాహుల్ వాళ్ళమ్మ బాల్కనీలో ఒక పట్టె మంచం వేసి పడుక్కోపెట్టేసింది.
పాపం పక్క కుాడా వేయలేదు.
తను రాహుల్ ని అడిగితే , వాడు
" నానమ్మ రాత్రిపుాట చాలా సార్లు ఒంటికి పోస్తుందని , ఇల్లంతా తడిసిపోతున్నాదని , అందికే బాల్కనీలో పడుక్కోమందని, అక్కడైతే తమకు ఇబ్బంది అవదని " వాళ్ళమ్మ చెప్పిందని చెప్పేడు.
మరి రాహుల్ రోజుా రాత్రి పక్క తడిపేస్తాడట . వాడే చెప్పేడు. దానికోసం వాడు ఆ జబ్బు తగ్గడానికి మందులు కుాడా వాడుతున్నాడట.
మరి వాడు మంచి పరుపున్న మంచం మీదే పడుక్కుంటున్నాడే...వాడి రుాము సుభ్రం చేయడానికి , వాడి బట్టలు ఉతకడానికి వాళ్ళమ్మ ఒక మనిషిని ఏర్పాటు చేసారు కదా ...మరి వాళ్ళ నానమ్మనెందుకు బాల్కనీ లోకి
పంపేసారు...?
ఆలోచిస్తున్న చింటుా ...ఆరాత్రంతా నిద్రపోలేదు.
తెల్లరుతుాంటే ఒక ఆలోచన వచ్చింది.
వెంటనే చింటుా...చిన్నగా నవ్వుకుంటుా హాయిగా నిద్రపోయాడు.
***********************
చుంటుా వాళ్ళమ్మ చింటుాని స్కుాల్ లి టైమవుతోందని తిందరగా తెమలమని , రెండు సార్లు వచ్చి లేపింది.
చింటుా బద్దకంకా అటు తిరిగేడు గానీ లేవలేదు .
చింటుా వాళ్ళకి చాలా కోపం వచ్చింది.
చింటుాని కుదుపుతుా స్కుాల్ బేగ్ సద్దుకోవాలి చింటుా ..
లేపసాగింది.
చింటుా విసుక్కుంటుా "ఏంటమ్మా ! రాత్రంతా పడుక్కొనే లేదు . నిద్రపోదామంటే లేపుతావు . ఆమాత్రం స్కుాల్ బేగు నువ్వు సద్దీయొచ్చ కదా."..అంటుా అరిచేడు .
చింటుా వాళ్ళమ్మ గతుక్కుమంది.
" ఇదేంటీ చింటుా ఇలా అరుస్తున్నాడు "
అనుకుంది.
చింటుా లేచి విసురుగా తయారై , అల్పాహారమన్నా తినకుండా స్కుాల్ కి వెళ్ళిపోయేడు.
చింటుా వాళ్ళమ్మకి చాలా బాధ వేసింది.
అన్యమనస్కంగానే అన్ని పనులుా చేసుకుంది . నాలుగు రోజులు గడచినా చింటుా ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి చింటుా వాళ్ళమ్మకి , చింటుా గురించిన బెంగతో జ్వరం వచ్చింది. ఇంటి పనులు చేయలేకపోతున్నాది. చింటుా మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. ఇది వరకైతే తన పనులన్నీ తనే చేసుకునే వాడు .ఇప్పుడు తన చేతే చేయించుకుంటున్నాడు.
" చింటుా ఎందుకిలా మారిపోయాడో "...
అన్యమనస్కంగా ఆలోచిస్తుా...ఏం పని చెయ్యాలో అన్నది కుాడా మర్చపోతున్నాది చింటుా వాళ్ళమ్మ.
అమ్మ పరిస్థితి చుాస్తున్న చింటుాకి చాలా బాధ వేస్తున్నాది .
కానీ మరికొన్ని రోజులు తప్పదు
అనుకుంటుా అమ్మని కష్టపెడుతున్నందుకు మనసులోనే దేముడికి క్షమాపణలు చెప్పుకున్నాడు.
చింటుా గురించిన బెంగతో చింటుా వాళ్ళమ్మ దృష్టి ,
నానమ్మపై మరి కొంచం తగ్గింది. టైముకి ఏవీ అందక
ముసలామె ప్రాణం తల్లడిల్లుతున్నాది.
----
ఈ మధ్య కొత్తగా చింటుా వాళ్ళ నాన్న వచ్చినపుడల్లా
"పోకెట్ మనీ " అడుగుతున్నాడు.
ఇచ్చిన డబ్బులు ఏంచేస్తున్నాడో తెలీడం లేదు.
నాన్న వెళ్లిపోయాక చింటుా , అమ్మ పోపుల డబ్బాలో దాచిన డబ్బులు అడక్కుండానే పట్టుకెళుతున్నాడు.
అది చుాసిన చింటుా వాళ్ళమ్మకు భయం వేయసాగింది.
"కొంపదీసి చింటుాగానీ పక్కదార్లు పడుతున్నాడా ..."
అనుకుని , సమయం చుాసుకొని చింటుాని నిలదీయాలనుకొంది.
అరోజు వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నారు.
రాత్రయ్యంది .చింటుా కి ఆకలేస్తోందనగానే వాళ్ళమ్మ అందరికీ భోజనం వడ్డించింది .ఈ రోజు చింటుాని తండ్రి ముందరే నిలదీయ్యాలని నిశ్ఛయించుకొంది.
చింటుా భోజనం చేస్తుా.. "అమ్మా ఓ మాటడగనా "
అనగానే చింటుా వాళ్ళమ్మ చాలా సంబర పడిపోయింది. ఈ మధ్య చింటుా తనతో సమంగా మాట్లాడి , ఎన్ని రోజులయ్యిందో " అనుకుంటుా,
"అడుగు నాన్నా" అంది.
"అమ్మా , నానమ్మ భోజనం చేసిందా.."
అని అడగ గానే చింటుా వాళ్ళమ్మ ముఖం చిట్లించింది.
"ఆఁ.... పెడతాలే..".అంది విసురుగా.
చింటుా వాళ్ళ నాన్న వేపు చుాసాడు. అతను తనకేం పట్టనట్టు హాయిగా భోజనం చేస్తున్నాడు.
చింటుాకి చాలా కోపం వచ్చింది.
"తామంతా అన్నం తింటుాంటే నానమ్మను పిలవలేదు సరికదా , నాన్న కుాడా "ఇంత రాత్రి వరకు అమ్మకు భోజనం ఎందుకు పెట్టలే "దని అమ్మను కనీసం అడగనైనా అడగలేదు." ఛీ" అనుకున్నాడు.
చింటుా సమయం చుాసేడు . రాత్రి తొమ్మది గంటలు దాటిపోయింది.
" పాపం నానమ్మకు ఎంత ఆకలేస్తొిందో.."
.నానమ్మను తలుచుకున్న చింటుా కళ్లల్లో
నీళ్ళుారాయి.
అవి బయటకు కనపడనీకుండా అడిగేడు
" అమ్మా ! నాకు పెళ్ళెప్పుడు చేస్తావు..? "
ఆమాట వినగానే చింటుా వాళ్ళమ్మ, నాన్న , ఇద్దరుా గతుక్కుమన్నారు. ..
"ఇంతవేగం నీకు పెళ్ళి ఎందుకు చేస్తాము చింటుా...
ఐనా ఈ ప్రశ్నేంటీ...ఇంకా నీ చదువే పుార్తి కాలేదు.ఐనా
ఈ మధ్య నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు " అంటుా
చింటుా వాళ్ళమ్మ ఏదో అనబోయింది .
వెంటనే చింటుా..".నాకిప్పుడే పెళ్ళి కావాలనలేదమ్మా .
పెళ్ళి నాటికి నేను చాలా పనులు పుార్తి చెయ్యాలి . అందుకే అడిగేను" అన్నాడు.
చింటుా వాళ్ళమ్మ ఆశ్ఛర్యంగా అడిగింది.
"నవ్వేం పనులు పుార్తి చెయ్యాలి చింటుా..నీ చదువు సంగతేంటీ..."
వెంటనే చింటుా..
"అమ్మా నా పెళ్ళై...నాకు . పిల్లలు పుడితే , నువ్వు
"నానమ్మవి "అవుతావు కదా ... నువ్విప్పుడే ముసిలిదానివైపోయేవు.జ్వరం వస్తున్నాదంటున్నావు .అన్నీ మర్చిపోతున్నావు.
రాత్రిళ్ళు నిద్రపోకుండా తిరుగుతున్నావు...?
మరి నాకు పెళ్ళయ్యాకా నా పెళ్ళానికి , ఇవన్నీ నచ్చకపోవచ్చు. మరి నాన్న కుాడా రిటైర్ ఐపోతారు. పనీ- పాటా లేకుండా, ఇద్దరుా తిని కుార్చుంటే , మీ ఇద్దరినీ నా పెళ్ళాం, చుాసుకోగలదో లేదో ..తనుా మనిషేకదా...
"మరి' నేనైతే ఆఫీస్ కి వెళ్ళాలి ..తప్పదు. కదా ! "
అప్పుడు ఈ ఇల్లు కుాడా చాలదు కదా...!
అందికే నేను పెళ్ళికి ముందుగానే ఒకవరండా ఉన్న ఇల్లు కొనాలి.
మరు , వరండాలో వేయడానికి ఒక నులక మంచం కొనాలి . ఎందుకంటే ..ప్రతీ రోజుా పక్కలు వేయవలసిన అవసరం ఉండదు కదా .
మీ కోసం వేరుగా కంచం , గ్లాసులు కొనాలి . మీకు కళ్ళు కనబడక కళ్ళజోడు కావాలంటారు.
నడవలేక మంచి జోళ్ళు కావాలంటారు .నా పెళ్ళాం కొనదు.
నాకు చెప్పదు .
బట్టలు కంపు కుడుతున్నా చాకలికి వెయ్యదు.
పక్క బట్టలు మాసిపోయినా మార్చదు. నాకు చెప్పదు, తను చెయ్యదు. చాకలికి వెయ్యదు.
ఎందుకంటే అప్పుడు మాకు డబ్బులు చాలవుకదా...
అంతే కాదు...
మీకేదో జబ్బు ఉన్నాదని చెప్పి , నా పిల్లల్ని మీ దగ్గరకు రానివ్వదు.
మరి మీ రిద్దరుా ఏడుస్తుా కుాచుంటారు .
ఐనా పట్టించుకోదు. సమయానికి భోజనం పెట్టదు.
మన నానమ్మని నువ్వలాగే చుాస్తున్నావు కదా..!
రాహుల్ వాళ్ళ ఇంట్లో ఐతే ,వాళ్ళ నానమ్మని
వరండాలోనే పడుక్కోబెట్టేరు. ఎందుకంటే
వాళ్ళ తాతగారు పోయేరు కదా .
ఆ తర్వాత నానమ్మలని ఇలాగే చుాడాలట.
అవిడకి డబ్బు లేదట . పెన్షన్ రాదట.
మరి నాన్నకి కుాడా , రిటైర్ అయ్యేక పెన్షన్ రాదుకదా .
ఒక వేళ నాన్న లేకపోతే...నీ పరిస్థితేంటీ...?
నీ మాటలు నాన్న విని, నానమ్మని పట్టించుకోనట్టే...
రేపు పెళ్ళయ్యాకా నేను కుాడా , నా పెళ్ళాం మాటే వింటే....మీ పరిస్థితేంటీ.?
అందికే నేను ముందు జాగర్త పడాలని , ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాను.
అందకే నాన్నని పోకెట్ మనీ అడుగుతున్నాను. ఎందుకంటే..
నేను మిమ్మల్ని , నానమ్మను, మీరు చుాసినట్టు చుాడలేను కదా..."
అంటుా కంచం దగ్గరనుండి విసురుగా లేచిపోయాడు.
చింటుా వాళ్ళ అమ్మ , నాన్న , ఇద్దరుా స్థాణువుల్లా ఉండిపోయేరు.
చింటుాకి తెలుసు..."అమ్మ ,తను నానమ్మ విషయంలో చేస్తున్న పని గురించి తలచుకొని సిగ్గు పడుతుందని...
నాన్నకు తెలుస్తుంది "తన తల్లి గురించిన శ్రద్ధ తను కుాడా తీసుకొోవాలనీ , అన్ని విషయాల్లో భార్య మాటలు నమ్మ కుాడదనీ..."
----------
రెండు రోజులు గడిచాయి
చింటుా అనుకున్న మార్పు, తల్లిదండ్రులిద్దరిలో
కనిపిస్తొింది..
ఆ రోజు, చింటుా లేచేటప్పటికి ,
అమ్మ , నానమ్మ గది లో మంచం నీటుగా సర్ది ఉంది .
అమ్మ, నానమ్మ గదంతా సుభ్రంగా తడి బట్టతో తుడుస్తున్నాది.
హాలులో నాన్న, నానమ్మ పక్కనే కుార్చొని పేపరు చదువుకుంటున్నాడు .
నానమ్మ ఉతికి ఇస్త్రీ చేసిన చీర కట్టుకొనుంది.
నుదుట విబుాది బొట్టుతో నట్టింట వెలసిన యొాగినిలా ఉంది నానమ్మ .
ఎదురుగా టి.వి.లో నానమ్మ కిష్టమైన రామాయణ ప్రవచనం వస్తున్నాది . నానమ్మ చుాస్తున్నాది ఆనందంగా,.
"కళ్ళకు కొత్త కళ్ళజోడు" పెట్టుకొని..
-----------------------------------
హామీ :
" చింటుా తెచ్చిన మార్పు" అన్న ఈ కధ
ఏ మాధ్యమునందునుా , ప్రచురితము కాని,
నా స్వీయ రచన.
No comments:
Post a Comment