5/04/2023.
మహిళా మనోహరి మాస పత్రిక కోసం .
అంశం: చందమామ కధలు.
శీర్షిక : చింటుా..చేసిన సాయం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర .
ఆరోజంతా పరధ్యానంగానే గడిపాడు చింటుా.
వాళ్ళ నాన్నగారికి మళ్ళీ మరో ఊరికి ట్రాన్ఫర్ ఆర్డర్స్ వచ్చేయి. ఇంకో నాలుగు రోజుల్లో ప్రయాణం .
చింటుాకి ఇక్కడ చాలా బాగుంది .
చాలా మంది మంచి మంచి స్నేహితులున్నారు.
ఒక మంచిపని చేయడమన్నా , ఒకరికి సహాయం చేయడమన్నా , చెట్లు నాటడమన్నా అందరికీ చాలా యిష్టం.ఆ రకమైన భావనలు ఉన్నా వారంతా ఒకటై
ఎంతోమంది చేత మంచి పిల్లలు అని అనిపించుకున్నారు.
తామంతా కలిస్తే , ఆట పాటలతొ సమయం తెలియనే తెలియదు.
అలాంటిది ఇప్పుడు అందరినీ వదిలి వెళిపోవాలంటే
చింటుాకి ఏదోలా ఉండి ఏడుపొస్తోంది.
నాన్నాగారికి ప్రతీ ముాడు సంవత్సరాలకి మరో ఊరికి
బదిలీ అవుతుా ఉంటుంది.
అప్పుడుకుాడా తను ఇంతలా బాధ పడలేదు.
కారణం , ఇంత మంచి స్నేహితులు ఎక్కడా కలవలేదు.
ఇంకా తాము అనుకున్న పనులు పుార్తి కానేలేదు.
అంతలోనే ఈ బదిలీ....
ముాడు సంవత్సరాలు ఎంతో వేగంగా గడచిపోయాయి
అనిపించింది చింటుాకి.
భారంగా స్నేహితులకు వీడికోలు చెప్పి తల్లిదండ్రులతో బయలుదేరాడు.
----------------------+------
తాము వచ్చిన ఊరు చాలా చిన్న పల్లెటుారు.
అక్కడకు వచ్చిన పది రోజుల తర్వాత చింటుా వాళ్ళ నాన్న చింటుాని ఒక స్కుాల్ లో నాలుగవ తరగతిలో జాయిన్ చేసేరు.
వాళ్ళకి కారుండడం వల్ల చింటుా కారులో చాలా దుారం ప్రయాణించి స్కుాల్ కి వెళ్ళి వస్తున్నాడు. వాళ్ళ డ్రైవరు ఆదివారాలు వస్తే పట్టణం నుండి ఇంటికి కావలసిన ముడి సరుకంతా తెచ్చేవాడు.
ఏ ఒక్కటి మర్చి పోయినా చాలా ఇబ్బంది అయ్యేది.
చిన్న చిన్న కొండలు గుట్టలతో అక్కడక్కడ ఉన్న స్లేబ్
ఇళ్ళతో చాలా బాగుంది కానీ ,తమలాంటి కొంతమంది తప్ప
అక్కడ అస్సలు జనాలే లేరు.
చుట్టుా చెట్లతో నిండి ఉన్నందువల్ల కృుార జంతువుల భయంతో సాయంత్రం ఆరు గంటలకే అందరుా ఇళ్ళ లోపలికి వెళిపోయి తలుపులు వేసీసుకుంటారు.
దాంతో చింటుాకి చాలా చికాకుగా భయంగా ఉండేది.
ఒక రోజు పగలు పది గంటలకు అలా తిరగడానికి వెళ్ళిన చింటుాకి ..కొంత దుారంలో చిన్న కాలి బాట కనిపించింది.
అదేమిటో చుాద్దామనుకొని ఆ తోవ గుండా బయలుదేరేడు చింటుా.
ఆ దారి చాలాదుారం తర్వాత ఒక చిన్న గుట్ట దగ్గరకు వచ్చి ఆగింది.
అక్కడ చాలామంది పిల్లలు మట్టిలో దొర్లుతుా నవ్వుకుంటుా ఆనందంగా ఆడుకుంటున్నారు. ఆడవాళ్ళు ముాడు రాళ్ళు పెట్టి పొయ్యిలా చేసి దాని మీద ఏదో వండుతున్నారు.
మగవాళ్ళంతా హాయిగా కుార్చొని కబుర్లాడుతున్నారు .
వాళ్ళున్న జాగా చుట్టుా ముళ్ళ కంచెలతో గోడలా చుట్టి ఉంది.
చింటుాకి చెప్పలేని ఆనందం కలిగింది. ఇంత మంది పిల్లలు
ఇక్కడ ఉన్నా ఇంత వరకు వాళ్ళంతా ఊరిలోకి ఎందుకు రాలేదో.. అనుకుంటుా వాళ్ళ దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేసేడు.
వాళ్ళు తనను చుాసి ఆటలు ఆపీసేరు .పిల్లా పెద్దలు అందరుా తనను చుాసి కుాడా మాట్లాడలేదు.
చింటుా చాలా సేపు అక్కడ ఉండీ నిరాశగా వెను తిరిగాడు.
ఆరోజు నుండీ చింటుా రోజుా అక్కడికి వెళ్ళేవాడు.
వాళ్ళ ఆటలు చుాసేవాడు ..వాళ్ళు చింటుాని చుాసేవారు.
కానీ మాట్లాడేవారు కాదు.
అలా కొన్ని రోజులు గడిచింది.
ఒకరోజు చింటుా తెల్లారి వాకింగ్ సమయంలో వాళ్ళ నాన్నగారిని అక్కడికి తీసుకొచ్చి చుాపించేడు .
అతను కుాడా ఆశ్ఛర్యపోయాడు . ఈ అడవిలాంటి ప్రాంతంలో వాళ్ళంతా ఒక జట్టుగా తమను తాము ఎందుకు
నిర్బంధించుకొని ఎందుకలా ఉన్నారో అర్ధం కాలేదు.సరికదా వాళ్ళు తనను చుాడగానే తమ పిల్లలను గట్టిగా పట్టుకొని
తనవైపు చుాడడం ఆశ్ఛర్యం కలిగించింది. అందులో కొంతమంది పెద్దలు తమవైపు చుాస్తుా ఏవేవో అరుస్తుా , కొడతామన్నట్లు రాళ్ళు చేతితో ఎత్తి పట్టుకున్నారు.
చింటుా వాళ్ళ నాన్నగారు గబ గబా చింటుాని తీసుకొని
ఇంటి త్రోవ పట్టేరు.
చింటుాకి వాళ్ళ నాన్నకి చాలా బాధ వేసింది .అంత మంది పిల్లలు చదువు లేక సరైన పోషణ లేక ఒక పెద్ద ముళ్ళ కంచె మధ్యలో భయంగా జీవితం గడపడం సహించ లేకపోయేరు.
అతను అక్కడి గవర్నమెంట్ లో పెద్ద పెద్ద వారితో
చాలా సార్లు వీరి గురించి మాట్లాడేరు.
ఈలోపల చింటుా వారున్న జాగాకు దగ్గరలో కొంత భుామిని తవ్వి కొన్ని కుారగాయల చెట్లు పుాల చెట్లు నాటేడు.
కొన్ని రోజులకు కాయలు పుావులు వచ్చేయి .
కానీ వాళ్ళు మాత్రం బయటకు రాలేదు.
చింటుాకి ఏం చేయాలో అర్ధం కాలేదు.
ఒకరోజు చింటుా వాళ్ళ నాన్న గారితో యధాలాపంగా వాకింగ్ కి వచ్చేసరికి అక్కడి వారంతా ఒక పిల్లడి చుట్టుా
ముాగి ఏదో చేస్తున్నారు .ఆడవాళ్ళు కొంతమంది ఏడుస్తున్నారు.
ఆపిల్లాడికి తల నుండి రక్తం కారిపోతోంది.
అది చుాసి చింటుా వాళ్ళ నాన్న వెంటనే తమ డ్రైవరుకు ఫోన్ చేసి తామున్న చోటుకు రమ్మన్నారు. డ్రైవర్ రాగానే అతడు ఆ ముళ్ళ కంచె కున్న గేటును ధైర్యంగా విప్పి ..
ఆ అబ్బాయిని బలవంతంగా కారులోకి ఎక్కించేడు.
అక్కడి వాళ్ళంతా వీళ్ళపై రాళ్ళు రువ్వుతుా చాలా హింసించేరు. దాని వల్ల వాళ్ళకు కుాడా చాలా గాయాలయ్యాయి. ఐనా లెక్క చేయకుండా వాళ్ళు ఆ పిల్లడిని దుారంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళి తలకి
కట్లు కట్టించేరు .ఆ రాత్రంతా అక్కడే ఉండి మర్నాడు
ఆపిల్లాడిని వాళ్ళకి అప్పగించడానికి వెళ్ళేరు.
దుారం నుండి కారును చుాసిన వాళ్ళు కోపంగా లేవబోయి
కారులోంచీ తమ పిల్లాడు దిగడం చుాసి ఆగిపోయారు.
పిల్లాడి తలకు కట్లున్నాయి .పిల్లాడు నడిచి వచ్చి వాళ్ళ అమ్మను చేరి ఏదేదో చెప్పేడు. అక్కడున్న వారంతా తమ వేపు ఆశ్ఛర్యఃగా చుాసేరు.
చింటుా ధైర్యం చేసి ముళ్ళ కంచె దాటి లోపలికి వెళ్ళేడు.
వాళ్ళంతా చింటుా చుట్టుా చేరి బాగా ముద్దు చేసేరు.
ఆతర్వాత నుండీ చింటుా వారితో సమయం దొరికినపుడల్లా ఆడుకోసాగేడు.
ఒక రోజు వాళ్ళ అమ్మను తీసుకొచ్చి ,తను వేసిన కుారగాయలన్నీ కోసి వండించి వాళ్ళ చేత తినిపించేడు.
వాళ్ళంతా చాలా సంతోషపడ్డారు.
చింటుా వాళ్ళ నాన్న చాలామందితో మాట్లాడి
అక్కడ తారు రోడ్డు వేయించేరు.
ఆనోట ఈ నోట వీరి సంగతి పట్టణం చేరింది .
ఎలక్షన్ టైమ్ లో కొంతమంది నాయకులు అక్కడికి వచ్చి
వారికి మరుగు దొడ్లు, రేకుల షెడ్డులు వేసి యిచ్చేరు.
గవర్నమెంట్ వారు వాళ్ళకు ఇళ్ళు కట్టి ఇచ్చేందుకు
ఒప్పుకున్నారు.
కొన్ని నెలలలోనే అక్కడి రుాపు రేఖలు మారిపోయాయి.
కొత్త స్కుాలు వచ్చింది. చిన్న ఆసుపత్రి వచ్చింది.
ఇప్పుడు అక్కడి పిల్లలందరుా ఆ స్కుాల్ లో చదువుతున్నారు.
ఇక చింటుా పెద్ద హీరో ఐపోయాడు
పేపర్లో చింటుా ఫోటో తో పాటు అక్కడి పిల్ల లందరి ఫోటోలు
వచ్చేయి.
తమ జీవితాలను బాగు చేసిన చింటుాని అక్కడి వారంతా చాలా బాగా చుాసుకుంటున్నారు
ఆ చిన్ని ఊరంటే చింటుాకి ఇప్పుడు చాలా యిష్టం.
ఆవిధంగా చింటుా ఆ పల్లెను అందరికీ తెలిసేలా చేసి
అందరి మన్ననలుా పొందేడు.
చుాసారా పిల్లలుా...
మీరు కుాడా చింటుాలాగే అవసరమైన వారికి సాయం
చేసి మంచి పేరు తెచ్వుకుంటారు కదుా..
సమాప్తం .
హామీ:
ఈ కధ ఏ మాధ్యమునందునుా ప్రచురితముకాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment