17/03/2023.
మనోహరి మహిళా పత్రిక కొరకు.
అంశం : దర్శనీయ స్థలాలు.
(ఐచ్ఛికం ).
శీర్షిక : మైసుారు , శ్రీరంగపట్టణం .(కర్నాటక).
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
భారతదేశం అంటే మొదట గుర్తు వచ్చేది పుణ్య క్షేత్రాలే. కాశ్మీరు నుండి, కన్యాకుమారి వరకు అడుగుకొక పుణ్య క్షేత్రం ఉంటుంది,
నాకు మావారికి తీర్థయాత్రలు చేయడమంటే చాలా ఇష్టం .
కారణం పుణ్య నదుల్లో స్నానాలు చేయడం, భగవద్దర్శనం చేసుకోవడం వంటివి మనసుకు చాలా
ప్రసాంతతనిస్తాయన్న నమ్మకం ఎక్కువగా ఉండేది. .
ఆ యిష్టం తోనే అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి వచ్చి అక్కడి విషయాలను పదే పదే తలుచుకొంటుా ఆనందపడేవాళ్ళం.
మా తమ్ముడికి ఉద్యోగరీత్యా మైసుారుకు ట్రాన్స్‌ఫర్
అయ్యింది. తను భార్యా పిల్లలతో అక్కడ సెటిల్ అయ్యేకా
మమ్మల్ని అక్కడికి రమ్మని పదేపదే పిలవడంతో మేము మైసుారుకు వచ్చేము.
ఇక మా తమ్ముడు మైసుారంతా తప్పకుండా తిరిగి చుాడాల్సిన ప్రదేశమనీ ఎన్నో పురాతనమైన మైన మందిరాలు చారిత్రాత్మక కట్టడాలతో చాలా అందంగా ఉంటుందనడంతో
సహజంగా మాకుండే ఉత్సాహంతో మరి కొన్ని రోజులవరకు మా తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాం.
ఇంకేముంది..
శని ఆది వారాలైతే ఇంట్లో ఉండేవాళ్ళమేకాదు.
అక్కడే చుట్టుపక్కలనున్న బృందావన్ గార్డెన్స్ , ఛాముండీ కొండకు చాలా సార్లు వెళ్ళేము .
రక రకాల పుాల వనాలు చెట్ల తో నిండిఉన్న బృందావన్ గార్డెన్స్, సాయంత్ర సమయాల్లో వెలుగుతున్న దేదీప్యమానమైన రంగు దీపాల మధ్య అద్భుతమైన అందాన్ని సంతరించుకుంటుంది . అంతేకాదు..
నీటితో చేసే విన్యాసాలు (వాటర్ షో) మనలను ఆశ్ఛర్యచకితులని చేస్తాయి. పిల్లలతో అక్కడికి వెళితే వాళ్ళు "ఇళ్ళకు తిరిగి రాము" అని చేసే మారాము,
మనకు చుక్కల్ని చుాపిస్తుందంటే నమ్మండి. ఇక కొండపై వెలసిన అమ్మవారైన ఆ ఛాముండేశ్వరీ తల్లి మహిమలు కోకొల్లలు. అక్కడి ప్రజలంతా ఆమెను అనునిత్యం
ఆరాధిస్తుా ఉంటారు అనడానికి అక్కడికి వచ్చే జన ప్రవాహమే సాక్ష్యం .
అలా తిరుగుతుానే ఒకరోజు అనుకోకుండా మైసుార్ సిటీలోనున్న" చెన్న కేశవ" ఆలయానికి వెళ్ళేము.
ఎందు చేతనో అక్కడ పుాజలు జరగడంలేదు.
కానీ విదేశీయులెందరో ఆ ప్రదేశాన్ని దర్శిస్తుాండడంతో
దానిని పర్యాటక స్థలంగా చాలా అందంగా తీర్చి దిద్దేరు.
ఆక్కడ చెన్నకేశ్వరుని పుార్తి శిలా నిర్మత ఆలయం, శిఖరాగ్రం వరకు అందమైన రాతి చెక్కడాలతో అద్భుత శిల్పకళా వైభవంతో అలరారుతుా మనసులను రంజింపజేస్తుా చుాపరులను పరవసింపజేస్తొింది.
ఒకొక్క ప్రదేశం ఒకొక్క అద్భుతమైన చరిత్రకు నిదర్శనంగా, .
ఒకొక్క పుణ్య తీర్ధం పవిత్ర పుణ్య క్షేత్రంగా మా మనసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఎంత చుాసినా తనివి తీరని కొన్ని ప్రదేశాలలో .
మా మనసుకు హత్తుకున్న శ్రీరంగపట్నం గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.
శ్రీరంగపట్నం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని ఏడు తాలూకాలలో ఒకటైన పట్టణ ప్రధాన కార్యాలయం .
హైదర్ అలీ టిప్పు సుల్తాను-
మాండ్య నగరానికి సమీపంలో ఉన్న ఈ శ్రీరంగపట్టణాన్ని
మైసూరు రాజ్యానికి' రాజధానిగా చేసి ఆ తర్వాత
దక్షిణ భారత్ లోని పలు భాగాలను తన రాజ్యం లో కలుపుకున్నాడు అని మనం చరిత్రలో చదువుకున్నాము.
చారిత్రక, ధార్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను గలిగివున్న
ఈ నగరంలోని "శ్రీరంగనాధ స్వామి "ఆలయంలో వెలసిన రంగనాధస్వామి పేరున ఈ నగరానికి "శ్రీరంగపట్టణం " అనే పేరు వచ్చిందని చెపుతారు..
ఈ ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారని చరిత్ర .
మైసూర్ రాజధాని నగరానికి సమీపంలో గల కోట, శ్రీరంగపట్నం కోటను నియంత్రిస్తోందని చెపుతారు.
రంగరాయను ఓడించిన వడయార్ రాజు శ్రీరంగపట్టణాన్ని వశబర్చుకుని , పిదప విజయనగర సామ్రాజ్యంపై దండెత్తేడని, అందుకై విజయనగర సామ్రాజ్య ఆరాధ్య దేవతయైన అలిమేలమ్మ కోపించి , వడయార్ రాజును శపించిందనీ, దాని కారణాన వడయార్ రాజుకు సంతానం కలుగలేదని ఓ కథనం ఉన్నది.
ఆ కారణంగా అప్పటి అధికారంలో ఉన్న వడయార్ వంశస్థుడైన చామరాజ వడయార్ రాజులే ఇప్పటికీ అధికారికంగా మైసూర్ మహారాజులుగా పరిగణింపబడుతున్నారు.
అప్పటి శ్రీరంగపట్నం వైస్రాయ్ ,రంగరాయను ఓడించి,
మైసూర్ యొక్క రక్షక దేవత అయిన చాముండేశ్వరీ దేవి సమక్షంలో ,పది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంతోపాటు, సింహాసనంపై హక్కుదారులు ఎవరైనా మైసూర్ రాజ్యంపై నియంత్రణను ప్రదర్శించి, సార్వభౌమాధికారాన్ని సూచించగలరని తెలియజేయడంతో ,
కాలక్రమేణా అదే మాట అంగీకరించబడి నేటికీ కొనసాగుతోందంటారు.,
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మైసూర్ రాజ్యంలో భాగంగా ఉండేదని, అప్పట్లో
శ్రీరంగపట్నం మైసూర్ రాజధాని నగరానికి దగ్గరగా ఉన్న కోటగానేగాక ,దండయాత్ర జరిగే సమయంలో ఇది
రాజ్యానికి రక్షణ కోటగా పరిగణించబడేదని అంటారు..
అటుపై శ్రీరంగపట్నం దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన వైష్ణవ తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటిగా మారింది
పట్టణం మొత్తం కావేరీ నదిచే చుట్టబడి, ఇదో ద్వీపంలా కనబడుతుాండడంతో అక్కడి కొన్ని ప్రదేశాలు UNESCO ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా నామినేట్ చేయబడ్డాయి.
కావేరీ నదిలో ఏర్పడిన అన్ని ద్వీపాలు శ్రీ రంగనాథస్వామికి సంబంధించిన పవిత్రమైన ప్రదేశాలుగా మన సాంప్రదాయ చరిత్ర చెబుతుంది .
మూడు అతిపెద్ద ద్వీపాలలో దేవుడికి అంకితం చేయబడిన పెద్ద దేవాలయాలు, చాలా పురాతన కాలంలోనే నిర్మించబడ్డాయి. కావేరీ నదిలో ఏర్పడిన సహజ ద్వీపాలలో ఉన్న రంగనాథ దేవుడి మూడు ఆలయాలలో శ్రీరంగపట్నం ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది . ఇక్కడ కొలువైన రంగనాధుడు " ఆది రంగనిగా " పుాజలందుకుంటున్నాడు.
ఇక భారతదేశంలో కర్ణాటకలోని చామరాజనగర జిల్లా , కొల్లేగల తాలూకాలోని శివనసముద్రంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం "మధ్య రంగ !" ఆలయంగా...
భారతదేశ తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా , శ్రీరంగం తాలూకాలోని " శ్రీ రంగనాథస్వామి ఆలయం "అంత్య రంగ" ఆలయంగా ప్రసిద్ధి చెందేయి.
శ్రీరంగపట్నంలోని కావేరీలోని పశ్చిమ వాహిని విభాగం
ప్రత్యేకించి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది; పుణ్యాత్ములు దూర ప్రాంతాల నుండి వచ్చి, మరణించిన వారి బూడిదను నిమజ్జనం చేయడమేగాక, ఈ నీటిలో తమ పూర్వీకులకు పిండతర్పణాది కార్యక్రమాలను నిర్వహిస్తారు..
విజయనగర సామ్రాజ్య కాలంనుండి పుణ్యక్షేత్రంగా, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ.
శ్రీరంగపట్టణంలో పలు ప్రదేశాలు చూడదగినవిగా ప్రసిద్ధిచెందినవి చాలానే ఉన్నాయి..
వాటిలో ముఖ్యమైనవి :
రంగనాధ ఆలయం : ఈ ఆలయం చాలా పురాతనమైనదే కాక హైందవ సంప్రదాయంలో, అందులోనూ వైష్ణవ సంప్రదాయంలో మరీ ప్రఖ్యాతి పొందినది. మైసూరును హైదరాలీ పరిపాలించిన కాలంలో ఈ ఆలయానికి సమీపంలోని మందుగుండు సామగ్రి కార్ఖానా పేలి రంగనాథస్వామి దేవాలయ గోపురం విరిగిపడిందని,
హైదర్ అలీ వెన్వెంటనే తన సైనికులను పంపి వారిచేతనే దేవాలయ గోపురాన్ని పునఽనిర్మింపజేశారని చెపుతారు.
జుమ్మా మసీదు, రంగన్నతిట్టు పక్షి అభయారణ్యం,
కరిఘట్ట,శివసముద్రం జలపాతం, వంటి పర్యాటక స్థలాలు
చుాసినకొలదీ చుాడాలనిపించేట్టు ఉంటాయి.
శివసముద్రం జలపాతం భారత్ లో రెండవ అతిపెద్ద జలపాతంగానేగాక, ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతంగా
పదహారవస్థానంలో ఉంది.
ఇక పోతే రంగన్నతిట్టు పక్షి అభయారణ్యం అన్నది
ఒకప్పటి మైసూర్ రాజైన కంఠీరవ నరసింహరాజ వడియార్ కావేరీ నదికి అడ్డంగా ఒక కట్టను నిర్మించినప్పుడు రంగనాతిట్టు యొక్క ద్వీపాలు ఏర్పడి , పక్షులను ఆకర్షించడం ప్రారంభించడం ,.రాను రాను
వేలు, లక్షల సంఖ్యలో ఈ పక్షులే కాక ఇతర వన్య ప్రాణులు కుాడా వచ్చి బస చేయడంతో ఈ అరణ్యం , అభయారణ్యంగా పిలువబడుతుా రాష్ట్రంలోనే
అతిపెద్ద పక్షి అభయారణ్యంగా ప్రసిద్ధి చెందింది. నలభై ఎకరాల విస్తీర్ణంతో , కావేరీ నది ఒడ్డున, ఆరు ద్వీపాలను కలిగి ఉండి , .దాదాపు నుాట డెబ్భై పక్షి జాతులు కలిగి ఉన్న అరణ్యంలో..
శీతాకాలపు నెలలలో, డిసెంబర్ మధ్య నుండి మొదలై, దాదాపు నలభైవేల పక్షులు రంగనాతిట్టు వద్ద సమావేశమవుతాయట,
ఈ కర్ణాటక లో ఒక్క శ్రీరంగ పట్నమే కాక చుాడవలసున ఎన్నో ప్రదేశాలున్నాయి
హంపి , ధర్మస్థల, మెల్కొటే, ఉడిపి, కుక్కే సుబ్రహ్మణ్య,
శృంగేరి మఠం, హొరనాడు, శ్రావణబెళగొళ వంటి పర్యాటక పుణ్య స్థలాలు చుాసి తీరవలసిందే .
ఇవేకాక ప్రతీ చిన్న పల్లెలోగల గ్రామ దేవతలు వారి మహిమల గురించి వచ్చి చుాసి తెలుకోవలసిందే..
కాలుష్య రహితమైన ప్రదేశాలు, పురాతన కట్టడాలు రాజుగారి కోట తో పాటు , మరెన్నో చారిత్రాత్మిక, ధార్మిక కళాఖండాలతో ప్రసిద్ధికెక్కిన ఈ మైసుారు పట్టణాన్ని చుాడడం మాకెంతో ఆనందాన్ని మానసిక సంతృప్తిని కలిగించింది.
ఇక్కడి వ్యవహారిక భాష కన్నడ భాష .
బెంగుళూరు , మైసూర్ నుండి రైలు ద్వారా ఈ శ్రీరంగ
పట్టణానికి సులభంగా చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం ద్వారా ఉన్న హైవే నుండి కుాడా ఇక్కడకు చేరుకోవచ్చు .
మీరుకుాడా ఒక్క సారి వచ్చి ఈ పర్యాటక ప్రదేశాలన్నీ
చుాస్తారు కదుా..
హామీ :
ఈ వ్యాసం నా స్వీయ రచన .
No comments:
Post a Comment